Saturday, 14 November 2026

వార్తలు

ఎంఐఎం పొలిట్‌బ్యూరో అత్యవసర భేటీ

హైదరాబాద్‌: పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయ వివాదం నేపధ్యంలో ఎంఐఎం అత్యవసర భేటీ నిర్వహించింది. నాంపల్లిలోని దారుసలాంలో ఈ రోజు ఎంఐఎం పొలిట్‌బ్యూరో సభ్యులు భేటీ అయ్యారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మద్దతు కొనసాగింపుపై మధ్యాహ్నం 12 గంటలకు కీలక…

బాణసంచా దుకాణల్లో ప్రమాదం

కడప: కడప జిల్లా పులివెందులలోని దీపావళి సందర్భంగా ఏర్పాటుచేసిన బాణసంచా దుకాణంలో విద్యుదాఘాతం సంభవించింది. ఈ ఘటనలో ఎనిమిది దుకాణాలు దగ్ధమయ్యాయి. ప్రమాదంలో సుమారు రూ. 50 లక్షలు ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనావేస్తున్నారు.

సీఎం కిరణ్‌తో బొత్స భేటీ

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఈరోజు జరిగిన భేటీలో దానం నాగేందర్‌, ముఖేష్‌ గౌడ్‌, షబ్బీర్‌ అలీ, హబీద్‌ రసూల్‌ఖాన్‌ పాల్లొన్నారు.

మద్దతు ఉపసంహరణపై చర్చిస్తున్న మజ్లిస్‌

హైదరాబాద్‌ : రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకునే విషయంపై చర్చిందేందుకు ఎంఐఎం అత్యవసర సమావేశం సోమవారం ప్రారంభమైంది. మజ్లిస్‌ పార్టీకి 1 ఎంపీ, 7గురు ఎమ్మెల్యేల బలం ఉంది. ప్రభుత్వం పాతబస్తీలో పోలీసులను భారీ ఎత్తున మోహరించింది.…

ట్రాక్టర్‌ బోల్తా : ఐదుగురి మృతి

కర్నూలు: పెళ్లి బృందంతో వెళుతున్న ట్రాక్టర్‌ బోల్తా పడి ఐదుగురు మృతి చెందిన ఘటన కర్నాలు జిల్లా వెలుగోడు మండలం వేల్పనూరులో చోటుచేసుకుంది. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ప్రమాదంలో గాయపడిన మరో 10 మందిని…

రైతుల కష్టాలు తెలుసు : కేంద్ర మంత్రి చిరంజీవి

ఏలూరు: ఉభయగోదావరి జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ఈరోజు పర్యటిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వైఎస్‌ఆర్‌ కాలనీలో వరత బాధితులకు చిరంజీవి నిత్యావసర వస్తువులను పంపీణీ చేశారు. నీలం తుఫాను ప్రభావంతో…

‘నీలం’ బాధితులను ఆదుకుంటాం: చిరంజీవి

కృష్ణా: నీలం తుపాను బాధితులను అదుకుంటామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి పేర్కొన్నారు. ఉభయ గోదావరి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చిరంజీవి నేడు పర్యటించనున్నారు. ఆయన కాసేపటి క్రితమే గన్నవరం ఎయిర్‌పోర్టు చేరుకున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి…

2జీ స్పెక్ట్రమ్‌ వేలం ప్రారంభం

ఢిల్లీ: సుప్రీంకోర్టు ఆదేశాలతో 2జీ స్పెక్ట్రమ్‌ వేలం ఢిల్లీలో సోమవారం ఉదయం ప్రారంభమైంది. వేలం పాటలో ఐదు సంస్థలు పాల్గోన్నాయి, ఈ వేలం ద్వారా ప్రభుత్వానికి రూ.40 వేల కోట్ల ఆదాయం వస్తుందని కేంద్రం అంచనా వేసింది. 22…

ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి

ఛత్తీస్‌గఢ్‌: బీజాపూర్‌ జిల్లా పాలగూడెం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కంబాలిపేట అటవీప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య హోరాహోరిగా ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టు మృతి చెందారు. ఘటనా స్థలంలో మావోయిస్టుల ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: సోమవారం స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. 30 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్‌ కొనసాగుతుండగా,10 పాయింట్లకు పైగా నిఫ్టీ లాభంలో కొనసాగుతొంది.