Tuesday, 24 November 2026

సీమాంధ్ర

ఏసీబీ వలలో వీఆర్వో

నరసరావుపేట : గుంటూరు జిల్లా నరసరావు పేట మండలం ఎల్లమంద వీఆర్వోగా పనిచేస్తున్న శివ కల్యాణ బాబు పట్టాదారు పాస్‌పుస్తకం జారీ చేయడానికి పెదతురపాలెంకు చెందిన సుభానీ అనే రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు.

నకిలీ ఓట్లను ప్రక్షాళన చేస్తాం: భన్వర్‌లాల్‌

తిరుపతి,(జనంసాక్షి): రాష్ట్రంలో 40 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయని ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌ పేర్కొన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల వరకు నకిలీ ఓట్లను ప్రక్షాళన చేస్తామని ఆయన చెప్పారు. ప్రస్తుత ఓటర్ల జాబితా ఆధారంగా స్థానిక ఎన్నికలు…

మహిళ సజీవ దహనం

ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం చేగొండపల్లిలో విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న మహిళ సజీవదహనమైంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

నర్సీపట్నం గ్రామీణం : విశాఖ జిల్లా నర్సీపట్నం మండలం జోగినాధునిపాలెం వద్ద మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. నర్సీపట్నం నుంచి కోటవరుట్లకు వెళ్తున్న 108 వాహనం ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది.…

జమ్ముతావి ఎక్స్‌ప్రెస్‌లో వ్యక్తి ఆత్మహత్య

నెల్లూరు: జమ్ముతావి-చెన్నై ఎక్స్‌ప్రెస్‌ రైల్లో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జమ్ముతావి ఎస్‌-3 బోగీలోని మరుగుదొడ్డిలో గుర్తుతెలియని వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే సిబ్బంది సూళ్లూరు పేటలో వ్యక్తి మృతదేహాన్ని గుర్తించి కేసునమోదు చేశారు.

క్రికెట్‌ అకాడమీని ప్రారంభించిన లక్ష్మణ్‌

గుంటూరు : మంగళగిరిలో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్‌ జోన్‌ బాలుర క్రికెట్‌ అకాడమిని మాజీ క్రికెటర్‌ వి.వి ఎస్‌ లక్ష్మణ్‌ ఈరోజు ఉదయం ప్రారంభించారు.

వుడా పార్క్‌లో కూలిన భవనం… పది మందికి తీవ్రగాయాలు

విశాఖ: వుడా పార్క్‌లో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను కేజీహెచ్‌ ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు సమాచారం. అధికారులు ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలు చేపట్టారు.

పారిశ్రామికవేత్త సిరీస్‌ రాజు కన్నుమూత

విజయవాడ,(జనంసాక్షి): ప్రముఖ పారిశ్రామిక వేత్త సిరీస్‌ రాజు(94) కన్ను మూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఈ మధ్యాహ్నం ఆయన తుదిశ్వాస విడిచారు. కాంగ్రెస్‌…

ఇసుక లారీ బోల్తా

తిరుమల: రెండో కనుమ ఘాట్‌రోడ్డుపై ఇసుక లారీ బోల్తా పడింది. దీంతో 2కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి.

టిప్పర్‌-ఆటో ఢీ: ఇద్దరు మృతి

తుళ్లూరు : గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, దొండపాడు మధ్యలో మూల మలుపు వద్ద ఓ ఆటోను టిప్పర్‌ ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. గుంటూరు నగరంలోని గుజ్జనగుండ్లకు చెందిన రాంబాబు (45), తుళ్లూరు మండలంలోని హరిశ్చంద్రపురానికి చెందిన రజిని(32)లు…