Saturday, 14 November 2026

నిజామాబాద్

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు 17 గేట్లు ఎత్తివేత

నిజామాబాద్‌,(జనంసాక్షి): శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు 17 గేట్ల ఎత్తివేశారు. ప్రాజెక్టులోని ఇన్‌ఫ్లో లక్షా 25 వేల క్యేసెక్కులు ఉండగా, ఔట్‌ఫ్లో 35 వేల క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులోని నీటిమట్టం 1090.45 అడుగులుగా ఉంది.

ఆరుబయటే పోలింగ్‌ నిర్వహిస్తున్న సిబ్బంది

నిజామాబాద్‌,(జనంసాక్షి): బీర్కూర్‌ మండలం అంకోల్‌ తండాలో సరిపడా  గదులు లేక ఆరుబయటే సిబ్బంది పోలింగ్‌ నిర్వహిస్తుంది. దీంతో ఓటు వేయడానికి ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాన్పువాడలో పోలింగ్‌ ఏర్పాట్లు సరిగా చేయలేదంటూ స్థానిక ఎంపీడీవోపై జిల్లా తీవ్ర…

తెగిన నల్లవాగు వంతెన: నిలిచిన రాకపోలు

నిజామాబాద్‌,(జనంసాక్షి): భారీ వర్షాలు నిజామాబాద్‌ జిల్లాలో బీభత్సవం సృష్టిస్తున్నాయి. పిట్లం మండలంలోని తిమ్మాపూర్‌ గ్రామంలో వరద ఉద్దృతికి నల్లవాగు వంతెన దెబ్బతింది. దీంతో పలుగ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

ప్రవాహంలో కొట్టుకుపోయి విద్యార్థి మృతి

నిజామాబాద్‌,(జనంసాక్షి): జిల్లాలోని కామారెడ్డి పెద్ద చెరువు వద్ద వరద ప్రవాహంలో కొట్టుకుపోయి ఓ విద్యార్థి మృతి చెందాడు. అతన్ని దేవునిపల్లికి చెందిన లక్ష్మన్‌గా గుర్తించారు.

కారులో 35 లక్షల నగదు పట్టివేత

నిజామాబాద్‌,(జనంసాక్షి): నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ మండలం పోచంపాడు రహదారి వద్ద ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న రూ. 35 లక్షల నగదును పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. వాహనాల తనిఖీల్లో భాగంగా పోలీసులు కారులో తరలిస్తున్న నగదును పట్టుకున్నారు.…

నిండుకుండను తలపిస్తున్న కళ్యాణి డ్యాం

నిజామాబాద్‌,(జనంసాక్షి): జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎల్లారెడ్డి శివారులో కళ్యాణి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో కళ్యాణి డ్యాం నిండుకుండను తలపిస్తుంది. ప్రాజెక్టుకు ఇప్పటి వరకు ఐదు వందల క్యూసెక్కుల నీరు వచ్చి…

చెక్‌పోస్ట్‌ వద్ద భారీ నగదు పట్టివేత

నిజామాబాద్‌,(జనంసాక్షి): నిజాంసాగర్‌ మండలం నర్సింగరావుపల్లి చెక్‌పోస్ట్‌ వద్ద కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి నుంచి రూ. 18లోల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వ్యక్తి ప్రయాణిస్తుస్తున్న కారును పోలీసులు సీజ్‌ చేశారు.

పిట్లం విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో సాంకేతిక లోపం

నిజామాబాద్‌,(జనంసాక్షి): పిట్లం విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో మంగళవారం సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో ఆ సబ్‌ స్టేషన్‌ పరిధిలోని గ్రామాలకు ఏడు గంటలుగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. అయితే విద్యుత్‌ సరఫరాలో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని గుర్తించి , విద్యుత్‌…

కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేపట్టిన విద్యార్థి సంఘాలు

నిజామాబాద్‌,(జనంసాక్షి): విద్యార్థి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వివిధ విద్యార్థి సంఘాలు మంగళవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చేందుకు ఆయా సంఘాల నాయకులు యత్నించారు. అందులో భాగంగా కలెక్టరేట్‌లోకి…

పీఎస్‌లో యువకుడు అనుమానస్పద మృతి

నిజామాబాద్‌,(జనంసాక్షి): జిల్లాలోని రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఓ యువకుడు అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులే కొట్టి చంపారంటూ మృతుడి బందువులు పీఎష్‌ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.