Saturday, 14 November 2026

వార్తలు

భోపాల్‌లో కూలిన ట్యాంకు :ఏడుగురి మృతి

భోపాల్‌ : నగరంలో సోమవారం తెల్లవారుజామున సుమారు ఒంటిగంటకు సాయిబాబునగర్‌ మురికివాడలో ఓ వాటర్‌ట్యాంకు కుప్పకూలింది. ఈ సంఘటనలో ఏడుగురు మరణించగా మరో 35 మంది గాయపడ్డారు. తెల్లవారుజామున సాయిబాబానగర్‌ వద్ద భోపాల్‌ పురపాలక సంస్థ (బీఎంసీ) ఏర్పాటు…

మద్యం సిండికేట్లపై విచారణ వాయిదా

హైదరాబాద్‌: మద్యం సిండికేట్ల వ్యవహారంలో ఏసీబీ సీల్డ్‌కవర్‌లో హైకోర్టుకు దర్యాప్తు నివేదిక సమర్పించింది. దీనిపై విచారణను హైకోర్టు వాయిదా వేసింది.

ఎఫ్‌డీఐలపై కేంద్రాన్ని నిలదీస్తాం : రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: సుప్రీంకోర్టులో జగన్‌కు బెయిల్‌ రావాలంటే కనీసం మూడు, నాలుగేళ్లు పడుతుందని తెదేపా నేత రేవంత్‌రెడ్డి అన్నారు. రాబోయే పార్లమెంట్‌ సమావేశాల్లో  ఎఫ్‌డీఐలపై కేంద్రాన్ని నిలదీస్తామని చెప్పారు. భవిష్యత్తులో కాంగ్రెస్‌లో కలువబోమని పిల్లలపై ఒట్టేసి వైఎస్‌ భారతి చెప్పగలరా…

పాతబస్తీలో స్వల్ప ఉద్రిక్తత

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ మళ్లీ ఉలిక్కిపడింది. గత కొద్దిరోజులుగా పాతబస్తీలోని భాగ్యలక్ష్మి దేవాలయం విషయంలో ఉద్రిక్తలు చోటుచేసుకుంటున్న క్రమంలో సోమవారం సైతం  పాతబస్తీలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. హైకోర్టు ఎదురుగా ఉన్న ఝాన్సీ బజారులో 2 కార్లు, 4…

ఎమ్మెల్యేపై నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌

తూ. గో: పెద్దాపురం ఎమ్మెల్యే పంతం గాంధీ మోహన్‌పై నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ  అయింది. అధికారులను నిర్భంధించిన కేసులో కాకినాడ కోర్టు ఆయన ఫైనాస్‌బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌  జారీ చేసింది.

చైనా ప్రధానితో మన్మోహన్‌సింగ్‌ భేటీ

నామ్‌ఫెస్‌: చైనా ప్రధాని వెస్‌జియోబావోతో భారత ప్రధాని మన్మోహన్‌సింగ్‌ భేటీ అయ్యారు. ఆసియాన్‌, తూర్పు ఆసియా సదస్సులో పాల్గొనేందుకు కాంబోడియా వచ్చిన ప్రధాని ఈ పర్యటనలో భాగంగా చైనా ప్రధానితో సమావేశమయ్యారు. ఈ భేటీలో ద్వైపాక్షిక సంబంధాలుపై ఇరు…

పాతబస్తీతో సహా రాష్ట్రమంతా ప్రశాంతంగా ఉంది: సబిత

విజయవాడ: విజయవాడ కనకదుర్గమ్మను రాష్ట్ర హోంమంత్రి సబితా  ఇంద్రారెడ్డి సోమవారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు ఘసస్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వచనం అందుకున్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలంతా…

తొలి టెస్టులో భారత్‌ ఘన విజయం

అహ్మదాబాద్‌ : ఇంగ్లండ్‌తో తొలిటెస్టులో భారత్‌ తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్‌ కోల్పోయి 77 పరుగులు విజయలక్ష్యాన్ని చేరుకొంది. అంతకుముందు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 406 పరుగులకు ఆలౌటయింది. ఈ…

కేంద్ర మంత్రి లేఖ విషయంలో వస్తున్న వన్నీ పుకార్లే : బొత్స

హైదరాబాద్‌: కేంద్ర మంత్రి కిషోర్‌ చంద్రదేవ్‌ కాంగ్రెస్‌ అధిష్ఠానానికి రాసినట్లుగా చెబుతొన్న లేఖను తాను పత్రికల్లో చూడలేదని పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన లేఖ విషయంలో వస్తున్న  వారలన్నీ పుకారేనని వ్యాఖ్యానించారు.

అహ్మదాబాద్‌ టెస్ట్‌లో భారత్‌ ఘన విజయం

అహ్మదాబాద్‌ : అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న క్రికెట్‌ టెస్ట్‌లో భారత్‌ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 406 పరుగులకు ఆలౌటైంది. 77 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ సునాయసంగా లక్ష్యాన్ని…