Monday, 23 November 2026

సీమాంధ్ర

ఆటోను ఢీకొన్న లారీ.. ముగ్గురి మృతి

కర్నూలు : కర్నూలు జిల్లా ఆదోనిలో ఆటోను లారీ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఆదోని నుంచి సూగురుకు ప్రయాణికులతో వస్తున్న ఆటోను కుప్పగల్లు వద్ద లారీ ఢికొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆటోలో…

కోరం లేక చిత్తూరులో ఎన్నిక వాయిదా

చిత్తూరు: డీసీసీబీ, డీసీఎంఎన్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు కోరం లేక వాయిదా పడ్డాయి. నిన్న నిర్వహించిన ఎన్నికల్లో 11 డీసీసీబీ డైరెక్టర్‌ స్థానాలను కాంగ్రెస్‌ కైవసం చేసుకోగా… మూడింటిని తెదేపా చేజిక్కించుకుంది.డీసీఎంఎన్‌ డైరెక్టర్‌ స్థానాల్లో మూడింటిలో తెదేపా విజయం…

ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి అనుమానాస్పద మృతి

ఏలూరు : ఉభయగోదావరి జిల్లా పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్వంతంత్ర అభ్యర్థి ఆవలదాసు దుర్గాప్రసాద్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఏప్రిల్‌లో హైదరాబాదులో ప్రపంచపర్యాటన సదస్సు : చిరంజీవి

విశాఖ : ఏప్రిల్‌ 11 నుంచి 14 వరకు హైదరాబాదులో ప్రపంచ పర్యాటక సదస్సు నిర్వహించనున్నట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి తెలిపారు. ఆకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కించకుండా ఆదుకోవాలని…

బిల్లులు లేకుండా తరలిస్తున్న రూ. 18 లక్షలు స్వాధీనం

కడప: ఎలాంటి లేకుండా వాహనంలో తరలిస్తున్న రూ. 18 లక్షలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కడప జిల్లా  ప్రొద్దుటూరులో అధికారులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ నగదు పట్టుబడింది.

బస్సు, కారు ఢీ.. ఇద్దరి మృతి

విశాఖ : మల్కాపురంలో షిప్‌యార్డు వద్ద ఈ ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు, కారు ఢీ కొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వీరిని విశాఖలోని ఆసుపత్రికి తరలించారు.

లారీ బోల్తా… ఇద్దరి మృతి

అనంతపురం : పరిగి సమీపంలో ఈ ఉదయం లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగ్రాతులను సమీప ఆసుపత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం తెలిసింది.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

విజయవాడ: కృష్ణలంక జాతీయ రహదారిపై నల్లగాటి వద్ద ఈ తెల్లవారుజామున లారీ, టాటా ఏన్‌ వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురికీ తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను విజయవాడలోని ఆసుపత్రికి తరలించారు.

టేకు తోటలో అగ్నిప్రమాదం

ప్రకాశం : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాజుపాలెంలో టేకుతోటలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 18 ఎకరాల టేకు తోట దగ్ధమైంది.

అన్నవరంలో 400 విహహాలు

అన్నవరం : సత్యదేవుని సన్నిధి తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో రికార్డు స్థాయిలో పెళ్లిళ్లు జరిగాయి. గురువారం రాత్రి నాలుగు ముహూర్తాల్లో సుమారు 400 వివాహాలు జరిగాయి. ఇందులో పెద్దల అంగీకారంతో జరిగిన ప్రేమ పెళ్లిళ్లు కూడా ఉన్నాయి. ప్రేమికుల…