Monday, 16 November 2026

వార్తలు

ప్రశాంతంగా త్రిపుర ఎన్నికలు

అగర్తలా : త్రిపురలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. మధ్యాహ్నానికి 40 శాతం పోలింగ్‌ నమోదైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌ ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం మాట్లాడుతూ వరసగా నాలుగోసారీ విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. అక్కడ…

గుంటూరు డీసీసీబీ ఎన్నిక వాయిదాపై ప్రభుత్వ అప్పీల్‌

హైదరాబాద్‌: గుంటూరు జిల్లా డీసీసీబీ ఎన్నికను వాయిదా వేస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై హైకోర్టులో ప్రభుత్వం అప్పీల్‌ చేసింది. దీనిపై ఈ రోజు మధ్యాహ్నం వాదనలు జరగనున్నట్లు సమాచారం.

అక్బరుద్దీన్‌ బెయిల్‌పై తీర్పు రేపు

నిజామాబాద్‌: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ బెయిల్‌ పిటిషన్‌పై నిజామాబాద్‌ న్యాయస్థానంలో ఈరోజు వాదనలు పూర్తయ్యాయి. దీనిపై తీర్పును న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది.

ప్రేమ జంటకు వివాహం జరిపించిన భజరంగ్‌దళ్‌

హైదరాబాద్‌: ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఓ ప్రేమ జంటకు భజరంగ్‌దళ్‌ పెళ్లి జరిపించింది. ఈసీఐఎల్‌లో రోడ్డు పై కనిపించిన ఓ జంటకు స్థానిక సాయిబాబా మందిరంలో కార్యకర్తలు పెళ్లి చేశారు. ప్రేమికుల రోజు జరుపుకోవడం మన దేశ సాంప్రదాయం…

ప్రాన్స్‌ అధ్యక్షుడు హోలండ్‌కు ఢీల్లీలో ఘనస్వాగతం

న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఫ్రాన్సియోన్‌ హోలండ్‌ భారత్‌ పర్యటన కోసం ఢిల్లీకి వచ్చారు. ఆ దేశ విదేశాంగ మంత్రితోసహ ఐదుగురు మంత్రులతో కలిసి వచ్చిన హోలండ్‌కు ఢిల్లీ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. అనంతరం రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి…

ఘనంగా దామోదరం సంజీవయ్య జయంతి

హైదరాబాద్‌: మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 92వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పబ్లిక్‌ గార్డెన్స్‌ ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతురావు, కంతేటి సత్యనారాయ  తదితరులు నివాళులు అర్పించారు. అనంతరం నెక్లెస్‌ రోడ్డులోని…

యూపీ శాసనసభను కుదివేసిన తొక్కిసలాట ఘటన

లక్నో : కుంభమేళా సందర్భంగా అలహాబాద్‌  రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట ఘటన ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీలో ప్రకంపనలు సృష్టించింది. ప్రభుత్వ అసమర్థతతోనే ఈ  ఘటన చోటుచేసుకుందని ఆరోపిస్తూ బీఎస్పీ సభ్యులు అఖిలేశ్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకున్నారు.…

పార్కుల మూసివేతపై ఆందోళన

హైదరాబాద్‌: ప్రేమికుల దినోత్సవం సందర్భంగా నగరంలో పార్కుల మూసివేతపై ఏఐఎన్‌ఎఫ్‌ ఆందోళనకు దిగింది. ఇందిరాపార్కు వద్ద ఏఐఎన్‌ఎఫ్‌ కార్యకర్తలు నిరసన చేపట్టారు. దీంతో పోలీసులు పలువురుని అదుపులోకి తీసుకొని సమీప పోలీసు స్టేషన్‌కు తరలించారు. వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్‌ హెచ్చరికల…

పోలవరం పర్యావరణ అనుమతులపై హైకోర్టులో పిటిషన్‌

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పోలవరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లేవంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌పై విచారణను కోర్టు ఈ నెల 28కు వాయిదా వేసింది.

సీబీఐ కోర్టులో నిందితులను హాజరుపరిచిన పోలీసులు

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తులు, ఎమ్మార్‌, ఓఎంసీ కేసుల నిందితులను సీబీఐ కోర్టులో పోలీసులు ఈ ఉదయం హాజరుపరిచారు. వ్యక్తిగత కారణాల వల్ల హాజరు కాలేకపోతున్నట్లు మంత్రి ధర్మాన కోర్టుకు తెలియజేశారు.