Wednesday, 11 November 2026

హైదరాబాద్

ఆటో బోల్తా: 8 మంది విద్యార్థులకు గాయాలు

హైదరాబాద్‌: మలక్‌పేటలోని టీవీ టవర్‌ వద్ద ఓ పాఠశాల ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో  8 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

ఉప రాష్ట్రపతిగా ప్రమాణస్వికారం చేసిన అన్సారీ

న్యూఢిల్లీ: రెండో సారి ఉప రాష్ట్రపతిగా హమీద్‌అన్సారీ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి యూపీఏ మిత్ర పక్షాల నాయకులు, ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ హాజరయ్యారు. 75 ఏళ్ల అన్సారీ 14వ ఉపరాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.…

జూరాలకు భారీగా చేరుతున్న వరద నీరు

మహబూబ్‌నగర్‌:  జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జూరాల ప్రాజెక్టులో నిటి మట్టం 316 మీటర్లకు చేరింది. దీంతో దిగువ  ప్రాంతాల ప్రజలను అధికారులు  అప్రమత్తం చేశారు. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నిటిమట్టం…

ముఖ్యమంత్రి కిరణ్‌ ప్రాంతీయ పక్షపాతి: కేటీఆర్‌

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రాంతీయ పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ ఆరోపించారు. సీమాంధ్ర ప్రాజెక్టులకు గ్యాస్‌ కోసం ఢిల్లీపై దండయాత్ర చేస్తారు కానీ, తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో లేఖలు కూడా రాయరని ధ్వజమెత్తారు. పార్టీ అంతర్గత కుమ్ములాటలతో…

ఐఎంఏ సమావేశంలో తెలంగాణ నినాదాలు

వరంగల్‌ : జిల్లాలోని కాకతీయ మెడికల్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) సమావేశంలో తెలంగాణ నినాదాలు మార్మోగాయి. డాక్టర్‌ పెసరు విజయ్‌చందర్‌రెడ్డి ఐఎంఏ అధ్యక్షులుగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సమావేశానికి టీఆర్‌ఎస్‌…

మంత్రి నాగేందర్‌ వీధిరౌడిలా ప్రవర్తిస్తున్నారు: సీపీఐ నేత నారాయణ

హైదరాబాద్‌: మంత్రి దానం నాగేందర్‌ వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నారని సీపీఐ నేత నారాయణ విమర్శించారు. సమస్య ఉంటే మంత్రి వర్గంలో చర్చించాలి కానీ, దేవాలయాలకు తాళం వేయడం ఏంటి అని ప్రశ్నించారు. కేసుల్లో ఉన్న మంత్రులందరిని మంత్రి వర్గం…

లోయలో పడ్డ బస్సు: 20 మంది దుర్మరణం

హిమచల్‌ప్రదేశ్‌: చంబా సమీపంలో ఓ బస్సు అదుపుతప్పి లోయలోపడింది. ఈ ప్రమాదంలో 20 మంది దుర్మరణం చెందగా, మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. చంబా నుంచి మణిమహేష్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడ్డ వారిని…

మిర్యాలగూడెంలో ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

నల్లగొండ: మిర్యాలగూడెంలో ఇంటర్‌ విద్యార్థి మట్టపల్లి మురళీ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఫీజు కట్టలేదని లెక్చరర్‌ కళాశాల నుంచి బయటకు పంపించడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మృతుడు మురళీ దామరచర్ల మండలం…

3 లక్షల ఎర్రచందనం పట్టివేత

మైదుకూర్‌, కడప: దువ్వూరు మండలం మనేరాంపల్లె వద్ద అక్రమ రవాణాకు సిద్థంగా ఉన్న 30 ఎర్ర చందనం దుంగలను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ 3 లక్షల ఉంటుందని తెలియజేశారు. ఎర్రచందనాన్ని అలవీక్షత్ర…

వీహెచ్‌ ఆధ్వర్యంలో సామాజిక న్యాయంపై సదస్సు

హైదరాబాద్     వీహెచ్‌ ఆధ్వర్యంలో సామాజిక న్యాయం అనే అంశంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి. హనుమంతరావు శనివారం సదస్సును నిర్వహిస్తున్నారు. గాంధీభవన్‌లోని ప్రకాశం హాలులో మధ్యాహ్నం 1.45 గంటలకు ప్రారంభమయ్యే ఈ సదస్సుకు కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి ఎస్‌,…