Saturday, 14 November 2026

వార్తలు

అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలపై తెదేపా నేతల భేటీ

మెదక్‌ : అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలపై తెదేపా కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా పార్టీ అధినేత చంద్రబాబునాయుడు బసచేసిన మెదక్‌ జిల్లా అలీఖాన్‌పల్లిలో తెదేపా నేతలు భేటీ అయ్యారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి…

కృష్ణా తీరాన భక్తుల పుణ్యస్నానాలు

విజయవాడ : కార్తీక పౌర్ణమి పర్వదినాన కృష్ణా తీరానికి భక్తులు పోటెత్తారు.ఈ తెల్లవారుజాము నుంచే విజయవాడ దుర్గాఘాట్‌లో పెద్దసంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. నదిలో నీటి మట్టం లేకపోవడంతో దుర్గగుడి అధికారులు ఏర్పాటు చేసిన జల్లు స్నానాల ఘట్టాల…

పౌల్ట్రీ ఇండియా సదస్సు ప్రారంభం

హైదరాబాద్‌ : పౌల్ట్రీ ఇండియా 2012 సదస్సు హైటెక్స్‌లో ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి సదస్సును ప్రారంభించారు. మూడు రోజులపాటు పౌల్ట్రీ ప్రదర్శన కొనసాగుతుంది.

ఫేస్‌బుక్‌ వ్యవహారం పాల్‌ఘర్‌లో నేడు శివసేన బంద్‌

ముంబయి : బాల్‌ థాకరే మృతి అనంతరం ఫేస్‌బుక్‌లో వ్యాఖ్యలు చేసినందుకు ఇద్దరు మహిళలను అరెస్టు చేసిన పోలీసులను సస్పెండ్‌ చేయడాన్ని నిరసిస్తూ శివసేన నేడు థానే జిల్లాలోని పాల్‌ఘర్‌లో బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో ఇక్కడ విద్యాసంస్థలు, వ్యాపార…

గ్రూప్‌-2 ప్రాథమిక కీ విడుదల

హైదరాబాద్‌ : 2011లో నిర్వహించిన గ్రూప్‌-2 ప్రాథమిక కీ ని ఏపీపీఎస్పీ విడుదల చేసింది. డిసెంబర్‌ 4 వరకు దీనిపై అధ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం తుది కీ విడుదల చేస్తామని చెప్పారు.

నాగార్జన అగ్రికెం పరిశ్రమకు వ్యతిరేకంగా ఆందోళన

ఎచ్చెర్ల : నాగార్జున అగ్రికెం పరిశ్రమను పున:ప్రారంభించడాన్ని వ్యతిరేకిస్తూ భారత స్వాభిమాన్‌ ట్రస్టు ఆందోళన చేపట్టింది. సంస్థ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసానంద స్వామి శ్రీకాకుళంలోని ఎచ్చెర్ల మండలంలోని చిలకపాలెం గ్రామంలో రోఉ్డపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో ఆయనతోపాటు…

ఖమ్మంలో పత్తిరైతుల ఆందోళన

ఖమ్మం : జిల్లాకేంద్రంలోని పత్తి మార్కెట్‌లో రైతులు ఆందోళనకు దిగారు. మార్కెట్‌కు తెచ్చిన పత్తిని కొనుగోలు చేయడం లేదంటూ సీసీఐ అధికారులతో వాగ్వాదానికి దిగారు. అధికారులు రైతులను అడ్డుకోవడంతో మార్కెట్‌లో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.

తెదేపాలో చేరిన కృష్ణయాదవ్‌

మెదక్‌ : మాజీమంత్రి కృష్ణయాదవ్‌ తెలుగుదేశం పార్టీలో చేరారు. వస్తున్నా… మీకోసం పాదయాత్రలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు బసచేసిన అలీఖాన్‌పల్లె ప్రాంతానికి కృష్ణయాదవ్‌ కార్యకర్తలతో కలిసి చేరుకున్నారు. అనంతరం చంద్రబాబు సమక్షంలో పార్టీలోచేరారు. గతంలో తెదేపా…

నల్లగొండ జిల్లాలో ఘోర ప్రమాదం : ఆరుగురు మృతి

నల్లగొండ : నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్‌ బోల్తాపడిన సంఘటనలో ఆరుగురు వ్యక్తులు చనిపోయారు. మృతులు త్రిపురాపురం మండలం బొర్రిపాలెం గ్రామానికి చెందిన కూలీలుగా గుర్తించారు.

యాదగిరిగుట్టలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు

యాదగిరిగుట్ట : కార్తీక పౌర్ణమి వేడుకలు యాదగిరిగుట్ట శ్రీలక్ష్మినరసింహస్వామి పుణ్యక్షేత్రంలో ఘనంగా జరుగుతున్నాయి., శివకేశవులకు ప్రీతికరమైన రోజు కావడంతో హరిహరులు ఉన్న ఈ క్షేత్రాన్ని సందర్శించిన భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. శ్రీసత్యనారాయణస్వామి వ్రతాలు అధిక సంఖ్యలో జరిగాయి.…