Monday, 16 November 2026

హైదరాబాద్

నేపాల్‌ మాజీ యువరాజు అరెస్టు

బ్యాంకాక్‌: నేపాల్‌ మాజీ యువరాజు పరాన్‌షాను మాదక ద్రవాలు కలిగివున్నాడనే ఆరోపణపై థాయ్‌లాండ్‌ పోలీసులు అరెస్టు చేసినట్టు తెలియవచ్చింది. అక్టోబరు 27న థాయ్‌లాండ్‌ ప్రముఖ విహారకేంద్రమైన పుకెట్‌లో పరాన్‌ను అదుపులోకి తీసుకొని అనంతరం బెయిల్‌పై విడుదల చేసినట్టు థాయ్‌…

ఎస్సీకులాలకు నిధులు అందాలి :నర్సింహులు

హైదరాబాద్‌: ఎస్సీ,ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు జనాభా ప్రాతిపదికన ఎస్సీ కులాలందరికీ అందాలని తెలుగుదేశం నేత మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్‌ చేశారు. తెలుగుదేశం వ్యూహబందం జరిపిన సమావేశంలో ఉప ప్రణాళికకు చట్టబద్దత కల్పించడాన్ని కమిటీ స్వాగతించింది.

భాజపా నేతలతో కమల్‌నాధ్‌ సమావేశం

న్యూఢిల్లీ: పార్లమెంటులో ఎఫ్‌డీఐలపై కొనసాగుతున్న ప్రతిష్టంభను తొలగించేందుకు యూపీఏ  ప్రయత్నాలు ముమ్మరం చేసింది, బుధవారం పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి కమల్‌నాధ్‌ పార్లమెంటులో భాజపా పక్షనేతలు సుష్మాస్వరాజ్‌, అరుణ్‌జైట్లీలతో సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం ఆయనవిలేకరులతో మాట్లాడుతూ పార్లమెంటులో యూపీఏకు…

పుప్పాలగూడ అగ్నిప్రమాదంలో మరొకరి మృతి

హైదరాబాద్‌: నగరంలోని పుప్పాలగూడ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 8కి చేరింది. ఈప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చికిత్స పొందుతున్న ఎం. అనంతరావమ్మ (52) బుధవారం మృతిచెందింది.

పెద్దిరెడ్డికి జైపాల్‌ ఫోన్‌

హైదరాబాద్‌: శాసనసభ్యత్వానికి  రాజీనామా చేయాలన్న చిత్తూరు జిల్లా పుంగనూరు శాసనసభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని సముదాయించేందుకు కాంగ్రెస్‌ పెద్దలు రంగంలోకి దిగారు. పెద్దిరెడ్డికి కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి ఫోన్‌ చేసి తొందరపడవద్దని సూచించినట్టు తెలియవచ్చింది, ఈ నెలాఖర్లోగా ముఖ్యమంత్రిని తప్పించకపోతే తాను…

కేసీఆర్‌ను విమర్శిస్తే ఊరుకోం : నాగం జనార్దన్‌రెడ్డి

మెదక్‌: టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును సీమాంధ్ర నేతలు విమర్శిస్తే ఊరుకోమని తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్దన్‌రెడ్డి హెచ్చరించారు. ఇవాళ ఆయన మెదక్‌లో ‘ భరోసా యాత్ర’లో మాట్లాడారు. తెలంగాణ కోసం అన్ని పార్టీలు ఏకమై…

షర్మిల క్షమాపణ చెప్పాలి :జూపల్లి కృష్ణారావు

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ అధినతే కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైఎస్సార్‌సీపీ నేత షర్మిలపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని కేసీఆర్‌కు భేషరుతుగా క్షమాపణ చెప్పాలని,…

సీపీడీసీఎల్‌కు అవార్డు

హైదరాబాద్‌: విద్యుత్‌ ప్రసారంలో  నష్టాలను తగ్గించినందుకు సెంట్రల్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌ (సీపీడీసీఎల్‌)కు అవార్డు లభించింది. ఓవరాల్‌ డిస్ట్రిబ్యూషన్‌ యుటిలిటి విభాగంలో ఈ అవార్డును ప్రకటించారు. రేపు దేశరాజధానిలో కౌన్సిల్‌ ఆప్‌ పవర్‌ యుటిలీటీ నుంచి సీపీడీసీఎల్‌…

ఉత్తమ పర్యాటక ప్రాంతం హైదరాబాదే!

హైదరాబాద్‌: దేశంలోని ఆరు మెట్రో నగరాల్లో ఉత్తమ పర్యాటక ప్రాంతంగా హైదరాబాద్‌ ప్రథమస్థానంలో నిలి,ఇందని ట్రిప్‌     అడ్వైజర్‌ డాట్‌ ఇన్‌ కంట్రీ మేనేజర్‌ నిఖిల్‌ తెలియజేశారు. సెలవుల్ని హైదరాబాదులో గడిపేందుకు దేశ విదేశాల పర్యాటకులు ఇష్టపడుతున్నారని ఆయన…

రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగినా గవర్నర్‌ పట్టించుకోరేం: భాజపా

హైదరాబాద్‌: రాష్ట్రంలో పరిపాలనకు సంబంధించిన అనేక వ్యవహారాల్లో రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగినా గవర్నర్‌ నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం శోచనీయమని భాజపా తప్పుబట్టింది. రాజ్యాంగ పరిరక్షణకు గవర్నర్‌ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి ఎన్‌వీఎన్‌ఎస్‌ ప్రభాకర్‌…