Saturday, 14 November 2026

హైదరాబాద్

కోర్టుకు హాజరైన కేటీఆర్‌

హైదరాబాద్‌: రైల్‌రోకో సందర్భంగా నమోదైన కేసులో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తారకరామరావు సికింద్రాబాద్‌లోని రైల్వేకోర్టుకు హాజరయ్యారు.

చక్కెర విక్రయంపై మిల్లర్లకు స్వేచ్చనివ్వాలి:రంగరాజన్‌కమిటీ

  ఢిల్లీ: చక్కెర నియంత్రణపై కేంద్రాని రంగరాజన్‌ కమిటీ నివేదిక సమర్పించింది. బహిరంగ మార్కెట్‌లో చక్కెర విక్రయంపై మిల్లర్లకు స్వేచ్చనివ్వాలని నివేదికలో సూచించారు. ఇప్పటికీ చాలా నిత్యావసర వస్తువుల ధరలు ఎక్కువగానే ఉన్నాయని పేర్కొన్నారు.

స్వల్పంగా తగ్గిన ద్రవ్యోల్బణం

ఢిల్లీ: ఆగస్ట్‌తోపోలిస్తే సెప్టెంబర్‌లో ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గింది. సెప్టెంబర్‌ 9.73శాతంగా ద్రవ్యోల్బణం నమోదుకాగా ఆగస్ట్‌లో ఇది 10.03శాతంగా ఉంది. ఆగస్ట్‌ పారిశ్రామికోత్పత్తి 3.4శాతంగా నమోదైంది.

కేజ్రివాల్‌కు ప్రదాని నో అపాయింట్‌మెంట్‌

ఢిల్లీ: అవినీతిపై పోరాడుతున్న సామాజికవేత్త అరవింద్‌కేజ్రివాల్‌కు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అపాయింట్‌మెంట్‌ ఇవ్వటానికి నిరాకరించాడు. కేంవ్రమంత్రి ఖుర్షిద్‌ఆలాంఖాన్‌పై ఫిర్యాదు చేయాడానికి తనకు అనుమతివ్వాలని కేజ్రీవాల్‌ చేసిన విజ్ఞప్తిని ప్రధాని కార్యలయం తిరస్కరించింది.

లోక్‌సత్తా జయప్రకాశ్‌ నారాయణపై అడ్వొకేట్‌ జేఏసీ ఫైర్‌

హైదరాబాద్‌: లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణపై తెలంగాణ అడ్వొకేట్‌ ఏఏసీ ఫైర్‌ అయింది. రాష్ట్ర లోకాయుక్తగా మాజి జస్టిస్‌ సుభాషన్‌రెడ్డిని నియమించటంపై జేపీ అభ్యంరం వ్యక్తం చేశారు. సుభాషన్‌రెడ్డి తెలంగాణ వ్యక్తి కావటంవల్లె జేపీ అభ్యంతరం చెప్పాడని ఇకనైనా…

డీజీపీతో దత్తాత్రేయ భేటి-కవాతు కేసులపై చర్చ

హైదరాబాద్‌: డీజీపీ దినేష్‌రెడ్డి బీజేపీ సీనియర్‌నేత బండారు దత్తాత్రేయ సమావేశమయ్యారు. తెలంగాణ మార్చ్‌ నేపథ్యంలో ఉద్యమకారులపై నమోదైన కేసుల అంశంపై డీజీపీతో చర్చించినట్లు సమాచారం.

అధ్యాపకుని వేధింపులు తాళలేక విద్యార్థి ఆత్మహత్య

కడప: రైల్వేకోడూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుని వేధింపులు భరించలేక ఓ విద్యార్థి గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. అనంతరం విద్యార్థి బంధువులు కళాశాల ముందు ఆందోళనకు దిగి అధ్యాపకునిపై చర్యలు తీసుకోవాలని…

18 నుంచి ఏపీసెట్‌ పరీశీలన

ఉస్మానియా : రాష్ట్ర అర్హత పరీక్షకు ఇటీవల విడుదల చేసిన ఫలితాల్లో ఎంపికైన ఆభ్యర్థుల ధ్రవీకరణపత్రాలను ఈనెల 18నుంచి 31 వరకు పరిశీలించనునట్లు సెట్‌ సభ్యకార్యదర్శి రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు ఎంపికైన అభ్యర్థులు ఆయా ప్రాంతీయ కెంద్రల కార్యాలయాల్లో ఒరిజినల్‌…

చంద్రబాబు పాదయాత్ర

  అనంతపురం: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ‘వస్తున్నా మీ కోసం’ పాదయాత్ర 11వ రోజు ఉరవ కొండ మండలం నింబగల్లులో ప్రారంభమైంది. అనంతరం చంద్రబాబు రేణుమాకులపల్లికి చేరుకుని గ్రామ ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు.

నేటి బులియన మార్కెట్‌

  హైదరాబాద్‌: రాజధానిలో బులియన్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర 31,580, 22క్యారట్ల 10గ్రాముల ధర రూ.30,200గా ఉంది. కిలో వెండి ధర రూ.61,100గా పలుకుతుంది.