Thursday, 19 November 2026

వార్తలు

స్థాయి సంఘాల సమీక్షలు ప్రారంభం

హైదరాబాద్‌, జనంసాక్షి: శాసనసభ కమిటీహాల్‌లో స్థాయీసంఘాల సమీక్షలు ప్రారంభమయ్యాయి. మానవ వనరుల స్థాయీ సంఘం సమావేశమై విద్యా పద్దతులపై సమీక్ష చేపట్టింది. బడ్జెట్‌ పద్దతులపై సమీక్ష నిమిత్తం 12 స్థాయీ సంఘాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

రూ.30 లక్షలు కారులో తరలిస్తుంటే పటుకున్న పోలీసులు

కడప :రైల్వేకోడూరులో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఎలాంటి బిల్లులు లేకుండా కారులో తరలిస్తున్న రూ. 30 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గుర్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

85 లీటర్ల సారా, 4 వేల లీటర్ల బెల్లం వూట ధ్వంసం

రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని పిడింగొయ్యిలో నాటుసారా తయరీ కేంద్రాలపై ఎక్సైజ్‌ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 85 లీటర్ల నాటుసారా , 4 వేల లీటర్ల లీటర్ల బెల్లం వూటలను ధ్వంసం ముగ్గురిని అదుపులోకి…

కూడంకుళం అణుకేంద్రంపై నేడు సుప్రీం తీర్పు

న్యూఢిల్లీ : వివాదాస్పద కూడంకుళం అణువిద్యుత్కేంద్రంపై సుప్రీంకోర్టు తీర్పు నేడు వెలువడనుంది. న్యాయమూర్తులు కెఎన్‌ రాధాకృష్ణన్‌, దీపక్‌మిశ్రాలతో కూడిన ధర్మాసనం మూడు నెలల పాటు జరిగిన సుదీర్ఘ వాదనలు విన్న అనంతరం తీర్పును రిజర్వులో ఉంచిన సంగతి తెలిసిందే.…

అక్రమంగా తరలిస్తున్న 600 లీటర్ల ఇంధనం పట్టివేత

ఖమ్మం : కేటీపీఎన్‌ ఓ అండ్‌ ఎం యూనిట్‌ నుంచి అక్రమంగా తరలిస్తున్న 600 లీటర్ల ఇంధనాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి : స్టాక్‌ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 20 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 7 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

ఏడేళ్ల బాలికను దారుణ హత్య

సూళ్లూరుపేట : నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలం వట్రపాలెంలో ఏడేళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. అక్రమ సంబంధానికి అడ్డం వస్తుందనే కారణంతో బాలికను తల్లి అలివేలు హత్య చేసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి…

అగ్ని ప్రమాదం వల్ల పత్తి మిల్లు దగ్ధం

ప్రకాశం : మార్టురు-జొన్నతాళి రహదారిలో ఓ పత్తి మిల్లులో ఈ ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి యత్నిస్తున్నారు. రూ.20 లక్షల ఆస్తినష్టం వాటిల్లినట్లు అంచనా…

శ్రీవారిని దర్శించుకున్న మర్రి , మంత్రి తోటనరసింహం

శ్రీవారిని దర్శించుకున్న మర్రి , మంత్రి తోటనరసింహం  శ్రీవారిని దర్శించుకున్న మర్రి , మంత్రి తోటనరసింహం తిరుమల : జాతీయ విపత్తుల నివారణ సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి , రాష్ట్ర మంత్రి తోట నరసింహం ఈ ఉదయం…

నర్సీపట్నం సహకార సంఘం అధ్యక్షుడి ఇంట్లో చోరీ

విశాఖ : నర్సీపట్నం సహకార సంఘం అధ్యక్షుడి ఇంట్లో చోరీ జరిగింది. 50 తులాల బంగారు నగలు, రూ. 4 లక్షల నగదును దొంగలు దోచుకెళ్లారు. పోలీసులు క్లూన్‌