తిరుమల, జనంసాక్షి: తిరుమల తిరుపతి దేవస్థానం వైఖరిని జర్నలిస్టు సంఘాలు తప్పుపట్టాయి. ఆలయ మహాద్వారం వద్దకు మీడియా ప్రవేశాన్ని రద్దు చేయడాన్ని జర్నలిస్టులు వ్యతిరేకించారు. టీటీడీ అధికారులు తమ నిర్ణయాన్ని మార్చుకోకపోతే శ్రీవారి ఆలయం వద్ద ఆందోళన చేస్తామని జర్నలిస్టు సంఘాల నేతలు శనివారమిక్కడ హెచ్చరించారు.




