Tuesday, 24 November 2026

సీమాంధ్ర

శిలాఫలకంలో లగడపాటి పేరు లేకపోవడంతో ఆందోళన

కృష్ణా : కొండపల్లిలో పురా పైలాన్‌ శిలాఫలకంలో విజయవాడ ఎంపీ లగడపాటి పేరు లేకపోవడంతో కార్యకర్తలు అందోళనకు దిగారు. మధ్యాహ్నం 3 గంటలకు పురా పథకానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు.

గన్నవరం చేరుకున్న ముఖ్యమంత్రి

విజయవాడ : కృష్ణా , పశ్చిమగోదావరి జిల్లాల పర్యటన కోసం ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి ఈ ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో నేతలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం సీఎం హెలికాప్టర్‌లో పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు బయలుదేరి…

పర్యాటకశాఖ స్టాల్‌ను ప్రారంభించిన చిరంజీవి

విశాఖపట్నం : నగరంలోని విమానాశ్రయంలో పర్యాటకశాఖ స్టాల్‌ను కేంద్ర పర్యాటక శాఖామంత్రి చిరంజీవి ప్రారంభించారు. శనివారం విశాఖ- భీమిలి బీచ్‌ కారిడార్‌ పనులను ప్రారంభించేందుకు ఆయన నగరానికి వచ్చారు. విశాఖ, భీమిలి బీచ్‌ల మధ్య ఉన్న బీచ్‌లతో పాటు…

పెళ్ళివేడుకలో ఆభరణాల చోరి

కర్నూలు: నంద్యాల పట్టణంలో ఓ పెళ్ళి వేడుకలో బంగారు ఆభరణాల ఉన్న సంచిని గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. ఆ సంచిలో నాలుగు లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయి. పెళ్ళి వారు పోలీసులను ఆశ్రయించారు.

టీటీడీ ఆంక్షలపై నిరసన చేపట్టిన జర్నలిస్టు సంఘాలు

తిరుమల, జనంసాక్షి: తిరుమల తిరుపతి దేవస్థానం వైఖరిని జర్నలిస్టు సంఘాలు తప్పుపట్టాయి. ఆలయ మహాద్వారం వద్దకు మీడియా ప్రవేశాన్ని రద్దు చేయడాన్ని జర్నలిస్టులు వ్యతిరేకించారు. టీటీడీ అధికారులు తమ నిర్ణయాన్ని మార్చుకోకపోతే శ్రీవారి ఆలయం వద్ద ఆందోళన చేస్తామని…

న్యూఢిల్లీ ,మే 3 (జనంసాక్షి): అంతర్జాతీయ ఒలింపిక్‌ సమాఖ్యతో తమ గుర్తింపును పునరుధ్ధరించు కునేందుకు భారత క్రీడాసమాఖ్య కసరత్తులు చేస్తోంది. దీనిలో భాగంగా భారత్‌ వాదనను వినిపించేందుకు ఒలింపిక్‌ షూటర్‌ అభినవ్‌ బింద్రాను ఎంపిక చేసింది. గత ఏడాది…

ఆర్కే బీచ్‌లో గల్లంతైన ఇద్దరు బాలురు

విశాఖ : ఆర్కే బీచ్‌లో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు ఇద్దరు బాలురు గల్లంతయ్యారు. వెంటనే అధికారులు, కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.

రహస్యంగా వివాహం చేసుకున్న ఇంకొల్లు ఎస్‌ఐ

తిరుమల, జనంసాక్షి: ప్రకాశం జిల్లా ఇంకొల్లు ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ శనివారం తిరుమలలో రహస్యంగా వివాహం చేసుకున్నాడు. ఐదు సంవత్సరాలుగా తనతో  ప్రేమగా ఉంటూ పెండ్లి చేసుకుంటానని నమ్మించి కట్నం కోసం మరో అమ్మాయితో వివాహానికి సిద్ధపడ్డాడంటూ విజయ్‌కుమార్‌పై భట్టిప్రోలు…

నీటి పారుదల శాఖ కార్యాలయానికి తాళం వేసి నిరసన

ఆత్మకూరు : నెల్లూరు జిల్లా ఆత్మకూరులో బిల్లులు చెల్లించలేదంటూ నీటి పారుదల శాఖ కార్యాలయం వద్ద కాంట్రాక్టర్లు నిరసనకు దిగారు. కార్యాలయానికి తాళం వేసి ఆందోళన చేపట్టారు. తమ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు.