Saturday, 14 November 2026

నిజామాబాద్

సుభాష్‌నగర్‌ కాలనీలో రాత్రి విలువైన బంగారు నగలు చోరీ

నవీపేట: మండలంలోని సుభాష్‌నగర్‌ కాలనీలో చోరీ జరిగింది. నిన్న రాత్రి నరేశ్‌ అనే వ్యాపారి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు రూ. లక్ష విలువైన బంగారు నగలు. రూ.10 వేల నగదును దోచుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

అత్యాచారయత్నం చేసిన వ్యక్తి దారుణ హత్య

నిజామాబాద్‌ : తన భార్యపై అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తిని ఓ భర్త దారుణంగా హతమార్చాడు. నిజామాబాద్‌ గ్రామీణ ప్రాంతం నర్సింగ్‌పల్లిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం వస్తువుల అమ్ముకోవడానికి గ్రామంలోని ప్రవేశించిన ఓ వ్యక్తి ఒంటరిగా…

నర్సింగ్‌పల్లిలో యువకుడి దారుణ హత్య

నిజామాబాద్‌ : జిల్లాలోని సిరికొండ మండలం నర్సింగ్‌పల్లిలో గుర్తు తెలియని వ్యక్తులు ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. స్థానికుల సమాచారం సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

భార్యపై అత్యాచారయత్నం చేసిన వ్యక్తిని హత్య చేసిన భర్త

నిజామాబాద్‌ గ్రామీణం: భార్యపై అత్యాచారయత్నం చేసిన వ్యక్తిని దారుణంగా భర్త హత్య చేసిన ఘటన నిజామాబాద్‌ గ్రామీణ మండలం నర్సింగ్‌పల్లిలో చోటుచేసుకుంది. ఈ ఉదయం నెయ్యి అమ్ముకోవడానికి గ్రామానికి వచ్చిన వ్యక్తి ఓ ఇంట్లోకి ప్రవేశించి ఒంటరిగా ఉన్న…

సదస్సులను వినియోగించుకోవాలి

నవీపేట గ్రామీణం: నవీపేట మండలం నాడాపూర్‌, జన్నేపల్లి గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దారు రాజు మాట్లాడారు. అపరిష్కృతంగా ఉన్న భూసమస్యలను పరిష్కరించుకునేందుకు రెవెన్యూ సదస్సులను రైతులు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. గ్రామాల్లో పౌతీ కేసులు…

నిజామాబాద్‌లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

హైదరాబాద్‌: నిజామాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో ఈ వేసవిలో ఇప్పటివరకు నమోదైన ఉష్ణోగ్రతల్లో ఇదే అత్యధికం. రెంటచింతలలో 41 డిగ్రీలు, కడప, కర్నూలు,  నంద్యాల, అనంతపురంలో 40, తిరుపతి హన్మకొండ, మహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్‌,…

అంగన్వాడీ ఆయాలు, కార్యకర్తల పోస్టులకు ఇంటర్వూలు

నిజామాబాద్‌ గ్రామీణం: నిజామాబాద్‌ రూరల్‌ సీడీపీఓ పరిధిలోని అంగన్వాడీ పోస్టుల భర్తీకు ఆర్డీఓ సమక్షంలో ఇంటర్వ్యూలు జరిగాయి. 18 పోస్టుల్లో 10 టీచర్‌ పోస్టులు , 8 ఆయాల పోస్టులకు ఈ ఇంటర్వ్యూలు జరిపారు.

రిమాండ్‌కు లారీ డ్రైవర్‌

నిజామాబాద్‌ గ్రామీణం: నిజామాబాద్‌ మండలం అశోక్‌ ఫారం వద్ద మూడేండ్ల చిన్నారి మృతికి కారణమైన లారీ డ్రైవరును అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు ఎన్‌హెచ్‌ఓ తెలిపారు.

మహిళ హత్య కేసులో 10 మందికి రిమాండ్‌

నిజామాబాద్‌ గ్రామీణం: నిజామాబాద్‌ మండలం గుండారం గ్రామంలో ఈ నెల 25న మంత్రాల నెపంతో మహిళను హత్య చేసిన గ్రామస్థుల్లో పదిమందిని అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు ఎన్‌హెచ్‌ఓ సోమనాథం విలేకరులకు తెలిపారు. మరి కొందరు పరారీలో ఉన్నట్లు…