Sunday, 29 November 2026

వార్తలు

కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేసిన ఎస్పీ

కడప: ఖాజీపేట మండలం చెన్నమ్కుపల్లెలో ముగ్గురు కానిస్టేబుళ్లు, ఒక హెడ్‌కానిస్టేబుల్‌ను జిల్లా ఎస్పీ సస్పెండ్‌ చేశారు. రైతును తనిఖీ చేసి రూ, 30 వేలు తీసుకున్నారని కానిస్టేబుళ్లపై బాధితుడి నుంచి ఫిర్యాదు అందింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కానిస్టేబుళ్లను…

ఒంటి గంటలోపు క్యూలో ఉన్నవారిని అనుమతిస్తాం

హైదరాబాద్‌: మధ్యాహ్నం ఒంటి గంటలోపు క్యూలో ఉన్నవారిని ఓటింగ్‌కు అనుమతిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్‌మిట్టల్‌ తెలిపారు. పోలింగ్‌ కేంద్రానికి ఒంటిగంటలోపు చేరుకున్న వారందరికీ చీటీలు ఇస్తామని చెప్పారు. ఆదిలాబాద్‌ జిల్లాలో 7,విశాఖ జిల్లాలో 4 పంచాయతీలకు…

ఆర్టీసీ బస్సు ,డీసీఎం వ్యాను ఢీ: 20 మందికి గాయాలు

మెదక్‌: సిద్దిపేట మండలం మిట్టపల్లి వద్ద ఆర్టీసీ బస్సు-డీసీఎం వ్యాను ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో దాదాపు 20 మందికి గాయాలయ్యాయి. వీరంతా ఓటు వేసేందుకు వేములవాడ నుంచి నంగునూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట విద్యార్థుల ధర్నా

నెన్నెల (ఆదిలాబాద్‌): నెన్నెల మండల కేంద్రంలోని ఎస్సీ వసతిగృహం విద్యార్థులు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆందోళనకు దిగారు. తమ వసతి గృహంలో పూర్తిస్థాయి వార్డెన్‌లేక సమస్యలను పట్టించుకునే వారు కరువయ్యారని తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. కనీసం…

కాంగ్రెస్‌, వైకాపాల మధ్య ఘర్షణ వల్ల ఇద్దరికి గాయాలు

కడప: రాయచోటి మండలం గువ్వల హరినవాడలో పోలింగ్‌ కేంద్రం వద్ద కాంగ్రెస్‌, వైకాపా మద్దతుదారుల మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణలో ఇద్దరికి గాయాలైనట్లు సమాచారం.

గోల్లాపురంలో 150 ఓట్లు గల్లంతు

అనంతపురం: జిల్లాలోని హిందూపురం మండలం గోల్లాపురం పంచాయతీలో 150 ఓట్లు గల్లంతయ్యాయి. దీంతో గ్రామస్థులు ఆందోళనకు దిగారు.

బ్యాలెట్‌ పత్రాలను బయటకు తెచ్చిన ఓటరు

చిత్తూరు: జిల్లాలోని బి.ఎన్‌ కండ్రిగ మండలం కంచనపుత్తూరులో రంగయ్య అనే ఓటరు ఓట్లు వేసేందుకు వెళ్లి బ్యాలెట్‌ పత్రాలను బయటకు తెచ్చాడు. అప్రమత్తమైన పోలీసులు రంగయ్యను అదుపులోకి తీసుకున్నారు.

మృతుల కుటుంబాలకు వారం రోజుల్లో సాయం: రఘువీరా

హైదరాబాద్‌: మౌలాలి ఎంజే కాలనీలో గోడకూలిన ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు వారం రోజుల్లో ఆపద్బంధు పథకం కింద సహాయం అందుతుందని మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. ఒక కుటుంబానికి రూ. 8.50లక్షలు, మరో కుటుంబానికి రూ. 6.50లక్షలు…

సానుభూతి చూపిన చంద్రబాబు

హైదరాబాద్‌: మౌలాలి ఎంజే కాలనీలో గోడకూలిన ఘటనలో మృతుల కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సానుభూతి తెలిపారు. బాధితులను ఆదుకోవాలని  డిమాండ్‌ చేశారు.