Thursday, 12 November 2026

ఖమ్మం

విద్యుత్‌ ఛార్జీల పెంపుపై తెదేపా సంతకాల సేకరణ

ఖమ్మం పట్టణం: విద్యుత్‌ ఛార్జీల పెంపును నిరసనగా తెదేపా సంతకాల సేకరణ ఖమ్మం పట్టణంలో కొనసాగుతోంది. సర్దార్‌పటేల్‌ స్టేడియంలో ఉదయం నడకకు వచ్చిన వారి నుంచి నేతలు సంతకాలు సేకరించారు. ఈ కార్యాక్రమంలో ఖమ్మం ఎమ్మెల్యేతుమ్మల నాగేశ్వర్‌, ఎమ్మెల్సీ…

కొత్తూరులో సీఎం పర్యటన

ఖమ్మం: ఖమ్మం జిల్లా ఇల్లెందు మండలం కొత్తూరులో సీఎం పర్యటిస్తున్నారు. కొత్తూరులో నిర్వహించిన ఎస్టీ ఉప ప్రణాళిక అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఉద్యోగ నియామకాలకు ఎంపికకైన విద్యార్థులతో ముఖాముఖి

అశ్వారావుపేట: అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో శుక్రవారం ప్రాంగణ ఉద్యోగ నియామకాల ఎంపికకై విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. కోరమాండల్‌ ఫెర్టి లైజర్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏజీబీఎస్సీ అఖరి సంవత్సరం విద్యార్థులు 40 మంది…

మృతి చెందిన రైతు కుటుంబానికి చెక్కు అందజేత

భద్రాచలం పట్టణం: మండలంలోని గన్నవరం గ్రామానికి చెందిన రమణయ్య కుటుంబానికి బీమా చెక్కును ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గురువారం అందజేశారు. ఈ సందర్భంగా భద్రాచలం సహకార సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా…

రైతులకు నిరంతరం విద్యుత్తు అందించాలి

భద్రాచలం టౌన్‌: రైతులకు నిరంతరం విద్యుత్తు సరఫరా చేయాలని భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య డిమాండ్‌ చేశారు. భద్రాచలంలో సీపీఎం ఆధ్వర్యంలో గురువారం రైతులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సబ్‌కల్టెర్‌ కార్యాలయంలో రైతు సంఘం నాయకులు తిలక్‌…

సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి హామీలను నిలబెట్టుకోవాలి

భద్రాచలం టౌన్‌: ఈనెల 5న జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి జిల్లా వాసులకు గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా ప్రకటన చేయాలని ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ డిమాండ్‌ చేశారు. గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇల్లెందు…

మూడునెలల్లోగా రెవెన్యూ దరఖాస్తులు పరిష్కారిస్తామన్న మంత్రి రఘువీరారెడ్డి

భద్రాచలం: రెవిన్యూ సదస్సుల్లో స్వీకరించిన దరఖాస్తులను మూడు నెలల్లోగా పరిష్కరిస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రఘవీరారెడ్డి అన్నారు. ఈరోజు ఖమ్మం జిల్లా భద్రాచలంలోని శ్రీసీతారామస్వామి వారిని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఈవో రఘానాధ్‌ మంత్రికి స్వాగతం…

జేసీబీ జప్తు

అశ్వారావుపేట: అశ్వారావుపేట సమీపంలోని ప్రభుత్వ చెరువుకట్టను తవ్వి చదును చేస్తున్న ఓ జేసీబీని అధికారులు స్వాధీనం చేసుకుని జప్తు చేశారు. సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేయనున్నట్లు తహసీల్దార్‌ వెంగారెడ్డి తెలిపారు.

ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన

ఖమ్మం : ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన ఖరారైంది. ఈ  నెల 5న ముఖ్యమంత్రి కిరణ్‌కుమబార్‌రెడ్డి జిల్లా ఇల్లెందులో పర్యటించనున్నారు. ఎస్సీ . ఎస్టీ ఉప ప్రణాళికను ఆయన ఇల్లెందులో ప్రారంభించనున్నారు.

ఖమ్మం జిల్లాలో ఈనెల 5న ముఖ్యమంత్రి పర్యటన

ఖమ్మం: ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన ఖరారైంది. ఈ నెల 5న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి  ఖమ్మం జిల్లా ఇల్లెందులో పర్యటించనున్నారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికను ఆయన ఇల్లెందులో ప్రారంభించనున్నారు.