Sunday, 15 November 2026

వార్తలు

గుంటూరు జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు

గుంటూరు: జిల్లాలోని శావల్యాపునం మండలం మెతుకుపల్లి, శానంపూడి, బొమ్మడిపాలెంలో స్వల్ప భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ప్రజలు భయందోళనలకు గురయ్యారు. ఎలాంటి ప్రమాదం సంభవించలేదు.

11 నుంచి ఓయూ ఎమ్మెస్సీ పరీక్షలు

హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఎమ్మెస్సీ పరీక్షలు ఈ నెల 11 నుంచి జరగనున్నట్లు అధికారులు తెలియజేశారు. మూడో సెమిస్టర్‌ పరీక్షలు 11 నుంచి, మొదటి సెమిస్టర్‌ పరీక్షలు 12 నుంచి ప్రారంభం అవుతాయని స్పష్టం చేశారు. మంగళవారం…

లండన్‌ బయల్దేరిన స్పీకర్‌ నాదెండ్ల

హైదరాబాద్‌: స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ మంగళవారం ఉదయం లండన్‌ బయల్దేరి వెళ్లారు. లండన్‌లో జరిగే కామన్‌వెల్త్‌ యూత్‌ పార్లమెంట్‌ సదస్సులో నాదెండ్ల పాల్గొననున్నారు.

వివేక్‌ ఇంట్లో టీ కాంగ్రెస్‌ ఎంపీలు భేటీ

న్యూఢిల్లీ: పెద్దపల్లి ఎంపీ వివేక్‌ నివాసంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు సమావేశమయ్యారు. భేటీలో కేంద్ర మంత్రులు సుశీల్‌కుమార్‌ షిండే, కమల్‌నాథ్‌ల వద్ద భేటపై చర్చిస్తున్నారు. ఎఫ్‌డీఐలపై అనుకూలంగా ఓటేయ్యాలని ఎంపీలను మంత్రులు కోరనున్నట్లు తెలుస్తోంది. ఎంపీలు కూడా…

‘ల్యాంకో, జీఎంఆర్‌లకు సప్ల్తె నిలిపివేయాలి’

హైదరాబాద్‌: ల్యాంకో, జీఎంఆర్‌ సంస్థలకు ప్రభుత్వం కేటాయిస్తున్న గ్యాస్‌ సరఫరాను వేంటనే నిలిపివేయాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు డిమాండ్‌ వ్యక్తం చేశారు. ఇవాళ ఆయన ఈఆర్‌సీ కార్యాలయంలో కమిషన్‌ జరిపిన బహిరంగ విచారణలో పాల్గొన్నారు. ల్యాంకో, జీఎంఆర్‌లకు నిబంధనలకు…

సీబీఐ డైరెక్టర్‌గా రంజిత్‌ సిన్హా బాధ్యతల స్వీకరణ

న్యూఢిల్లీ : సీబీఐ కొత్త డైరెక్టర్‌గా రంజిత్‌ సిన్హా ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఈ పదవిలో రెండేళ్లపాటు కొనసాగనున్నారు. ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ డైరెక్టర్‌తోపాటు గతంలో పలు కీలక బాధ్యతలు నిర్వహించారు.

ఎస్సీ, ఎస్టీల చేతుల్లో ఉన్నవి 20 శాతం భూములే

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఎస్సీ,ఎస్టీలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని రాష్ట్ర మంత్రి శైలజానాథ్‌ పేర్కొన్నారు. ఎస్సీ,ఎస్టీ ఉప ప్రణాళికప చర్చ సందర్భంగా శాసనసభలో మంత్రి మాట్లాడారు. కేవలం 20 శాతం భూములు మాత్రమే ఎస్సీ,ఎస్టీల చేతుల్లో ఉన్నాయని అన్నారు.…

హైదరాబాద్‌లో దారుణహత్య

హైదరాబాద్‌ : రాజధాని నగరంలో పట్టపగలు దారుణహత్య చోటుచేసుకుంది. అంబర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని శంకర్‌నగర్‌లో బర్కత్‌పుర డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న ఉపేంద్రాచారి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు కర్రలతో దాడి చేశారు. దీంతో అతను అక్కడికక్కడే మృతి…

‘ముస్లింలకు బడ్జెట్‌లో రూ.5 వేల కోట్లు ఇవ్వాలి’

హైదరాబాద్‌: ముస్లిం మైనారిటీలకు వచ్చే బడ్జెట్‌లో రూ. 5 వేల కోట్లు కేటాయించాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు డిమాండ్‌ వ్యక్తం చేశారు. ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయింపులు చేయకపోతే ఆందోళన చేస్తమని హెచ్చరించారు. తమ పార్టీ ముస్లిం మైనారీటీల సంక్షేమానికి…

టీ మంత్రులు, ఎంపీలకు కాంగ్రెస్‌ ఆహ్వానం

న్యూఢిల్లీ: ఎఫ్‌డీఐలపై పార్లమెంట్‌లో ఓటింగ్‌ జరుగనున్న దృష్ట్యా కాంగ్రెస్‌ హైకమాండ్‌ బుజ్జగింపు చర్యలకు ప్రారంభించింది. తెలంగాణ ప్రాంత మంత్రులను, తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలను చర్చలకు రావాలని ఆహ్వానించింది. రేపు హైకంమాండ్‌తో మంత్రులు, ఎంపీలు భేటీ కానున్నారు. హైకమాండ్‌ తరపున…