Monday, 23 November 2026

సీమాంధ్ర

మిర్చి రైతులను కలిసిన షర్మిల

విజయవాడ, జనంసాక్షి: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు షర్మిల కృష్ణా జిల్లా గూడెం మాధవరం గ్రామంలో మిర్చి రైతులను కలిసి, వారితో మాట్లాడారు. మరో ప్రజాప్రస్థానం 123వ రోజు పాదయాత్రను ఈరోజు ఆమె ఇక్కడ నుంచి ప్రారంభించారు. మిర్చి…

ఆహారంలో విషం కలిపి హత్య : వరవరరావు

భద్రాచలం, జనంసాక్షి: ఛత్తీస్‌గడ్‌లో నిన్న జరిగింది బూటకపు ఎన్‌కౌంటర్‌ అని విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు ఆరోపించారు. ఇక్కడ ఆస్పత్రిలోని మృతదేహాలను ఆయన సందర్శించారు. బంధువులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కోవర్టు ఆపరేషన్‌ ద్వారా ఆహారంలో…

‘మావోయిస్టులను కోర్టులో హాజరుపరచాలి’

భద్రాచలం, జనంసాక్షి: నిన్న పోలీస్‌ దాడులలో అదుపులోకి తీసుకున్న మావోయిస్టులను కోర్టులో హాజరుపరచాలని వారి బంధువులు డిమాండ్‌ చేస్తున్నారు. వారిని పోలీసులు ఏదైన చేస్తారేమోనని వారు భయపడుతున్నారు. మృత దేహాలను తమకు చూపించడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.…

ఉపాధ్యాయుల సస్పెన్షన్‌

అనంతపురం, జనంసాక్షి: లైంగిక వేధింపుల ఆరోపణలపై జిల్లాలో ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేశారు. తనకల్లు ఉద్దేహళ్ల పాఠశాలలలో పనిచేస్తున్న ఇద్దరిని సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు డిఐఓ శ్యామ్యూల్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

గడ్డివాములో కాలిన మృతదేహం

గుంటూరు, జనంసాక్షి: బాపట్ల మండలం ఈటేరులో గడ్డివాములో కాలిన మృతదేహం ఉంది. గుర్తు తెలియని వ్యక్తులు ఒక వ్యక్తిని హత్య చేశారు. ఆ మృతదేహాన్ని గడ్డివాములో పెట్టి తగులబెట్టారు. పోలీనులు కేపు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మావోయిస్టు సీనియర్‌ నేత జవ్వాది మృతి

గుంటూరు,జనంసాక్షి: మావోయిస్టు సీనియర్‌ నేత జవ్వాది వెంకట సుబ్బయ్య మంగళవారం కన్నుమూశారు. నల్లచెరువు కాలనీలోని తన నివాసంలో జవ్వాది అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. మూడు దశ్దాబాల పాటు వామపక్ష విప్లవ ఉద్యమాల్లో ఆయన కీలకపాత్ర పోషించారు.

అదుపుతప్పి జీపు బోల్తా: మహిళ మృతి

తిరుమల, జనంసాక్షి: శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గంలో అదుపుతప్పి జీపు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. మరో 9 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల వివరాలు…

పెరెడ్‌ గ్రౌండ్స్‌లో జాతీయ జెండాకు అవమానం

గుంటూరు, జనంసాక్షి: గుంటూరు పోలీస్‌ పెరెడ్‌ గ్రౌండ్స్‌లో జాతీయ జెండాకు అవమానం జరిగింది. డ్యూటీ మీట్‌ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ సురేష్‌ కుమార్‌ మంగళవారం ఉదయం జాతీయ జెండాను తలకిందులుగా ఆవిష్కరించారు. విషయాన్ని ఆలస్యంగా గమనించి అధికారులు అనంతరం…

కాంగ్రెస్‌పై నమ్మకం ఉందన్న మంత్రి శ్రీధర్‌

విశాఖ,జనంసాక్షి: తెలంగాణ రాష్ట్ర విషయంలో కాంగ్రెస్‌ పార్టీపై పూర్తి స్థాయి నమ్మకం ఉందని పౌర సరఫరాల శాఖామంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ఆయన మంగళవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ఆయిల్‌ ట్యాంకర్ల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు.

మధ్యాహ్నం నుంచి అన్నదానం యథావిధి

తిరుమల, జనంసాక్షి: తిరుమలలో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి యథావిధిగా అన్నదాన కార్యక్రమం జరుగుతుందని టీటీడీ ప్రకటించింది. ఈ రోజు ఉదయం అన్న ప్రసాదాలు తయారు చేసే క్యాంటీన్‌లో గ్యాస్‌ లీకేజీ కారణంగా అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.…