Tuesday, 24 November 2026

సీమాంధ్ర

మంత్రి కన్నాపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ రాయపాటి

గుంటూరు,(జనంసాక్షి): మంత్రి కన్నా లక్ష్మీనారాయణపై ఎంపీ రాయపాటి సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తానేమీ గుమాస్తాగా పనిచేయలేదని, పుట్టుకతోనే కోటీశ్వరుడినన్నారు. వందల కోట్ల రూపాయలు పార్టీ కోసం ఖర్చు చేశానని చెప్పారు. రేకులషెడ్లలో ప్రస్థానం ప్రారంభించిన కన్నా కోట్ల…

టైర్‌ భవన్‌లో అగ్నిప్రమాదం

విజయవాడ : బందరురోడ్డులోని టైర్‌ భవన్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు రూ. 3లక్షల రూపాయల విలువైన టైర్లు , ట్యూబులు కాలిబూడదయ్యాయి. ఓ ట్యూబుకు పంచర్‌వేసేందుకు ఏర్పాటు చేసిన పొయ్యి నుంచి అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి.…

వృద్ధాప్య పించన్ల అవకతవకలపై కలెక్టర్‌ విచారణ

కర్నూలు :దుగ్గలి మండలంలో వృద్ధాప్య పింఛన్ల అవకతవకలపై కలెక్టర్‌ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఐదుగురు గ్రామ పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలను సస్పెండ్‌ చేశారు. నిందితుల నుంచి రూ. 20 లక్షలు రికవరీ చేయాలని ఆయన అధికారులను అదేశించారు.

అనంతపురంలో బయటపడిన కాంగ్రెస్‌ వర్గపోరు

అనంతపురం: అనంతపురం జిల్లాలో కాంగ్రెస్‌ వర్గపోరు మరోసారి బయటపడింది. పార్టీ ప్రతిపాదించిన కోనారెడ్డికి పోటీగా నామినేషన్‌ వేసేందుకు జేసీ ప్రభాకర్‌ రెడ్డి సిద్ధమయ్యారు. రాజీ చర్చలు విఫలం కావడంతోనే ఆయన పోటీకి సిద్ధపడినట్లు సమచారం.

శ్రీవారిని దర్శించుకున్న న్యాయమూర్తులు

తిరుమల: తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి వారిని సుప్రింకోర్టు న్యాయమూర్తి జస్టిన్‌ సదాశివం, హైకోర్టు న్యాయమూర్తి జస్టిన్‌ ఎన్వీ రమణ సోమవారం ఉదయం దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో అలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తులకు తితిదే అధికారులు అలయ మర్యాదలతో…

తిరుపతిలో నరసింహయాదవ్‌ దీక్ష భగ్నం

తిరుపతి: తిరుపతిలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి నరసింహయాదవ్‌ చేపట్టిన అమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలను అణచివేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ప్రకటించిందని అరోపిస్తూ ఆయన మూడురోజులుగా అమరణ నిరాహారదీక్ష…

కొవ్వూరులో విలువైన బంగారం, నగదు అపహరణ

ఏలూరు,(జనంసాక్షి): పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు మండలం పసివేదలలో ఓ ఇంట్లో ఆదివారం చోరీ జరిగింది. ఈ చోరీలో 25 కాసుల బంగారం, 7 వేల నగదు, ల్యాప్‌టాప్‌ను దొంగలు అపహరించినట్టు సమాచారం.

వైజాగ్‌ ఆటో క్రాన్‌-2013 పోటీలు ప్రారంభం

విశాఖ: నగర పరిధిలో మధురవాడ శ్రీరామ్‌ ప్రాపర్టీన్‌ అవరణలో ‘వైజాగ్‌ ఆటో క్రాన్‌-2013’ కారు రేస్‌ పోటీలు ప్రారంభమయ్యాయి. నగరంతో పాటు పలు రాష్ట్రాల నుంచి సుమారు 200 మంది తమ సొంత కార్లతో ఈ పోటీల్లో పాల్గొన్నారు.…

ఈనెల 23 న విశాఖలో ఒలంపిక్‌ డే రన్‌

విశాఖపట్నం, (జనంసాక్షి): ఈ నెల 23న విశాఖ జిల్లాలో ఒలంపిక్‌ డే రన్‌ ప్రారంభం కానుంది. ఈ ఒలంపిక్‌ డే రన్‌ను సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రారంభించనున్నారు. లక్షా 25 వేల మందితో కార్యక్రమ నిర్వహణకు ఏర్పాటు చేస్తున్నట్టు…

మౌలిక సదుపాయాల కల్పనకు కృషి: కన్నా

గుంటూరు కార్పోరేషన్‌: గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ధిపనులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ శంకస్థాపన చేశారు. రూ. 3.30కోట్లతో సీసీరోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలను చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. నగరంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి…