Tuesday, 17 November 2026

వార్తలు

లోక్‌సభ గంటపాటు వాయిదా

ఢిల్లీ : లోక్‌సభ తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు ఆందోళన చేపట్టారు. సడక్‌బంద్‌లో పోలీసుల వైఖరికి నిరసనగా తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు నినాదాలు చేశారు. సభా కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడడంతో సభాపతి సమావేశాన్ని గంటపాటు వాయిదా వేశారు.

తెరాస ఎమ్మెల్యేలకు చర్చలకు ఆహ్వానం

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెరాస ఎమ్మెల్యేలను చర్చలకు ఆహ్వానించారు.శాసనసభలోని సీఎం ఛాంబర్‌లో తెరాస శాసనసభ్యులు సీఎంతో భేటీ అయ్యారు. తెలంగాణవాదులపై కేసులు ఎత్తివేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

సీఎం ఛాంబర్‌ ఎదుట తెరాస ఎమ్మెల్యేల బైఠాయింపు

హైదరాబాద్‌ : శాసనసభ సీఎం ఛాంబర్‌ ఎదుట తెరాస ఎమ్మెల్యేలు భైఠాయించారు. తెలంగాణవాదులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. మరోపక్క స్పీకర్‌ను కలిసిన తెదేపా ఎమ్మెల్యేలు సభ సజావుగా నడిచేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

శాసనమండలి 20 నిమిషాలు వాయిదా

హైదరాబాద్‌ : విపక్ష సభ్యుల ఆందోళనతో శాసనమండలి 20 నిమిషాలు వాయిదా పడింది. విశాఖ ఏజెన్సీలో బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతి రద్దు చేయాలంటూ మండలిలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. సభ్యులు పెద్దయెత్తున నినాదాలు చేశారు. దీంతో ఛైర్మన్‌ మండలిని…

బీటెక్‌ విద్యార్థి దారుణహత్య

మదనపల్లి : చిత్తురు జిల్లా మదనపల్లి పట్టణ సమీపంలోని చంద్రకాలనీ బైపాస్‌ వద్ద ఓ యువకుడు దారుణహత్యక గురయ్యాడు. మృతుడిని పెద్దమండెం మండలం మిట్టవారిపల్లికి చెందిన వెంకటరమణ ప్రతాప్‌(26) అనే బీటెక్‌ విద్యార్థుగా గుర్తించారు. ప్రతాప్‌ స్థానిక గోల్గెన్‌…

టాన్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా

న్యూఢిల్లీ : భారత్‌తో జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్‌లో టాన్‌ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. గాయంతో కెప్టెన్‌ క్లార్క్‌ తప్పుకోవడంతో ఆసీస్‌ పగ్గాలను షేన్‌ వాట్సన్‌ చేపట్టనున్నాడు.

సీనియర్‌ మంత్రులతో బొత్స భేటీ

హైదరాబాద్‌ : పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ శాసనసభ ప్రాంగణంలో సీనియర్‌ మంత్రులతో భేటీ అయ్యారు. శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహం, ధిక్కార ఎమ్మెల్యేల వ్యవహారంపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. ఢిల్లీలో జరిగిన సారాంశాన్ని బొత్స మంత్రులకు వివరించనున్నారు.

ఢిల్లీ టెస్టుకు క్లార్క్‌ దూరం

న్యూఢిల్లీ : ఫిరోజ్‌ షా కోట్ల మైదానం వేదికగా నేటి నుంచి ప్రారంభంకానున్న చివరి టెస్టుకు ఆసీస్‌ ఎప్టెన్‌ క్లార్క్‌ దూరమయ్యాడు. గాయం కారణంగా అతడు ఈ మ్యాచ్‌ నుంచి తప్పుకుంటున్నట్లు జట్ల్టు యాజమాన్యం ప్రకటించింది. దీంతో చివరి…

శాసనసభ 10 గంటలకు వాయిదా

హైదరాబాద్‌ : విపక్ష సభ్యుల ఆందోళనలతో శాసనసభ గంటపాటు. వాయిదా పడింది. సభ ప్రారంభంకాగానే విపక్షాలు ప్రవేశ పెట్టిన వాయిదా తీర్మానాలను స్వీకర్‌ తిరస్కరించారు. దీంతో వాయిదా తీర్మానాలపై చర్చించాలని డిమాండ్‌ చేస్తూ ప్రతిపక్షాలు సభలో నినాధాలు చేశాయి.…

అసెంబ్లీకి కాలినడకన తెరాస ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌ : సడక్‌ బంద్‌ నేతల అరెస్టులకు నిరసనగా తెరాస ఎమ్మెల్యేలు ట్యాంక్‌బండ్‌ నుంచి అసెంబ్లీకి కాలినడకన బయలుదేరారు. ఈ సంద్భంగా తెరాస ఎమ్మెల్యే హారీశ్‌రావు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసేందుకు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ప్రయత్నింస్తోందన్నారు. ప్రభుత్వ చర్యలు…