Friday, 6 November 2026

వైజాగ్‌ ఆటో క్రాన్‌-2013 పోటీలు ప్రారంభం

విశాఖ: నగర పరిధిలో మధురవాడ శ్రీరామ్‌ ప్రాపర్టీన్‌ అవరణలో ‘వైజాగ్‌ ఆటో క్రాన్‌-2013’ కారు రేస్‌ పోటీలు ప్రారంభమయ్యాయి. నగరంతో పాటు పలు రాష్ట్రాల నుంచి సుమారు 200 మంది తమ సొంత కార్లతో ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోటీల ప్రతినిధి టిటి మోటార్స్‌ ఫౌండర్‌ ప్రెసిడెంట్‌ అబ్బాస్‌ మాట్లాడుతూ సురక్షిత డ్రైవింగ్‌ చేస్తూ అంతర్జాతీయ ప్రమాణాలతో కారుని నడపడం లక్ష్యంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. 1.1కిలోమీటర్ల మలుపు తారు రోడ్డుపై తక్కువ సమయంలో ముందుగా గమ్యాన్ని చేరుకున్న వారు విజేతలుగా నిలుస్తారని ఆయన తెలిపారు. ఈ తరహా పోటీలు మధురవాడలో మొదటి సారి జరగడంతో పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు హాజరై పోటీలు తిలకించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *