Sunday, 29 November 2026

వార్తలు

భారీ వర్షాల కారణంగా 7పంచాయతీల ఎన్నికలు వాయిదా

ఆదిలాబాద్‌: జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈరోజు జరగాల్సిన 136 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏడు గ్రామ పంచాయతీల ఎన్నికలను అధికార యంత్రాంగం వాయిదా వేసింది. దీంతో ఈరోజు 129 గ్రామ పంచాయతీల ఎన్నికలు…

సుమారు 180 మంది ఓటర్లు ఓటు వేయకుండా నిరసన

పర్చూరు (ప్రకాశం):గత పదేళ్లుగా రహదార్లను అభివృద్ధి చేయలేదని ఆగ్రహించిన పర్చురు గ్రామంలోని లక్ష్మీపురం కాలనీ వాసులు పోలింగ్‌ను బహిష్కరించారు. కాలనీలోని సుమారు 180 మంది ఓటర్లు ఓటు వేయకుండా నిరసన తెలిపారు. ప్రజా ప్రతినిధుల తీరుపట్ల అసంతృప్తి వ్యక్తం…

పోలింగ్‌ ఏజెంట్లను అడ్డుకున్న ఓటర్లు

దుగ్గిరాల: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలోని చిలువూరు గ్రామంలో పోటీ చేస్తున్న అభ్యర్థులు డబ్బులు ఇవ్వలేదని ఓటర్లు పోలింగ్‌ను అడ్డుకున్నారు. ఉదయం 7:40 గంటల వరకు పోలింగ్‌ ఏజెంట్లను కూడా లోపలికి వెళ్లకుండా ఓటర్లు అడ్డుకున్నారు. స్థానిక నాయకులు…

నిజామాబాద్‌ జిల్లాలో బారులు తీరిన ఓటర్లు

నిజామాబాద్‌: జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. ఓట్ల కోసం అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. నడవలేని స్థితిలో ఉన్న వారిని…

పోలింగ్‌ బూత్‌ వద్ద కాంగ్రెస్‌, వైకాపా మధ్య ఘర్షణ

కడప: వీఎన్‌పల్లి మండలం గడ్డవారిపల్లె పోలింగ్‌ బూత్‌ వద్ద కాంగ్రెస్‌, వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. జిల్లాలోని నాగిరెడ్డిపల్లి పోలింగ్‌ కేంద్రంలో కూడా కాంగ్రెస్‌ ,వైకాపా వర్గీయుల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని…

పోలింగ్‌ను బహిష్కరించిన గ్రామస్థులు

గుంటూరు: పోలీసుల వైఖరిని నిరసిస్తూ కట్టవాడ గ్రామస్థులు పోలింగ్‌ను బహిష్కరించారు. పోలీసులు ఓటర్లపై చేయిచేసుకోవడంతో ఆగ్రహించిన గ్రామస్థులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీకి సీఎం ఆదేశం

హైదరాబాద్‌: వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీలు భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి ఆదేశించారు. ఈ ఉదయం సచివాలయంలో వైద్య, ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన మూడు నెలల్లో 1900 వైద్యుల…

రాగల 48 గంటల్లో భారీ వర్షాలు

హైదరాబాద్‌,(జనంసాక్షిష్ట్ర): రాగల నలబై ఎనిమిది గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వారు అన్నారు. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌,…

శాకాంబరిగా దర్శనమిస్తున్న శ్రీబాలాత్రిపురసుందరి అమ్మవారు

రాజమండ్రి : భక్తులపాలిట కల్పవల్లిగా, ఎప్పుడూ బంగారు చీరతో అభయమిచ్చే శ్రీబాలాత్రిపురసుందరి అమ్మవారు సోమవారం శాకాంబరిగా దర్శనమిచ్చారు. అషాడ శుద్ధ పౌర్ణమి సందర్భంగా నగరంలోని సూర్యారావుపేటలో అమ్మవారు పలు రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో భక్తులకు ప్రత్యేక దర్శనమిస్తున్నారు.…

ఎంపీ ఇళ్లముందు ధర్నా: ఏపీఎన్టీవోలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): సీమాంధ్ర ప్రాంతానికి చెందిన పార్లమెంట్‌ సభ్యులు ఇళ్లముందు ఈ నెల 29 న ధర్నాలు చేయనున్నట్లు ఏపీ ఎన్‌జీవోల సంఘం నాయకులు తెలిపారు. సమైక్యాంధ్రకే కట్టబడి ఉండాలంటూ ఢిల్లీ జంతర్‌ మంతర్‌ వద్ద మహాధర్నా చేస్తామన్నారు. సమైక్యాంధ్ర…