Wednesday, 11 November 2026

వరంగల్

అటవీ సిబ్బందిపై దాడిచేసిన స్మగ్లర్లు

వరంగల్‌: నర్సంపేట మండలం సర్వాపురంలో ముగ్గురు అటవీ శాఖ సిబ్బందిపై స్మగ్లర్లు దాడి చేశారు. అక్రమ కలప పట్టుకునేందుకు వెళ్లిన స్లయింగ్‌ స్క్వాడ్‌ స్బిబందిపై వీరు దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు సిబ్బందికి స్వల్ప గాయాలు అయ్యాయి.

ఏసీబీకి చిక్కిన నర్సింహులపేట మండల తహశీల్దార్‌

వరంగల్‌ : జిల్లాలోని నర్సింహులపేటమండలం తహశీల్దారు ఏసీబీకి చిక్కరు.రూ 10వేలు లంచం తీసుకుంటుండగా తహశీల్దారును ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తహశీల్దార్‌ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది.

పార్థసారధికి నైతికవిలువుంటే రాజీనామా చేయాలి:సీపీఐ

వరంగల్‌:సీపీఐ రాష్ట్ర కార్యాదర్శి నారాయణ వరంగల్‌లో మాట్లాడుతూ మంత్రి పార్థసారధికి నైతిక విలువుంటే రాజీనామా చేయాలని డిమాండ్‌  వ్యక్తం చేశారు. కళంకిత మంత్రులను వెంటనే తొలగించాలని అన్నారు. రాష్ట్రాన్ని  మధ్యం,మైనింగ్‌, మందుల మాఫియాలు శాశిస్తున్నాయని ఆయన అన్నారు.

వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ ఘెరావ్‌

వరంగల్‌: వరంగల్‌ జిల్లా కలెక్టరును గ్రామస్థులు ఘెరావ్‌ చేశారు. జిల్లాలోని హాన్మకొండ మండలం కడిపికొండలో అతిసార  వ్యాపించడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. వ్యాధి తీవ్రంగా ప్రబలినా అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఈ రోజు ధర్నాకు దిగారు. ఈ…

బొంతలవాగులో ఇద్దరు మహిళలు గల్లంతు

వరంగల్‌ : ములుగు మండలం సర్వాపురం వద్ద బొంతులవాగు దాటుతుండాగా ఇద్దరు మహిళలు గల్లంతుయ్యారు. వరద ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో వారు అదుపుతప్పి ప్రవాహంలో కొట్లుకుపోయారని స్థానికులు తెలిపారు. వారి ఆచూకి కనుగొనడానికి స్థానికులు ప్రయత్నిస్తున్నారు.

నేను ఏ తప్పు చేయలేదు :శ్రీమాన్‌

వరంగల్‌ : తాను ఏ తప్పు చేయలేదని, పోలిసులు తమ తప్పు కప్పిపుచ్చుకునేందుకే తనపై అక్రమంగా కేసు పెట్టారని మంత్రి సారయ్య కుమారుడు శ్రీమాన్‌ చెప్పాడు. తాను పరారీలో ఉన్నట్లు పోలిసులు చేస్తున్న ప్రచారం అవస్తవమని ఆతను పేర్కొన్నారు.…

లొంగిపోయిన మంత్రి కుమారుడు

వరంగల్‌: ఎస్‌ఐని దుర్భాష లాడిన కేసులో మంత్రి సారయ్య కుమారుడు శ్రీమాన్‌ ఈ రోజు జిల్లా కోర్టులో లొంగిపోయాడు. అతనికి మంగళవారం హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిన సంగతి విదితమే.

విజయవాడ-కాజీపేట మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం

వరంగల్‌: వరంగల్‌ జిల్లా డోర్నకల్‌ వద్ద బలార్షా -విజయవాడ రైలు మార్గంలో ఓహెచ్‌ఈ జంపర్‌ తెగిపోయింది. జంపర్‌ తెగడంతో విజయవాడ-కాజీపేట మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

పోలీసు శిక్షణలో అపశ్రుతి

వరంగల్‌: పోలీసు శిక్షణలో అపశ్రుతి చోటుచేసుకుంది. జిల్లాలోని మామునూరు నాలుగో బెటాలియన్‌ పోలీసులకు ఫైరింగ్‌లో శిక్షణ ఇస్తుండగా మిన్‌ ఫైర్‌ అయిముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే వరంగల్‌ ఎంజీఎంకు  తరలించారు. ఘటనపై ఎస్పీ విచారణ చేపట్టారు.

పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యయత్నం

వరంగల్‌: ఇద్దరు పిల్లలతో సహా ఓ తల్లి ఆత్మహత్యకు ప్రయత్నించిన సంఘటన వరంగల్‌ జిల్లాలో ఈరోజు జరిగింది. జఫర్‌గడ్‌ మండలం వడ్డెగూడెంలో కుటుంబకలహాలతో విసిగిపోయిన ఓ తల్లి ఇద్దరు పిల్లలకు పురుగుమందు తాగించి తానూ తాగింది. వీరిని చికిత్సనిమిత్తం…