Saturday, 14 November 2026

వార్తలు

మందకృష్ణ తెలంగాణ ద్రోహి: సుమన్‌

హైదరాబాద్‌: ఎమ్మార్పీఎస్‌ నేత మందకృష్ణ మాదిగ తెలంగాణ ద్రోహి అని టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు బాల్క సుమన్‌ అన్నారు. తెలంగాణ కావాలో వద్దో మందకృష్ణ స్పష్టం చేయాలని సుమన్‌ డిమాండ్‌ చేశారు. ఇవాళ ఆయన తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు.…

‘ తెలంగాణకు మాదిగలంతా అనుకూలం’

హైదరాబాద్‌: తెలంగాణలో ఉన్న మాదిగలంతా తెలంగాణ ఏర్పాటుకు అనుకూలమని టీఆర్‌ఎస్‌ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు సామెల్‌ అన్నారు. ఇవాళ ఆయన టీఆర్‌ఎస్‌ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలోని మాదిగలంతా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమిస్తున్నారని ఆయన తెలియజేశారు.…

మాకు తగిన సంఖ్యాబలం ఉంది: ప్రధాని

ఢిల్లీ: ఎఫ్‌డీఐలపై చర్చకు విపక్షాలు పట్టుబట్టిన నేపథ్యంలో ఈరోజు యూపీఏ భాగస్వామ్య పక్షాలతో సమావేశమైంది. అనంతరం మాట్లాడుతూ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఓటింగ్‌తో కూడిన చర్చ  జరిగినా తమకు అభ్యంతరం లేదని, తగిన సంఖ్యాబలం తమకుందని నమ్మకం వ్యక్తం చేశారు.…

మరోసారి రికార్డు స్థాయికి బంగారం ధర

ఢిల్లీ : నిన్న రికార్డు సృష్టించిన బంగారం ధర ఈ రోజు మరింత పైకెగబాకింది. ఢిల్లీలో నేడు 24 క్యారట్ల పది గ్రాముల బంగారం రూ. 32,975 నమోదైంది. నిన్న ఇది 32,950 నమోదైన సంగతి తెలిసిందే.

14 కిలోల గంజాయి స్వాధీనం

విజయనగరం : విజయనగరం జిల్లాలో ఎక్సైజ్‌ పోలీసులు 14 కిలోల గంజాయిని స్వాథీనం చేసుకున్నారు. జిల్లాలోని ఎస్‌, కోట మండలం బొడ్డవర వద్ద గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అరెస్టు చేసి వారి దగ్గరనుంచి గంజాయిని స్వాధీనం…

తహసీల్దారు కార్యాలయంపై ఏసీబీ దాడి

వరంగల్‌: వరంగల్‌ జిల్లా బచ్చన్నపేట తహసీల్దారు కార్యాలయంపై ఏసీబీ ఈరోజు దాడులు నిర్వహించింది. పట్టాదారు పాసు పుస్తకాల కోసం రూ. 8 వేలు లంచం తీసుకుంటూ ఉప తహసీల్దారు రాజేందర్‌ ఏసీబీకి చిక్కారు. అధికారులు ఆయనపై కేసు నమోదు…

రోడ్డు ప్రమాదంలో ఫార్మసీ విద్యార్థి మృతి

కోదాడ : కోదాడ మండలంలోని తమ్మర వద్ద ఖమ్మంరోడ్డు పై జరిగిన ప్రమాదంలో ఫార్మసీ చదువుతున్న విద్యార్థి మృతిచెందాడు. మరో విద్యార్ధికి తీవ్రగాయాలయ్యాయి కోదాడ అనురాగ్‌ ఫార్మసీ కళాశాలకు చెందిన 3వ సంవత్సరం విద్యార్థులు ఎండీ నజీర్‌, వినోద్‌కుమార్‌లు…

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగరంలోని బులియన్‌ మార్కెట్లో ఈరోజు నమోదైన వెండి, బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 32,960గా ఉంది. 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,300…

‘చంద్రబాబుకు దమ్ముంటే కేసీఆర్‌తో చర్చకు రావాలి’

హైదరాబాద్‌: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు దమ్ముంటే తమ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో చర్చకు రావాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు డిమాండ్‌ వ్యక్తం చేశారు. కేసీఆర్‌ అడిగే ప్రశ్నలకు బాబు సమాధానం చెప్పకుండా కేసీఆర్‌వి పిట్లకథలని తప్పించుకుంటున్నారని…

ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక చట్టబద్దతకు ప్రత్యేక సమావేశం

హైదరాబాద్‌: ఈ నెల 30, డిసెంబరు 1న శాసనసభ ప్రత్యేక సమావేశాలు జరపనున్నట్లు చీఫ్‌ విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి తెలియజేశారు. ఎస్‌సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు చట్టబద్ధత కల్పించేందుకే ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు గండ్ర పేర్కొన్నారు. ఈ సమావేశాల్లో…