గుంటూరు కార్పోరేషన్: గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ధిపనులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ శంకస్థాపన చేశారు. రూ. 3.30కోట్లతో సీసీరోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలను చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. నగరంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, అధికారులు పాల్గొన్నారు.




