Sunday, 15 November 2026

హైదరాబాద్

పశ్చిమ దిశగా కదులుతున్న తీవ్ర వాయుగుండం

విశాఖ: బంగాళాఖాతంలో విశాఖకు తూర్పు ఆగ్నేయ దిశలో 600 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమంగా పశ్చిమ దిశగా కదులుతూ తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది, తీరం…

నాగం భరోసా యాత్రకు ఓయూ జేఏసీ మద్దతు

హబ్సిగూడ: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నగార సమితి అధ్యక్షుడు నాగం జనార్థన్‌రెడ్డి చేపడుతున్న ‘ భారోసా యాత్రకు ‘ టీఎస్‌జేఏసీ, ఓయూ జేఏసీలు మద్దతు ప్రకటించాయి. తెలంగాణ కోసం ఎవరు పోరాడినా విద్యార్థి జేఏసీ సంపూర్ణ మద్దతు…

కర్నూరు జిల్లా పర్యటనకు బయలుదేరిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి

కలికిరి:ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చిత్తూరు జిల్లా కలికిరి పర్యటన ముగించుకుని కర్నూలు జిల్లాకు బయలుదేరారు. అంతకుముందు ఆయన కలికిరి  సమీపంలో నిర్మాణంలో ఉన్న సైనిక్‌ స్కూల్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు మదనపల్లి ఎమ్మెల్యే షాజహన్‌ పాష, అధికారులు  తదితరులు…

ఐఓఏ ఎన్నికలు వాయిదా!

ఢిల్లీ: ఆదినుంచి వివాదాస్పదంగా మారిన భారత్‌ ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) ఎన్నికల అంశం మరో మలుపు తిరిగింది, ఐఓఏ ఎన్నికల పరిశీలన కమిటీ ఛైర్మన్‌గా నియమితులైన ఎలక్షన్‌ కమిషన్‌ మాజీ చీఫ్‌ ఎస్‌,వై ఖురేషీ శనివారం రాజీనామా చేశారు.…

అసెంబ్లీలో పరిసరాల్లో ధర్నాలు నిషేధం

హైదరాబాద్‌: అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో జనవరి 18 వరకు సభలు ధర్నాలు పికెటింగ్‌లను నగర పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌ శర్మ నిషేధించారు. ఈ మేరకు సీపీ ఉత్తర్వులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

థాకరే అంతిమయాత్ర ప్రారంభం

ముంబయి: శివసేన అధినేత బాల్‌ థాకర్‌ అంతిమ యాత్ర ఆయన నివాసం మాతోశ్రీ నుంచి ఈ ఉదయం ప్రారంభమైంది. అంతిమయాత్ర కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనం వెంట భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలారు. అంతిమయాత్ర మాతోశ్రీ…

ముంబయికి చేరుకుంటున్న నేతలు

ముంబయి: అనారోగ్యంతో కన్నుమూసిన శివసేన అధినేత బాల్‌ ధాకరేకు నివాళులు అర్పించేందుకు నేతలు ముంబయి చేరుకుంటున్నారు. భాజపా అగ్రనేతలు ఒక్కొక్కరుగా ముంబయి వస్తున్నారు. భాజపా నేత సుష్మాస్వరాజ్‌, గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ తదితరులు మరికా సేపటిలో నగరానికి చేరుకోనున్నారు. …

సిర్పూరు ఎమ్మెల్యేకు మాతృ వియోగం

కాగాజ్‌నగర్‌: ఆదిలాబాద్‌ జిల్లా సిర్పూరు ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య తల్లి రాజమ్మ(80) అనారోగ్యంతో మృతి చెందారు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌ నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె గత రాత్రి మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలియజేశారు.

రావులపాలెం- .జొన్నాడ వంతెనపై నిలిచిన రాకపోకలు

రావులపాలెం : తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం- జొన్నాడ వంతెనపై ఈ ఉదయం రెండు లారీలు ఢి కొన్నాయి. దీంతో ఆ మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం  ఏర్పడింది. రహదారిపై సుమారు 5 కిలోమీటర్లమేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ట్రాఫిక్‌…

గాజాపై కొనసాగుతున్న ఇజ్రాయిల్‌ కిరాతక దాడులు

  యూదు దురహంకార ఇజ్రాయిల్‌ గాజాపై క్షిపణులు, బాంబులతో విరుచుకుపడింది. బుధవారం జరిపిన దాడిలో హమాస్‌ ముఖ్యనాయకుడు మిలిటరీ కమాండర్‌ అహ్మద్‌ అల్‌జబారి చనిపోయారు. గురువారంనాడు మరో ముగ్గురు పౌరులు ఈ దాడుల్లో చనిపోయారు. ఇజ్రాయిల్‌ దుశ్చర్యతో దిగ్బ్రాంతికి…