Tuesday, 17 November 2026

హైదరాబాద్

ప్రధాని నివాసంలో కాంగ్రెస్‌ కీలకబృంద సమావేశం

న్యూఢిల్లీ : ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నివాసంలో కాంగ్రెస్‌ కీలకబృందం సమావేశం మైంది. అత్యాచార బాధితురాలి మృతి, తదనంతరం పరిణామాలు, అంత్యక్రియల నిర్వహణ తదితర అంశాలపై వారు చర్చించినట్టు తెలియవచ్చింది.

బాధితురాలి మృతిపై తెదేపా కార్పొరేటర్ల సంతాపం

హైదరాబాద్‌: దేశ రాజధాని నగరంలో అత్యాచారానికి గురైన పారా మెడికల్‌ విద్యార్ధిని మృతిచెందడంపై తెలుగుదేశానికి చెందిన కార్పోరేటర్లు సంతాపం వ్యక్తం చేశారు. నగర పాలకసంస్థ ప్రధాన కార్యాలయంలో కొవ్వొత్తులు వెలగించి యువతి మృతికి మౌనంపాటించారు.

తెలుగుసభలో తెలంగాణకు గౌరవం లభించలేదు : కేకే

హైదరాబాద్‌: ప్రపంచ తెలుగు మహాసభల్లో తెలంగాణ ప్రాంతంవారికి సముచిత స్థానం లభించకపోవడంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేశవరావు విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రముఖులైన సినారె, దాశరధి లాంటి వారికి ప్రాతినిధ్యం ఇవ్వలేదన్నారు. తెలుగు మహాసభల ఆహ్వానపత్రికలో దళితుడైన…

తెదేపా వైఖరి బాధాకరం : లగడపాటి

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా తెలుగుదేశం వ్యవహరించడం బాధాకరమని విజయవాడ లోక్‌సభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌ అన్నారు. తెలుగుదేశం పుట్టిందే తెలుగువారి ఆత్మాభిమానం కోసమని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకే తెలుగుదేశం తెలంగాణ అంశానికి మద్దతు ఇస్తోందన్నారు.

తెలంగాణ వచ్చేదాక వత్తిడి ఉండాల్సిందే : కె. కేశవరావు

హైదరాబాద్‌: గత అనుభవారి దృష్ట్యా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వరకు అధిష్టానంపై ఒత్తిడి ఉండాల్సిందే నని టీ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కే. కేశవరావు స్పష్టం చేశారు. ఈ సాయంత్రం కేకే నివాసంలో తెలంగాణ ఎంపీల సమావేశం ముగిసింది.…

తెలుగు తల్లి మనసు పులకించే విధంగా సభలు :చిరంజీవి

తిరుపతి : తెలుగుతల్లి మనసు పులకించేవిధంగా ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించడం అభినందనీయమని కేంద్ర పర్యాటక మంత్రి చిరంజీవి అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుసభల  నిర్వహణకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి…

టీఆర్‌ఎస్‌ పోలిట్‌బ్యూరో భేటీ ప్రారంభం

హైదరాబాద్‌: తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ పోలీట్‌బ్యూరో సమావేశం శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైంది. ఈ సమావేశం టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అధ్యక్షతన జరుగుతోంది. సమావేశంలో ఉద్యమ కార్యాచరణపై చర్చిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కేంద్ర,…

తెలంగాణపై చంద్రబాబును నిలదీసిన మహిళలు

వరంగల్‌ : చిట్యాల  మండలం దుబ్యాలలో చంద్రబాబుకు పరాభవం ఎదురైంది. స్త్రీల కోసం కొత్త పథకాలు ప్రవేశపెడుతామన్న బాబుకు మహిళలు షాకిచ్చారు. పథకాలు అవసరం లేదు, తెలంగాణకు అనుకూలమని చెప్తే చాలు అని బాబును మహిళలు నిలదీశారు.  మహిళల…

తెలుగు మహాసభల నిర్వహణ అభినందనీయం : హమీద్‌ అన్సారీ

తిరుపతి : తిరుపతిలో నాలుగో ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహాణ అభినందనీయమని ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్నారీ అన్నారు. తెలుగుమహాసభలకు ఆయన సందేశం పంపారు. సుసంపన్నమైన తెలుగు భాషాభివృద్ధికి తెలుగు మహాసభలు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు.

దేశాభివృద్ధిలో తెలుగువారిది కీలకపాత్ర : ప్రధాని మన్మోహన్‌సింగ్‌

తిరుపతి : దేవాభివృద్థిలో తెలుగువారు కీలకపాత్ర పోషించారని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ పేర్కొన్నారు. ప్రపంచ నాలుగో మహసభల సందర్భంగా ఆయన సందేశం పంపారు. ప్రవాస భారతీయుల్లో తెలుగువారి స్థానం ఉన్నతమైందని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు.