కావలి, జనంసాక్షి: 20వేల రూపాయలకు పసికందును అమ్మకానికి పెట్టిన నెల్లూరు జిల్లా కావలిలో కలకలం సృష్టించింది. వైఎస్సార్ జిల్లాకు చెందిన మున్నా, దస్తగిరమ్మ దంపతులకు ఇలీవలే మగబిడ్డ జన్మించాడు. బిడ్డను అమ్ముకోవాలనుకున్న ఆ దంపతులు….. చిన్నారికి తల్లి చనిపోయిందని బిడ్డను తీసుకుని 20వేల రూపాయలు ఇవ్వాలంటూ కావలిలోని బుడబుక్కల కాలనీలో అమ్మకానికి పెట్టారు. కాలనీకి చెందిన వెంకటమ్మతో బేరం కుదుర్చుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు మున్నా, దస్తగిరమ్మ దంపతులను అదుపులోకి తీసుకున్నారు.




