Wednesday, 25 November 2026

వార్తలు

కలెక్టరేట్‌ను ముట్టడించిన సమైక్యవాదులు

కడప: సమైక్యాంధ్రకు మద్దతుగా ఈరోజు ఉదయం సమైక్యవాదులు కడప జల్లా కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.

జమ్మలమడుగులో ఆహార తనిఖీ అధికారుల దాడులు

కడప: కడప జిల్లా జమ్మలమడుగులో మామిడి నిల్వ కేంద్రాలు, హోటళ్ల పై ఆహార తనిఖీ అధికారులు దాడులు నిర్వహించారు. ప్రజలకు హానికరమైన రసాయనాలతో మామిడికాయలు పండిస్తున్నారన్న సమాచారంతో అధికారులు దాడులు నిర్వహించారు. ఈదాడుల్లో భారీ స్థాయిలో మామిడి పండ్లు…

చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన తెలుగు తమ్ముళ్లు

టి.నగర్‌(రాజమండ్రి): రాష్ట్ర పర్యటనలో ఉన్న చంద్రబాబునాయుడికి తూర్పుగోదావరి జిల్లాలో ఘనస్వాగతం లభించింది. విశాఖపట్నం నుంచి విజయవాడ రోడ్డు మార్గంలో బయలుదేరిన చంద్రబాబు ఈరోజు ఉదయం రాజమండ్రి చేరుకున్నారు. స్థానిక లాలాచెరువు సెంటర్‌ వద్ద తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి…

ఈరోజు పసిడి ధరలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): నగరంలో ఈ రోజు బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 26,650 గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 25,300 గా ఉంది.…

శ్రీవారిని దర్శించుకున్న సినీనటుడు నాని

తిరుమల: సినీ నటుడు నాని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో నాని దంపతులు స్వామిసేవలో పాల్గొన్నారు. శ్రీవారి అలయం వద్ద నాని దంపతులను చూసేందుకు భక్తులు పోటీ పడ్డారు. నాని దంపతులు…

సీఎం కు వినతి పత్రం అందజేసిన సుధాకర్‌రెడ్డి

హైదరాబాద్‌,(జనంసాక్షి): ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి కలిశారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రికి వినతీపత్రం అందజేశారు.

భద్రాచలంలో వెలసిన మావోయిస్టు పార్టీ పోస్టర్లు

ఖమ్మం,(జనంసాక్షి): భద్రాచలం పరిసారాల్లో మావోయిస్టుల పోస్టర్లు వెలిశాయి. స్థానిక సంస్థల ఎన్నికలు బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. దీంతో స్థానిక రాజకీయ నాయకులు భయాందోళనకు గురవుతున్నారు.

విజయవాడలో తెదేపా రెండో ప్రాంతీయ సదస్సు

విజయవాడ: నగరంలోని ఈడ్పుగల్లులో తెలుగుదేశం పార్టీ రెండో ప్రాంతీయ సదస్సు మరి సేపట్లో  ప్రారంభం కానుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రీణులను సమాయత్తం చేయడమే లక్ష్యంగా సదస్సు జరగనుంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి…

5 నుంచి ఏపీసెట్‌ దరఖాస్తుల స్వీకరణ

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఉస్మానియా విశ్వవిద్యాలయం రెండోసారి నిర్వహించనున్న ఏపీసెట్‌-2013 కు 5వ తేదీ నుంచి ఈ నెల 26 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఏపీసెట్‌ సభ్య కార్యదర్శి ప్రొ. రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకున్న దరఖాస్తులను…

రూ. 30లక్షల విలువైన బంగారం చోరీ

తూర్పుగోదావరి: ఏలేశ్వరం పేరవరం గ్రామాల్లోని రెండు ఇళ్లలో చోరీ జరిగింది. రూ. 30లక్షల విలువైన బంగారం, కారు అపహరణకు గురైనట్లు సమాచారం.