Monday, 16 November 2026

హైదరాబాద్

జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత

హైదరాబాద్‌: సీబీఐ న్యాయస్థానంలో జగన్‌కు మరోసాని భంగపాటు ఎదురైంది. అక్రమాస్తుల కేసులో అరెస్టై జైలులో ఉన్న జగన్‌ దాఖలుచేసుకున్న రెండు బెయిల్‌ పిటిషన్‌లలో ఒకదానిని సీబీఐ న్యాయస్థానం కొట్టివేసింది. మరో పిటిషన్‌పై విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. ఏడు…

శుక్రవారం నుంచీ అందుబాటులోకి రానున్న యాపిల్‌ ఐయ్యాక్‌లు

ఢిల్లీ: వచ్చే శుక్రవారం (నవంబరు 30) నుంచీ భారత్‌లో కొత్త ఐమ్యాక్‌లను విక్రయించనున్నట్లు యాపిల్‌ కంపెనీ ప్రకటించింది. 21.5 అంగుళాల కొత్త ఐమ్యాక్‌లు యాపిల్‌ ఆధరైజ్‌డ్‌ షోరూముల్లో లభిస్తాయని, 27 అంగుళాల ఐమ్యాక్‌లు మాత్రం యాపిల్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌…

జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేసిన సీబీఐ కోర్టు

హైదరాబాద్‌: వైకాపా అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మరోసారి సీబీఐ కోర్టులో చుక్కెదురైంది. జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. తనకు బెయిల్‌ మంజూరి చేయాల్సిందిగా జగన్‌ సీబీఐ కోర్టును ఆశ్రయించిన విషయం విదితమే అయితే బుధవారం బెయిల్‌…

అణుసామర్థ్యం గల క్షిపణిని పరీక్షించిన పాకిస్థాన్‌

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ ఈ రోజు అణ్వాయుధ సామర్థ్యం కల క్షిపణిని పరీక్షించింది. 1300 కిమీ. వరకూ లక్ష్యాన్ని చేదించగల ఘోరీ అనే ఈ క్షిపణిని పాకిస్థాన్‌ మిలిటరీ ప్రయోగాత్మకంగా పరిశీలించినట్లు సమాచారం తెలిసింది.

పాలసేకరణను నిలిపివేయొద్దు : బొత్స

హైదరాబాద్‌: ఎట్టి పరిస్థితుల్లోనూ పాలసేకరణను  నిలిపివేయొద్దని పీసీసీ చీఫ్‌, రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈమేరకు ఆయన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. పాలసేకరణ నిలిపివేస్తే రైతులు, పాల వినియోగదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారని…

స్పీకర్‌తో మంత్రి డీఎల్‌ భేటీ

హైదరాబాద్‌: రాష్ట్ర మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి ఈరోజు శాసనసభ సభాపతి నాదెండ్ల మనోహర్‌తో భేటీ అయ్యారు. వ్యక్తిగత కారణాలవల్ల శాసనసభ సమావేశాలకు హాజరు కాలేనని ఆయన సభాపతికి తెలిపినట్లు సమాచారం.

ఆస్పత్రుల సేవలు సామాన్యులకు అందుబాటులో ఉండాలి : నాగేందర్‌

హైదరాబాద్‌: సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ప్రైవేటు ఆస్పత్రులు సేవలందించాలని కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్‌ అన్నారు. హైదరాబాద్‌ సోమాజిగూడలో కొత్తగా కట్టిన ఇషా మల్టి స్పెషాలిటీ ఆసుపత్రిని మంత్రి ప్రారంభించారు. ఆధునిక శాస్త్ర పరిశోధనల ఫలితంగా…

అగ్నిప్రమాద ఘటనపై పుప్పాలగూడలో కేసు నమోదు

హైదరాబాద్‌: నగర శివారులోని పుష్పాలగూడలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై లోకాయుక్త స్పందించింది. శ్రీరాంనగర్‌ కాలనీలో సినిమా ఘాటింగ్‌కు సంబంధించిన పరికరాలు, దుస్తులు ఉంచిన షెడ్డు నుంచి మంటలు చెలరేగి పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌కు వ్యాపించి ఏడుగురు మరణించిన సంగతి…

భాజపా నేతలతో కమల్‌నాథ్‌ భేటీ

ఢిల్లీ: భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నేతలు సుష్మాస్వరాజ్‌, అరుణ్‌జైట్లీలతో పార్లమెంటు వ్యవహారాల మంత్రి కమల్‌నాధ్‌ నేడు భేటీ అయ్యారు. చిల్లరవర్తకంలో విదేశీ పెట్టుబడుల విషయమై కేంద్రం చర్చకు అంగీకరించిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.

పార్లమెంటు ఆరవరణలో అగ్నిప్రమాదం

న్యూఢిల్లీ : పార్లమెంటు ఆవరణలో బుధవారం మధ్యాహ్నం 12.30 ప్రాంతంలో స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. 78వ నెంబర్‌ గదినుంచి ఒక్కసారిగా పొగలు రావడంతో అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమై మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. ప్రమాదానికి కారణాలపై…