Sunday, 15 November 2026

హైదరాబాద్

వల్లివీడులో 8 మందికి డెంగీ లక్షణాలు

నెల్లూరు: జిల్లాలోని వెంకటగిరి మండలం వల్లివీడులో జ్వరంతో 52 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఎనిమిది మందికి డెంగీ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆదివారం వీరిని చికిత్స నిమిత్తం తిరుపతి. నెల్లూరు, చెన్నై ఆసుపత్రులకు తరలించారు. వల్లివీడులో…

‘తెలంగాణ ప్రకటనను సత్వరం చేయాలని కోరాం’: టీ మంత్రులు

ఢిల్లీ: తెలంగాణ ప్రకటనను సత్వరం చేయాలని పార్టీ ముఖ్యులను కోరినట్లు తెలంగాణ మంత్రులు వెల్లడించారు. తెలంగాణ అంశంపై చర్చించేందుకు గత కొద్దిరోజులుగా ఢిల్లీ బాట పట్టిన తెలంగాణ మంత్రులు పర్యటన నేటితో ముగిసింది. ఆదివారం ఉదయం కేంద్ర హోంమంత్రి…

అండమాన్‌లో స్వల్ప భూకంపం

అండమాన్‌: అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో ఆదివారం భూమి స్వల్పంగా కంపించింది, రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.7గా నమోదయ్యింది.

ప్రధాని, సోనియా బహిరంగ చర్చకు రావాలి: కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ: ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ అధ్యక్షరాలు సోనియాగాంధీ తనతో బహిరంగ చర్చకు రావాలని అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ సవాలు విసిరారు. అయితే ఈ సవాలు విసిరిన కొద్ది సేపటికే దీనిపై కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌…

ఆకతాయిల వేధింపులతో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

మిర్యాలడూడ: ఆకతాయిల వేధింపులు తాళలేక ఓ డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది, నల్గొండ జిల్లా మిర్యాలగూడ సంతోష్‌నగర్‌లోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతున్న విద్యార్థిని హారికను గత కొన్ని రోజులుగా ఆకతాయిలు వేధిస్తున్నారు. క్రమంగా వేధింపులు ఎక్కువవుతుండటంతో భరించలేక…

ఒడిశాలో నలుగురిని అపహరించిన మావోయిస్టులు

భువనేశ్వర్‌: ఒడిశాలో మివోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. రెండు జిల్లాల నుంచి నలుగురు వ్యక్తులను అపహరించుకుపోయారు. ఒనకడిల్లిలో మహిళ సహ ఇద్దరిని, మల్కాన్‌గిరి జిల్లాలో మరో ఇద్దరిని ఎత్తుకెళ్లారు. అపహరణకు గురైన వారిలో ఓ ప్రాజెక్ట్‌ ఉద్యోగి బి.వి రాంప్రసాద్‌,…

టెహ్రన్‌లో అనారోగ్యంతో మెట్‌పల్లి వాసి మృతి

మెట్‌పల్లి: ఉపాధి కోసం టెహ్రన్‌వెల్లిన మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్‌ గ్రామానికి చెందిన మంతెన చిన గంగారాం(53) అనారోగ్యంతో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. గత 25సంవత్సరాలుగా టెహ్రన్‌లో ఉంటున్న గంగారం 6నెలల క్రితం ఇంటికి వచ్చి కూతురు పెళ్లి…

షిండేతో ముగిసిన తెలంగాణ మంత్రుల భేటీ

న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండేతో తెలంగాణ మంత్రుల భేటీ ముగిసింది, సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై షిండేతో మంత్రులు చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని షిండేను మంత్రులు కోరినట్లు సమాచారం, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత…

తెదేపా తెలంగాణ నేతల భేటీ

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ ట్రన్ట్‌భవన్‌లో తెదేపా తెలంగాణ నేతలు భేటీ అయ్యారు. చంద్రబాబునాయుడు చేపట్టిన ‘ వస్తున్నా.. మీకోసం’ పాదయాత్ర రేపటి నుంచి తెలంగాణ ప్రాంతంలోజరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై నేతలు చర్చిస్తున్నారు.

కరీంనగర్‌లో అబ్కారీ అధికారుల తనిఖీలు

కరీంనగర్‌: అబ్కారీ అధికారుల తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా ఆర్టీసీ గరుడ బస్సులో అక్రమంగా తరలిస్తున్న 130 మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బెంగళూరు నుంచి కరీంనగర్‌ బస్సు వచ్చినట్లు తెలుస్తోంది.