Monday, 23 November 2026

సీమాంధ్ర

ట్రాక్టర్‌ బోల్తా… ఇద్దరి మృతి

కొత్తపేట : తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం వాడపాలెం శివారు నారాయణలంక గ్రామంలో మట్టితో వస్తున్న ఓ ట్రాక్టర్‌ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో వాడపాలెం గ్రామానికి చెందిన డ్రైవర్‌ కోమ్మన ప్రసాద్‌ (28), క్లీనర్‌…

కుంభమేళా నుంచి తిరిగి వచ్చేసరికి ఇల్లు గుల్ల

గుంటూరు : కుంభమేళాకు వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇల్లు గుల్లైన ఘటన గుంటూరులో చోటుచేసుకుంది. స్థానికి విజయలక్ష్మీ సినిమాహాలు ప్రాంతంలో నివసించే ఓ వ్యాపారి కుటుంబంతో కలిసి కుంభమేళా కోసం అలహాబాద్‌ వెళ్లాడు. తిరిగి వచ్చే సరికి ఇంట్లో…

స్టీల్‌ ప్లాంట్‌ విద్యుత్‌ సరఫరాకి అంతరాయం

విశాఖ : విశాఖ ఉక్కు కర్మాగారం విద్యుదుత్పత్తి కేంద్రంలో జనరేటర్లు విఫలం కావడంతో స్టీల్‌ ప్లాంట్‌ విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. డిస్కం నుంచి విద్యుత్‌ తీసుకుని సరఫరా పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

విక్టోరియా మహారాణి కాలంనాటి వెండి నాణేలు లభ్యం

కడప: కడప జిల్లా కాశీనాయన మండలం వడ్డెమానులోని రైతు రామసుబ్బారెడ్డి ఇంట్లో 600 వెండినాణేలు అభించాయి. మూడ్రోజుల క్రితం రామసుబ్బారెడ్డి ఇంట్లో 100 వెండి నాణేలను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వెండి నాణేలు విక్టోరియా మహారాణి…

లంచం తీసుకుంటూ పంట్టుబడిన వీఆర్వో

కృష్ణా : కృష్ణా గన్నవరం తహసీల్దారు కార్యాలయంలో కీసరపల్లి వీఆర్వో రవి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. ఒక రైతు నుంచి రూ, 30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయనను పట్టుకున్నారు.

15 మంది ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు

కడప : రామాపురం అటవీ ప్రాంతంలో 15 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. తమిళనాడు వేలూరుకు చెందిన వీరు ఎర్రచందనం చెట్లను నరుకుతుండగా పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. వేలూరు నుంచి వచ్చిన మిగతా స్మగ్లర్ల కోసం…

లారీ బోల్తా..10 మందికి తీవ్రగాయాలు

విశాఖ: హుకుంపేట మండలం రంగసిల వద్ద ఈ తెల్లవారుజామున లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 10 మంది కూలీలకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉంది.

100 మెగావాట్లతో ప్రారంభించిన 400 మెగావాట్లకు సామర్థ్యం పెంచుకునే పన్నాగం

తూ.గో: వంద మెగావాట్లతో ప్రాజెక్టును ప్రారంభించి 400 మెగావాట్లకు సామర్థ్యం పెంచుకునే పన్నాగం పన్నుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. ఉత్పత్తైన విద్యుత్తును ఇతర రాష్ట్రాలకు అమ్ముకోవడానికే ఈ యత్నం అని ఆయన ఆరోపించారు. థర్మల్‌ ప్రాజెక్టు…

150 కిలోల గంజాయి స్వాథీనం

విశాఖ : మాకవరపాలెం మండలం ఆగ్రహారం వద్ద 150 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారయ్యారు.

ఏసీబీ వలలో సబ్‌రిజిస్ట్రార్‌

కర్నూలు : ఏసీబీ వలకు ఆలూరు సబ్‌ రిజిస్ట్రార్‌ చిక్కారు. ఓ భూవివాదానికిసంబంధించి దరఖాస్తుదారుని నుంచి రూ. 90 వేల లంచం తీసుకుంటుండగా సబ్‌రిజిస్ట్రార్‌ రామ్మూర్తిని  ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అధికారిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు…