Sunday, 15 November 2026

వార్తలు

విశాఖ జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు

విశాఖ : జిల్లాలోని పలు మండలాల్లో ఈ ఉదయం స్వల్పంగా భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. మాకవరపాలెం, నర్సీపట్నం, రోలుగుంట, కొయ్యూరు. మాడుగులలో భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకి పరుగులు తీశారు. .

ప్రత్యర్థుల దాడిలో వ్యక్తి మృతి

గుంటూరు : వెల్దుర్తి మండలం రాచమలపాడులో పొలానికి కాపలా వెళ్లిన ముగ్గురు వ్యక్తులపై పాత కక్షల నేపథ్యంలో ప్రత్యర్థులు దాడికి దిగారు. నిన్న రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా … ఇద్దరికి తీవ్రగాయాల్యాయి.…

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి దుర్మరణం

గండేడ్‌ : రంగారెడ్డి జిల్లా గండేడ్‌ మండల కేంద్రానికి సమీపంలో ఈ తెల్లవారుజామున ఓ ద్విచక్రవాహనాంపై ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను కోమిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన యముక కొండయ్య (25), రావు రాజు (20), నర్సింహులు…

వాహనం దూసుకెళ్లి ఇద్దరి మృతి

తాండురు : రంగారెడ్డి జిల్లా తాండూరు మండలంలోని గౌతారంలో పోలీసులు ఏర్పాటు చేసిన ట్రాఫిక్‌ నిబంధనల బోర్డును ద్విచక్రవాహనం ఢీకొని ఇద్దరు యువకులు కిందపడ్డారు. అదే సమయంలో వీరిపై గుర్తు తెలియని వాహనం దూసుకెళ్లడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి…

నూతన సంవత్సర వేడుకల్లో అపశ్రుతి, ఇద్దరి మృతి

హైదరాబాద్‌: నూతన సంవరత్సరం వచ్చీరావడంతోనే నగరంలో ఇద్దరిని బలి తీసుకుంది. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం. 1లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. కారు, ద్విచక్ర వాహనం ఢికొనడంతో ఈ ప్రమాదం…

అన్నీ రాజకీయపక్షాలకు షిండే లేఖ

న్యూఢిల్లీ : ఢిల్లీ ఘటనపై చట్టాల్లో తీసుకురావాల్సిన సవరణలపై సూచనలు, సలహాలు కోరుతూ కేంద్ర హోంశాఖమంత్రి సుశీల్‌కుమార్‌షిండే అన్నీ రాజకీయపక్షాలకు లేఖ రాశారు. ఇప్పటికే ఉన్న చట్టాల్లో మార్పు కోసం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జేఎస్‌ వర్మ నేతృత్వంలో…

కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీకి నోటీఫికేషన్‌ విడుదల

హైదరాబాద్‌: రాష్ట్రంలో  6,071 పోలీసు కానిస్టేబుళ్ల భర్తీకి రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సివిల్‌, ఏఆర్‌, ఏపీఎస్పీ, అగ్నిమాపక విభాగాల్లో ఖాళీలను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు.

తెలంగాణ సాధనకు జనవరి నెలంతా పోరాట కార్యక్రమాలు : కోదండరాం

హైదరాబాద్‌: తెలంగాణ సాధనకు జనవరి నెలంతా పోరాట కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రొ. కోదండరాం తెలియజేశారు. జనవరి 26లోగా తెలంగాణపై కేంద్రం నిర్ణయాన్ని వెలువరించాలని ఆయన డిమాండ్‌ వ్యక్తం చేశారు. తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలోనూ ధూంధాం కార్యక్రమాలే నిర్వహిస్తామని ఆయన…

దేశరాజధానిలో కొనసాగిన ప్రదర్శనలు

న్యూఢిల్లీ : అత్యాచార బాధితురాలి మరణానికి సంతాపంగా దేశరాజధాని నగరంలో నిరసన ప్రదర్శినలు కొనసాగుతున్నాయి. జంతర్‌మంతర్‌ వద్ద  వందలాదిమంది సమావేశమై మృతురాలికి శ్రద్దాంజలి ఘటించారు.  మహిళలపై జరుగుతున్న నేరాలను అడ్డుకునేందుకు కఠినచట్టాలు చేయాలిని ఉద్యమకారులు డిమాండ్‌ వ్యక్తం చేశారు.

రైల్వే ప్రయాణికులకు మెరుగైన సేవలు : కాంతారావు

హైదరాబాద్‌: రైల్వే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం రైల్వే పోలీసు పనిచేస్తుందని సికింద్రాబాద్‌ జీఆర్పీ ఎస్సీ కాంతారావు తెలియజేశారు. 2011,2012 సంవత్సరాల కేసుల నమోదు, రికవరీ తదితర వివరాలను ఆయన విడుదల చేశారు. రైల్వేస్టేషన్లలో మహిళల…