Saturday, 14 November 2026

వార్తలు

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాస్‌ ఖర్చు తేల్చాలి: కేసీఆర్‌

వరంగల్‌: ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాస్‌ నిధుల ఖర్చు లెక్క తేల్చాలని టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు డిమాండ్‌ వ్యక్తం చేశారు. ఈ నిధులపై లెక్కలు తేల్చకుంటే టీఆర్‌ఎస్‌ నిరసనలు చేపడుతుందని ఆయన హెచ్చరించారు. పాత విషయాలు తేల్చకుండా…

యువజన కాంగ్రెస్‌ నుంచి సస్పెన్షన్‌కు గురైన మంత్రుల కుమారులు

హైదరాబాద్‌: కేంద్రమంత్రి బలరాం నాయక్‌, రాష్ట్ర మంత్రి సారయ్యల కుమారులను యువజన కాంగ్రెస్‌ సస్పెండ్‌ చేసింది. బలరాం నాయక్‌ తనయుడు సాయి, సారయ్య కుమారుడు శ్రీమాన్‌లను విధుల నిర్వహణలో అలసత్వం వహిస్తున్నారని యువజన కాంగ్రెస్‌ నుంచి తొలగించినట్లు సమాచారం…

బీఏసీ సమావేశానికి సీఎం, డీప్యూటీ సీఎం గైర్హాజరు

హైదరాబాద్‌: ఈరోజు శాసనసభాపతి నాదెండ్ల మనోహర్‌ అధ్యక్షతన జరిగిన సభా వ్యవహారాల సంఘం సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు గైర్హాజరయ్యారు. ఈ విషయాన్ని మజ్లిస్‌ నేత అక్బరుద్దీన్‌ తప్పుబట్టారు.…

‘కేసీఆర్‌ తెలంగాణ కోసం ఆమరణ దీక్ష చేసిండు’ హారీష్‌రావు

మెదక్‌: తెలంగాణ ఉద్యమ రథసారధి కల్వకుంట్ల చంద్రశేకర్‌రావు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకే ఆమరణ నిరాహాన దీక్ష చేశాడని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. ఇవాళ ఆయన సిద్దిపేటలో ఏర్పాటు చేసిన తెలంగాణ దీక్షా దివస్‌లో మాట్లాడారు. టీడీపీ అధినేత…

ఏసీబీకి చిక్కిన నారాయణపూర్‌ వీఆర్వో

గంగాధర: మండలంలోని నారాయణపూర్‌, నాగిరెడ్డిపూర్‌ గ్రామాల్లో విధులు నిర్వర్తిస్తున్న వీఆర్వో నారాయణ ఒక రైతు నుండి 5వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.

పది జిల్లాల్లో కొనసాగుతున్న ‘ తెలంగాణ దీక్షాదివస్‌ ‘

హైదరాబాద్‌: తెలంగాణలోని పది జిల్లాలు ‘ తెలంగాణ దీక్షా దివన్‌ ‘ సందరర్భంగా జై తెలంగాణ నినాదాలతో హోరెత్తుతున్నాయి. తెలంగాణ అంతటా పలు ప్టణాలు, గ్రామాలు దీక్షా శిబిరాలతో కిక్కిరిసి పోయాయి. కేసీఆర్‌ తెలంగాణ సాధన కోసం ఆమరణ…

మోపిదేవి బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు పూర్తి

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. మోపిదేవి బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు డిసెంబర్‌ 3వ తేదీకి వాయిదా వేసింది.

ముగిసిన మండలి సలహా సంఘం సమావేశం

హైదరాబాద్‌: శాసనమండలి వ్యవహారాల సలహా సంఘం సమావేశం ముగిసింది. శాసనమండలి రేపు ఒక్కరోజే సమావేశం కానుంది. ఈ సమావేశాంలో నీలం తుపానుపై చర్చ చేపట్టనున్నారు. డిసెంబరు 10 నుంచి మండలి శీతాకాల సమావేశాలు జరుగుతాయి. శీతాకాల సమావేశాల్లో ఎస్సీ,…

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కినా ఆర్‌ఐ

కర్నూలు : కర్నూలు జిల్లా బేతంచర్లలో ఆర్‌ ఐగా విధులు నిర్వహిస్తున్న విష్ణు అనే ప్రభుత్వోద్యోగి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. పట్టాదారు పాసు పుస్తకాల కోసం రూ. 12 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అతడిని…

రాయితీలు ఎత్తివేసేందుకే నగదు బదిలీ పథకం: ఎంపీ నామా

ఢిల్లీ: రాయితీలు ఎత్తివేసేందుకే నగదు బదిలీ పథకమని తెదేపా ఎంపీ నామా నాగేశ్వరరావు ఆరోపించారు. నగదు బదిలీ పథకం వల్ల పేదలకు అందే రాయితీలన్నీ పోతాయన్న ఆయన గ్యాస్‌ సిలిండర్ల పరిమితిపై లోక్‌సభలో చర్చ జరపాలని నోటీసులు ఇచ్చినట్లు…