Wednesday, 11 November 2026

వరంగల్

వరంగల్‌ ఎంజీఎంలో చిన్నారుల మృతికి అనారోగ్యమే కారణం

వరంగల్‌:  ఉత్తర తెలంగాణలోనే పెద్ద ఆసుపత్రి అయిన ఎంజీఎంలో చిన్నారులు మృతి చెందిన ఘటనపై జిల్లా కలెక్టర్‌  కలెక్టర్‌ రాహుల్‌బోజ్జా  స్పందించి పూర్తి వివరాలు వెల్లడించాడు. చిన్నారుల మృతికి వారి అనారోగ్యమే కారణమని ఆయన అన్నారు. ఆసుపత్రి అభివృద్ది…

తల్లిదండ్రులను నరికి చంపిన కిరాతకుడు

వరంగల్‌: ఆత్మకూర్‌ మండలం సింగరాజుపల్లెలో దారుణం జరిగింది. ఓ కిరాతకుడు తల్లిదండ్రులను గొడ్డలితో అతి దారుణంగా నరికి చంపాడు. మేనకోడల్ని రెండో పెళ్లి చేసుకోవడానికి తల్లిదండ్రులు అంగీకరించనందునే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం.

ఎరువుల కోసం బారులు తీరిన రైతులు

వరంగల్‌:  జిల్లాలోని గూడురులో రైతులు ఎరువుల కోసం బారులో తీరారు. అక్కడ రైతుల మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు వారిని వారించారు. భారీ బందోబస్తు మధ్య ఎరువుల పంపిణీ అధికారులు చేస్తున్నారు.

వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిని పరిశీలించిన టీడీపీ బృందం

వరంగల్‌: ఎంజీఎం ఆసుపత్రిని తేదేపా బృందం పరిశీలించింది. సౌకర్యాలు కల్పించే విషయంలో నొర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని రేవూరి ప్రకాశ్‌ రెడ్డి మండిపడ్డారు. వెంటిలేటర్‌ కొరతవల్ల పసిపిల్ల మరణాలు పేరిగాయని సీతక్క అన్నారు. పిల్లల వార్డుల్లో రోగులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.…

అదుపు తప్పి కల్వర్టులో పడిన పాఠశాల బస్సు

వరంగల్‌: అదుపు తప్పిన ఓ పాఠశాల బస్సు కల్వర్టులో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురి విద్యార్థులకు తీవ్ర  గాయాలయ్యాయి. ఈఘటన ఆత్మకూరు మండలం పులికుర్తి సమీపంలో  చోటు చేసుకుంది. గాయాలపాలైన విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విద్యార్థుల…

ఐఎంఏ సమావేశంలో తెలంగాణ నినాదాలు

వరంగల్‌ : జిల్లాలోని కాకతీయ మెడికల్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) సమావేశంలో తెలంగాణ నినాదాలు మార్మోగాయి. డాక్టర్‌ పెసరు విజయ్‌చందర్‌రెడ్డి ఐఎంఏ అధ్యక్షులుగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సమావేశానికి టీఆర్‌ఎస్‌…

ఎంజీఎంలో నాలుగు రోజుల పాప మృతి

వరంగల్‌: వెంటిలేటర్‌ అందుబాటులో లేకపోవడంతో వరంగల్‌లోని ఎంజీఎంలో నాలుగు రోజుల చిన్నారి ఈ రోజు ఉదయం మృతిచెందింది. దీంతో ఆగ్రహిచిన తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే పాప మృతిచెందిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వెంటిలేటర్‌…

సారయ్య ఇంటికి ముట్టడించిన టీఆర్‌ఎస్‌వీ

వరంగల్‌: ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా వరంగల్‌లో మంత్రి సారయ్య ఇంటిని టీఆర్‌ఎస్‌వీ విద్యార్థి సంఘం ముట్టడించింది. అర్హలందరికీ ఫీజు రీయంబర్స్‌మెంట్‌ చేయాలని విద్యార్థులు నినాదాలు చేశారు. విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.

వరంగల్‌ జిల్లాలో మూతపడిన ఆలయాలు

వరంగల్‌: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వరంగల్‌ జిల్లాలో అర్చకులు సమ్మెకు  దిగారు. దీంతో జిల్లావ్యాప్తంగా 400 ఆలయాలు మూతపడ్డాయి. అన్ని ఆలయాల్లో ఆర్జిత సేవలు ఆర్చకులు నిరసన చేపడుతున్నారు.

వరంగల్‌లో పుస్తెలతాడు లాక్కెల్లిన ఆటోడ్రైవర్‌

వరంగల్‌: జల్లా కేంద్రంలో ఆటోలో ఎక్కిన మహిళ మెడలోంచి పుస్తలతాడు ఆటో డ్రైవర్‌ లాక్కెళ్లాడు. బాధితురాలు రేగొండ మండలం నిజాంపల్లి చెందిన పద్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.