Sunday, 15 November 2026

హైదరాబాద్

‘శాండీ’ తుపాను బీభత్సం.. 11 మంది మృతి

22 లక్షల ఇళ్లకు నిలిచిపోయిన విద్యుత్‌ సరఫరా 12 వేల విమానాలు రద్దు న్యూయార్క్‌: అమెరికాను శాండీ తుపాను వణికిస్తోంది. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో గాలులు, భారీగా అలలు ఎగసిపడుతూ 12 రాష్ట్రాల్లో తుపాను బీభత్సం సృష్టిస్తోంది.…

సెల్‌ఫోన్‌ దుకాణంలో అగ్ని ప్రమాదం

గుంటూరు: కొత్తపేటలోని సెల్‌ఫోన్‌ దుకాణంలో ఈ ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భారీగా మంటలు ఎగసిపడుతుండటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నారు.

కేటీపీఎస్‌ తొమ్మిదో యూనిట్లోయ నిలిచిన విద్యుదుత్పత్తి

ఖమ్మం: కేటీపీఎస్‌  తొమ్మిదో యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది.  బాయిలర్‌ ట్యూట్‌ లీకవడంతో 200 యూనిట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన నిపుణలు మరమ్మతు పనులు చేపట్టారు.

నష్టాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

ముంబయి: స్టాక్‌మార్కెట్లు మంగళవారం స్వల్పనష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 16 పాయింట్లకుపైగా నష్టపోయింది. అటు నిఫ్టీ కూడా 2 పాయింట్లకుపైగా నష్టంతో కొనసాగుతోంది.

‘సాండి ‘ భయంతో అగ్రరాజ్యం గజ..గజ

వేలాది విమానాల ర ద్దు నిలిచిపోయిన రైళ్లు..స్తంభించిన జనజీవనం న్యూయార్క్‌ స్టాక్‌ మార్కెట్‌ తాళం అప్రమత్తమైన అమెరికా వాషింగ్టన్‌, అక్టోబర్‌ 29 (జనంసాక్షి): భీకర తుపాను ”సాండ్ణీ అగ్రరాజ్యం అమెరికాను వణికిస్తోంది. కొన్ని దశాబ్దాల తర్వాత ”సాండ్ణీ హరికేన్‌…

శాఖ మార్పు వల్ల బాధలేదు : జైపాల్‌రెడ్డి ,అవినీతిపరులకే కేంద్రం పట్టం :కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 29 (జనంసాక్షి): శాఖమార్పు వల్ల తనకు ఎలాంటి బాధ లేదని జైపాల్‌రెడ్డి అన్నారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖమంత్రిగా జైపాల్‌రెడ్డి సోమవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పెట్రోలియం శాఖమంత్రి…

గడువులోగా ప్రాణహిత-చేవెళ్ల

రైతులకు 50 శాతం సబ్సిడీ కింద యంత్రాలు సీఎం కిరణ్‌ వెల్లడి మెదక్‌ జిల్లాలో ప్రారంభమైన ఇందిరమ్మ బాట మెదక్‌, అక్టోబర్‌ 29 : నిరసనల మధ్య తెలంగాణలో సీఎం ఇందిరమ్మ బాట కొనసాగింది. తెలంగాణపై వైఖరి వెల్లడించకుండాతెలంగాణ…

ఎవరి సంసృతి వారికి గొప్ప

నారాయణగూడ: ఫలానా వారిదే గొప్ప సంస్కృతి అని చెప్పడానికి వీలు లేదు, ఎవరి సంస్కృతి వారికి గొప్పదని రాష్ట్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి డొమాణిక్యవరప్రసాద్‌ అన్నారు. మనిషిని మనిషిగా గౌరవించని సంస్కృతి సంస్కృతే కాదన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు…

400మంది ఖైదీలుగా పెరోల్‌పై విడుదలకు ఏర్పాట్లు

రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లాలో 400మంది ఖైదీలను విడతలవారిగా పెరోల్‌, పర్లోపై నెల రోజులలో ఇళ్లకు పంపిస్తామని జైళ్ల శాఖ డీఐజీ ఎ.నరసింహం తెలిపారు.

ఎస్సీ బాలుర వసతి గృహంలో సీఎం కిరణ్‌ బస

మెదక్‌: ఇందిరమ్మ బాటలో బాగంగా మెదక్‌ జిల్లాలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సహపంక్తి బోజనం చేశారు. ఈ రోజు రాత్రి అక్కడే బస చేయనున్నారు.