Wednesday, 11 November 2026

వరంగల్

వరినాట్లతో నిరసన

దంతాలపల్లి : పేట శివారుమండలంలోని ఆగ రెక్యా తండాలో వీధులన్నీ బురమయమయ్యారు దీంతో ఆప్రాంత గిరిజనులంతా వీధుల్లోనే వరినాట్లు వేసి వినూత్నంగా నినసన తెలియజేశారు. అధికారులు స్పందించి తమ వీధుల్ని మరమ్మతులు చేయాలని వారు డిమాండ్‌  చేశారు.

ముఖ్యమంత్రి అన్ని ప్రాంతాల వారిని సమానంగా చూడాలి:గండ్ర

వరంగల్‌: రాష్ట్ర ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి అన్ని ప్రాంతాల వారిని సమానంగా చూడాలని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.  సీఎం కిరణ్‌ అంతర్జాతీయతో మీడియాతో రాజకీయాల కోసం రాష్ట్రాన్ని విభజించడం జరగదని చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను…

దామెర వద్ద రోడ్డు ప్రమాదం : ఇద్దరు మృతి

వరంగల్‌: జిల్లాలోని ఆత్మకూరు మండలం దామెర వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఎదురెదుగా వస్తున్న ఆటో-కారు ఒకదానినొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

పశుగణనను వేగవంతం చేయాలి

  దంతాలపల్లి నర్సింహుల పేట మండలంలోని వివిధ గ్రామాల్లో చేపట్టిన పశుగణన కార్యక్రమాన్ని వెటర్నరీ జనగాం డివిజన్‌ ఎడీ సదానందం పరిశీలించారు. త్వరితగతిన కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. కార్యక్రమ నిర్వహణకు అవసరమైన సలహలు, సూచనలు సిబ్బందికి సూచించారు.  

రేపు, ఎల్లుండి కేయూపరిధిలో పరీక్షలు వాయిదా

వరంగల్‌: ఈ నెల 29, 30 తేదీల్లో కాకతీయ యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలను వర్సిటీ అధికారులు వాయిదా వేశారు. వాయిదా పడ్డ పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని అధికారులు తెలియజేశారు.

భూపాలపల్లిలో జర్నలిస్టుల ర్యాలీ, అరెస్టు

వరంగల్‌: తెలంగాణ జిల్లాల్లో పోలీసుల అరాచకం మితిమీరిపోయింది. తెలంగాణ వాదులను భయబ్రాంతులకు గురిచేయాలని చూస్తున్నారు. ఎక్కడికక్కడ తెలంగాణ వాదులను నిర్భంధిస్తున్నారు. ఎటు చూసినా పోలీసుల చెక్‌పోస్టులు, నాకాబందీలు కనిపిస్తున్నాయి. తెలంగాణ మార్చ్‌కు అనుమతినివ్వాలంటూ తెలంగాణ జర్నటిస్టులు కదం తొక్కారు.…

తెలంగాణ మార్చ్‌లో అశేషంగా పాల్గొనండి

పాలకుల మెడలు వంచండి : మావోయిస్టు పార్టీ పిలుపు వరంగల్‌, సెప్టెంబర్‌ 27 (జనంసాక్షి) : ఈ నెల 30న జరుగనున్న తెలంగాణ మార్చ్‌లో అశేషంగా పాల్గొని, విజయవంతం చేయాలని సీపీఐ మావో యిస్టు పార్టీ తెలంగాణ ప్రజలకు…

నవోదయ విద్యాలయ దరఖాస్తులకు అక్టోబర్‌ 1 గడువు

దంతాలపల్లి: జవహర్‌ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్షకు అర్హులైన విద్యార్థులకు అక్టోబర్‌ ఇకటిలోపు దరఖాస్తు చేసుకోవాలని ఎంఈవో బుచ్చయ్య తెలిపారు. 5వతరగతి విద్యార్థులు అర్హులన్నారు.

గ్రామీణ విత్తనోత్పత్తి పథకంపై రైతులకు అవగాహన సదస్సు

దంతాలపల్లి: నర్శింహులపేట మండలంలోని పడమటిగూడెం గ్రామంలో రైతు శిక్షణ కేంద్రం వరంగల్‌ ఆధ్వర్యంలో గ్రామీణ విత్తఓత్పత్తి పధకంపై రైతులకు అవగాహన సదస్సు మంగళవారం ఏర్పాటు చేశారు. ప్రభుత్వం అందిస్తున్న విత్తనాలను సద్వినియోగం చేసుకుని అధిక దిగుబడి సాధించాలని రైతులకు…

ఆర్టీసీ చార్జీలు తగ్గించాలని టీడీపీ ఆందోళన

రేగొండ: పెరిగిన బస్సు చార్జీలను తగ్గించాలంటూ డిమాండ్‌ చేస్తూ టీడీపీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో రాస్తారోకో చేశారు. వెంటనే పెంచిన బస్‌ చార్జీలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు.