Tuesday, 3 November 2026

ముఖ్యమంత్రిని దించేందుకే బొత్స యత్నం : జోగి రమేష్‌

విజయవాడ : పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జోగి రమేష్‌ తీవ్ర విమర్శిలు చేశారు. సీఎం పదవి నుంచి కిరణ్‌కుమార్‌ రెడ్డిని దించేందుకే బొత్స యత్నిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేలను బహిష్కరించి రాజ్యాంగా సంక్షోభానికి బొత్స తెరతీశారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బొత్స సత్యనారాయణ పార్టీని సర్వనాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. షోకాజ్‌ నోటీసులు ఇవ్వకుండా పార్టీ నుంచి బహిష్కరించడం దారుణమన్నారు. కాంగ్రెస్‌ పార్టీ విధానాలకు తాము ఎప్పుడూ వ్యతిరేకంగా  మాట్లాడలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌, టీడీపీ కుమక్కయ్యాయన్న ఆరోపణలను బొత్స ఇప్పుడు నిజం చేశారన్నారు. కాంగ్రెస్‌కు సరైన సంఖ్యాబలం లేకుండా పాలన ఎలా కొనసాగిస్తారని ప్రశ్నించారు. తొమ్మిది మంది బహిషృకత ఎమ్మెల్యేల్లో తన పేరు ఉంటే ఎందుకు చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. పార్టీలో అంతర్గత కలహాలు సృష్టించేందుకు బొత్స తెర లేపారని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *