Wednesday, 11 November 2026

వరంగల్

కాజీపేట-విజయవాడ మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం

వరంగల్‌: డోర్నకల్‌ రైల్వేస్టేషన్‌లో ఓ భారీ వృక్షం నేలకూలింది. ఈ ఘటనలో స్టేషన్‌లోని విద్యుత్‌ తీగలు తెగిపడటంతో కాజీపేట-విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మహబూబాబాద్‌ రైల్వేస్టేషన్‌లో అహ్మదాబాద్‌-చెన్నై నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌, గుండ్రాతిమడుగులో కాజీపేట-విజయవాడ ప్యాసింజర్‌ రైళ్లను…

సంవత్సరం పాటు కాకతీయ ఉత్సవాలు నిర్వహణ మంత్రి సారయ్య

వరంగల్‌, ఆగస్టు 2 : కాకతీయ ఉత్సవాలను సంవత్సరం పాటు నిర్వహిస్తామని, రాష్ట్ర బలహీన వర్గాల సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. గురువారం మనగుడి కార్యక్రమాన్ని హన్మకొండలోని వెయ్యి స్థంభాల దేవాలయంలోను, వరంగల్‌లోని రామన్నపేట వేంకటేశ్వరస్వామి…

అధికారుల సమన్వయంతో ఆగస్టు 15 నిర్వహించాలి: పి. శేషాద్రి

వరంగల్‌, ఆగస్టు 2 : జిల్లా ప్రధానకేంద్రంలో ఈ నెల 15న జరగనున్న భారతదేశ స్వాతంత్య్రదినోత్సవ వేడుకల నిర్వహణకు అన్ని శాఖల అధికారులతో సమన్వయంతో పనిచేయాలని జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్‌ పి.శేషాద్రి కోరారు. గురువారం ఉదయం కలెక్టరేట్‌లోని…

నరసింహులపేట లో పాఠశాల తనిఖీ

దంతాలపల్లి: నరసింహులపేట మండలం వీరిశెట్టి గూడెం శివారు పంతులు తండాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఎంఈఓ ఎం బుచ్చెయ్య మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.

మందుల దుకాణాల్లో డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్ల తనిఖీలు

స్టేషన్‌ఘన్‌పూర్‌: స్థానిక మందుల దుకాణాల్లో డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఫార్మసిస్టులు కాకుండా ఇతరులు మందులు విక్రయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎనిమిది దుకాణాలకు నోటీసులు జారీ చేశారు.

అభివృద్ధి పథంలో స్వయం సహాయక సంఘాలు

మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి వరంగల్‌, జూలై 30 : మహిళా స్వయం సహాయక సంఘాలు రాష్ట్రం ఆర్థికంగా పటిష్టంగా ఉండేందుకు తమవంతు పాత్ర పోషిస్తున్నాయని రాష్ట్ర సహకార శాఖ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం ఉదయం జనగాంలో…

జోగంపల్లి విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌లో పేలుడు

వరంగల్‌: శాయంపేట మండలం జోగంపల్లి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో పేలుడు సంభవించింది. పేలుడు సంభవించటంతో సబ్‌స్టేషన్‌లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలను ఆర్పేందుకు స్థానికులు యత్నిస్తున్నారు. పేలుడు సంభవించటం వలన దేవాదుల ఉత్తిపోతల పథకానికి విద్యుత్‌ సరఫరాను నిలిపేశారు  అధికారులు.

మత్స్యశౄఖ ఉప సంచాలకుల పోస్టు భర్తీ

వరంగల్‌: జిల్లా మత్య్సశాఖ ఉప సంచాలకుల పోస్టును ఎట్టకేలకు భర్తీ చేశారు. ఉప సంచాలకులుగా పని చేసిన నర్సింహారెడ్డి గత సెప్టెంబరులో ఉద్యగ విరమణ చేయటంతో డీడీ పోస్టు ఖాళీ అయింది. మత్య్సశౄఖలో ఏడీగా పనిచేస్తున్న బాలకృష్ణకు అదనపు…

బావిలో పడి మహిళ మృతి

కేసముద్రం: కల్వల గ్రామ శివారు గాంధీపురం తండాలో శుక్రవారం ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో జారిపడి ఓ గిరిజన మహిళా మృతి చెందింది. ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం…తండాకు చెందిన బాదావత్‌ రామి(56)తమ వ్యవసాయ బావిలో పూడిక తీస్తుండగా అక్కడకు వెళ్లింది.…

ట్రాక్టర్‌ బావిలో పడి డ్రైవర్‌ మృతి

అత్మకూరు: ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో ట్రాక్టర్‌ పడడంతో డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన వూరుగొండ శివారులోని వ్యవసాయ భూముల్లో శుక్రవారం సాయంత్రం జరిగింది. స్ధానిక హెడ్‌కానిస్టేబుల్‌ పోషయ్య, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం… సీతారాంపురానికి చెందిన బాషబోయిన…