Wednesday, 18 November 2026

హైదరాబాద్

రాజస్థాన్‌లో వసుంధరారాజే భాజపా సారధి

రాజ్‌ నాధ్‌ సింగ్‌ న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న రాజస్థాన్‌ విధానసభ ఎన్నిరల్లో భాజపా ప్రచారానికి మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే నేతృత్వం వహిస్తారని పార్టీ అధ్యక్షుడు రాజ్‌ నాధ్‌ సింగ్‌ వెల్లడించారు. మరో సీనియర్‌నేత గులాబ్‌ చంద్‌ కటారియా…

సీబీఐ విచారణ జరపాలి

శంకర్రావు కుమార్తె సుస్మితా హైదరాబాద్‌: తన తండ్రి శంకర్రావు పట్ల పోలీసులు అనుసరించిన వ్యవహారం పై ప్రభుత్వం నియమించిన సీఐడీపై తమకు విశ్వాసం లేదని సీబీఐతో విచారణ జరిపించాలని శంకర్రావు కుమార్తె డిమాండ్‌ చేశారు. ఉదయం విచారణ జరుపుతున్న…

శంకర్రావును పరామర్శించిన కోదండరామ్‌

హైదరాబాద్‌: కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి శంకర్రావును తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మెన్‌ ప్రొ.కోదండరామ్‌ పరామర్శించారు. తెలంగాణ కోసం ఆది నుంచి పోరాడుతున్న కాంగ్రెస్‌ నేత ఎవరైనా ఉన్నారంటే అది శంకర్రావేనని ఆమనన్నారు.

రేపు తెలంగాణ రాజకీయ ఐకాస సమావేశం : ప్రొ. కోదండరాం

హైదరాబాద్‌: ఆదివారం జరిగే తెలంగాణ రాజకీయ ఐకాస విసృతి స్థాయి సమావేశంలో ఉద్యమ కార్యాచరణకు తుదిరూపు ఇవ్వనున్నట్టు తెలంగాణ రాజకీయ ఐకాస నేత ప్రొ. కోదండరాం తెలియజేశారు. ఈ సమావేశంలో రహదారుల దిగ్బంధం ఛలో అసెంబ్లీ… తదితర కార్యక్రమాలపై…

్‌హైదరాబాద్‌లో బాంబు బెదిరింపు

హైదరాబాద్‌: నగరంలోని విధానసభ, సచివాలయం, బిర్లా మందిర్‌… తదితర ప్రాంతాల్లో బాంబులు పెట్టామని గుర్తు తెలియని వ్యక్తినుంచి పోలీసులకు ఫోన్‌కాల్‌ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబు నిర్వీర్యదళం సభ్యులు పోలీసు జాగిలాలను తీసుకొని సోదాలు నిర్వహిస్తున్నారు.

శంకర్రావు వ్యవహారంలో విచారణ ప్రారంభం

హైదరాబాద్‌: మాజీ మంత్రి శంకర్రావు అరెస్టు వ్యవహారంలో ప్రభుత్వ నియమించిన ఉన్నత స్థాయి కమిటీ విచారణ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో శంకరావ్రు నుంచి వాంగ్మూలం తీసుకునేందుకు సీఐడీ బృందం కేర్‌ ఆస్పత్రికి వెళ్లింది. శంకర్రావుతో పాటు ఆయన కుటుంబ…

ముఖ్యమంత్రిని దించేందుకే బొత్స యత్నం : జోగి రమేష్‌

విజయవాడ : పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జోగి రమేష్‌ తీవ్ర విమర్శిలు చేశారు. సీఎం పదవి నుంచి కిరణ్‌కుమార్‌ రెడ్డిని దించేందుకే బొత్స యత్నిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేలను బహిష్కరించి రాజ్యాంగా సంక్షోభానికి బొత్స తెరతీశారు…

వరంగల్‌ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు

వరంగల్‌ వరంగల్‌ రైల్వేస్టేషన్‌లో రెండు రోజుల క్రితం వదిలి వెళ్లిన బ్యాగు  కలకలం సృష్టిస్తోంది దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబుస్వాడ్‌ తనిఖీలు నిర్వహిస్తోంది. ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.

శంకర్‌రావుకు నేతల పరామర్శ

హైదరాబాద్‌: కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పోందుతున్న మాజీ మంత్రి శంకర్‌రావును పలువురు నేతలు పరామర్శించారు. మంత్రులు ప్రసాద్‌కుమార్‌, రఘువీరారెడ్డి, భాజపా నేత సీహెచ్‌ విద్యాసాగర్‌రావు తదితరులు పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

తల్లిని గొంతునులిమి చంపిన కసాయి

దుబ్బాక : మెదక్‌ జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవెల్లిలో ఓ కసాయి తనతల్లిని గొంతునులిమి చంపాడు. వయస్సు మీదపడిన తల్లికి సేవలు చేయలేక చంపినట్లు అతని అంగీకరించాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.