Sunday, 15 November 2026

హైదరాబాద్

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

మహబూబ్‌నగర్‌: జిల్లాలోని షాద్‌నగర్‌ మండలం బూర్గులలో ద్విచక్రవాహనం, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణీకులు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.

అవినీతి పరులకే కేంద్రం ప్రాధాన్యం: కేజ్రీవాల్‌

ఢిల్లీ: కేంద్ర మంత్రివర్గంలో అవినీతి పరులకే ప్రాధాన్యత ఇచ్చారని సామాజిక కార్యకర్త కేజ్రీవాల్‌ ఆరోపించారు.నిజాయితీగా పనిచేసిన జైపాల్‌రెడ్డిని పెట్రోలియం శాఖనుంచి తప్పించి ప్రాధాన్యతలేని శాఖను ఇచ్చారన్నారు. అవినీతి పరుడైనటువంటి సల్మాన్‌ కుర్షిద్‌కు  మరింత కీలక శాఖ అయినటువంటి విదేశాంగ…

కేసీఆర్‌ను కలిసిన పీసీసీ చీఫ్‌ బొత్స

హైదరాబాద్‌: పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెరాస అధినేత కేసీఆర్‌ను కలిశారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని కేసీఆర్‌ నివాసానికి బొత్స వెళ్లారు. నవంబర్‌ 2వ తేదీన బొత్స కుమారై వివాహం ఉన్నందున ఆహ్వానించేందుకు కేసీఆర్‌ను కలిశారు. కుటుంబ సభ్యులతో కలిసి…

నవంబర్‌ 4న ఢిల్లీలో కాంగ్రెస్‌ ర్యాలీ:పీసీసీ ఛీఫ్‌ బోత్స

హైదరాబాద్‌: ఢిల్లీలో నవంబర్‌4న కాంగ్రెస్‌ పార్టీ ర్యాయలీ నిర్వహించనుందని పీసీసీ అధ్యక్షుడు బోత్స సత్యనారాయణ తెలిపారు. ర్యాలీలో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరిస్తామని ఆయన తెలిపారు. ప్రస్థుత రాజకీయ పరిస్థితులను ప్రజలకు వివరించటానికే ఈ ర్యాలీ…

గన్నేరుబోయపాడులో మావోయిస్టుల పేరుతో దొంగల భీభత్సం

ఖమ్మం : జిల్లాలోని భద్రాచలం మండలం గన్నేరుబోయపాడులో మావోయిస్టుల పేరుతో దోపిడి  దొంగలు భీభత్సం సృష్టించారు. గ్రామంలోని ఓ ఇంట్లోకి వెళ్లిన దుండగులు బోమ్మ తపాకీలతో బెదిర్చి రూ. లక్షలు విలువచేసే బంగారం నగలు దోచుకెళ్లారు. బాదితులు ఫిర్యాదు…

ఇంకా వలసలు ఉంటాయి: బొత్స

హైదరాబాద్‌: పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే ముద్దాల రాజేశ్‌కుమార్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి వైఎస్‌ఆర్‌సీపీలోకి వలస వెళ్లడం తనకు ముందే తెలుసని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యానారాయణ తెలియజేశారు.  ఇంకా  కొంత మంది ఎమ్మెల్యేలు కూడా వలస…

సీఎం కాన్వాయ్‌ని అడ్డుకున్న టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు

మెదక్‌: జిల్లాలో ఇందిరమ్మ బాట కార్యక్రమంలో పాల్గోనడానికి వస్తున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కాన్వాయ్‌ని దుబ్బాకలో టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు అడ్డుకున్నారు. తెలంగాణ వాదులపై పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. దింతో పరిస్థితి ఆందోళనకారణంగా మారింది.

కలెక్టర్‌ను అడ్డుకున్న పోలీసులు

ఆదిలాబాద్‌: జిల్లాలోని జోడేఘట్‌లో ఇవాళ జరుగుతున్న కొమురంభీం 72వ వర్థంతికి నివాళుర్పించడానికి వెళుతున్న జిల్లా కలెక్టర్‌ను హట్టి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. భద్రత కారణాల వల్లనే కలెక్టర్‌ను అడ్డుకున్నామని పోలీసులు తెలుపుతున్నారు. జోడేఘట్‌కు కలెక్టర్‌ రావల్సిందేనని ఆదివాసీలు కలెక్టర్‌ను…

రైతులకు వడ్డీలేని రుణాలు: సీఎం

మెదక్‌: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. మెదక్‌ జిల్లాలో మూడు రోజుల ఇందిరమ్మబాట కార్యక్రమాన్ని సీఎం ఈ ఉదయం ప్రారంభించారు.. దుబ్బాకలో ఇందిర జలప్రభ లబ్ధిదారులతో సీఎం సమావేశమయ్యారు.…

వైకాపాలో చేరిన చింతలపూడి ఎమ్మెల్యే

హైదరాబాద్‌: పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే రాజేష్‌కుమార్‌ వైకాపాలో చేరారు. లోటన్‌పాండ్‌లో పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.