Sunday, 15 November 2026

వార్తలు

తెలంగాణకోసం పార్లమెంటు స్తంభన : బీజేపీ

నల్గొండ: వచ్చేనెల 9 నుంచి ప్రత్యేక తెలంగాణ కోసం బీజేపీ ఎంపిలు పార్లమెంటును స్తంభింపజేస్తారని పార్టీ రాష్ట్ర నేత  బి. దత్తాత్రేయ చెప్పారు. కోదాడ నుంచి ఈ నెల 26న ఎబివిపి కార్యకర్తలు ప్రారంభించిన మహాపాదయాత్ర శుక్రవారం నల్గొండకు…

గుజ్రాల్‌ అంతిమయాత్ర ప్రారంభం

న్యూఢిల్లీ : మాజీ ప్రధాని గుజ్రాల్‌ అంతిమయాత్ర ప్రారంభమయింది. నగరంలోని స్రృతిస్థల్‌లో మధ్యాహ్నం 3 గంటలకు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ప్రాచీనకాలంనుంచి ఎస్సీల జీవితాల్లో ఎలాంటి మార్పులేదు: మంత్రి గీతారెడ్డి

హైదరాబాద్‌: ప్రాచీన కాలంనుంచి ఎస్సీల జీవితాల్లో ఎలాంటి మార్పులేదని రాష్ట్ర మంత్రి గీతారెడ్డి అన్నారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికపై విధానసభలో జరిగిన చర్చలో  ఆమె పాల్గొంటూ ఎస్సీ, ఎస్టీలకు దక్కాల్సిన నిధులు వారికి దక్కాలని ఆమె పేర్కొన్నారు.…

జానారెడ్డితో ఎర్రబెల్లి దయాకర్‌రావు భేటీ

హైదరాబాద్‌: మంత్రి జానారెడ్డితో టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు శనివారం భేటీ అయ్యారు. ఈ  సందర్భంగా తెలంగాణ ఫ్రంట్‌ ఏర్పాటుపై వీరి ఇరువురి మధ్య చర్చ జరుగుతున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

రాష్ట్రంలో సర్వేచేస్తున్న రాహుల్‌ బృందం

హైదరాబాద్‌: 2014 ఎన్నికలకు గెలుపుగుర్రాల ఎంపిక, స్థానిక పరిస్థితుల అధ్యయనంకోసం దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న రాహుల్‌గాంధీ బృందం శనివారం హైదరాబాద్‌లో హల్‌చల్‌ చేసింది. రాహుల్‌ అనుచరులు విశ్వజిత్‌ రాణే, జితేంద్రదె శ్‌ ప్రభు నేతృత్వంలోని ప్రతినిధిబృందం గాంధీభవన్‌కు వెళ్ళింది. రాయలసీమలోని…

మాస్కో నగరాన్ని ముంచెత్తుతున్న హిమపాతం

మాస్కో : రష్యా రాజధాని మాస్కో నగరాన్ని హిమపాతం ముంచెత్తుతోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న హిమపాతంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మంచు ప్రభావం విమాన సర్వీసులతోపాటు ఉపరితల రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం కలిగిస్తోంది. దీన్ని దశాబ్దాల…

నేత కార్మికుల సమస్యలపై కేటీఆర్‌ చర్చలు

కరీంనగర్‌: తమకు కూలీలు పెంచాలంటూ సిరిసిల్ల నేతన్నలు పోరుబాట పట్టి ఇవాళ్టికి ఐదు రోజులైంది. పాలిస్టర్‌ నేత కార్మికుల సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ నేత కల్వకుంట్ల తారక రామరావు చొరవ తీసుకున్నారు. యాజమాన్యాలతో చర్చలు జరిపి కార్మికుల…

అసెంబ్లీలో ముక్కునేలకు రాస్తా : హరీష్‌రావు

హైదరాబాద్‌: ఇందిరా జలప్రభ వల్ల తెలంగాణకు ఒరింగిందేమీలేదని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. ఇవాళ ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ ‘ ఇందిరా జల ప్రభ ‘ వల్ల తెలంగాణలో కనీసం పది ఎకరాల భూమి తడిచినా తాను ముక్కు…

నీటితొట్టెలో పడి చిన్నారి మృతి

చేగుంట : మెదక్‌ జిల్లా చేగుంట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రామంతపూర్‌ వద్ద వ్యవసాయ క్షేత్రంలో ఉన్న నీటి తొట్టెలో పడి సిరి (3) అనే చిన్నారి మృతి చెందింది. తల్లిదండ్రులు బుజ్జి, గణేష్‌లు వ్యవసాయ పనులు చేసుకుంటుండగా చిన్నారి…

గుజ్రాల్‌కు తెదేపా నేతల నివాళి

న్యూఢిల్లీ : అనారోగ్యంతో నిన్న కన్నుమూసిన మాజీ ప్రధాని ఇందర్‌ కుమార్‌ గుజ్రాల్‌ భౌతికకాయానికి తెలుగుదేశం పార్టీ ఎంపీలు నామా నాగేశ్వర్‌రావు, హరికృష్ణ నివాళులు అర్పించారు. దేశానికి ప్రధానిగా సేవలందించిన గుజ్రాల్‌ మరణం దేశానికి తీరని లోటని పేర్కొన్నారు.…