Saturday, 14 November 2026

వార్తలు

తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయాలి: వీహెచ్‌

హైదరాబాద్‌: తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ స్పష్టమైన హామీ ఇవ్వాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత. రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు అభిప్రాయపడ్డారు. పార్టీలో కొత్తరక్తం ఎక్కించాలనే ఉద్దేశంతోనే డీసీసీ అధ్యక్షులుగా కొత్తవారిని నియమించనున్నట్లు తెలియజేశారు. ముఖ్యమంత్రి జిల్లాల్లో చేపడుతున్న…

ప్రధాని పదవిపై ఆసక్తి లేదు: అద్వానీ

ఢిల్లీ: తనకు ప్రధాని పదవిపై ఆసక్తి లేదని భాజపా సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానీ అన్నారు. పార్టీ కంటే ప్రధాని పదవి చిన్నదేనని అభిప్రాయపడ్డారు. పార్టీకి చేయాల్సింది. ఇంకా చాలా ఉందని, భాజపా, దేశం తనకు చాలా ఇచ్చాయన్నారు.

పీసీసీ చీఫ్‌తో డిప్యూటీ సీఎం, మంత్రుల భేటీ

హైదరాబాద్‌: పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్శింహ, మంత్రులు డీఎల్‌ రవీంద్రారెడ్డి, సారయ్య భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు అంశాలపై వీరు చర్చించనున్నారు.

గవర్నర్‌తో సీఎం భేటీ

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గవర్నర్‌ నరసింహన్‌తో ఈరోజు ఉదయం భేటీ అయ్యారు. శుక్రవారం సీఎం ఢిల్లీ వెళ్లాల్స ఉన్నందున ఈ భేటికి ప్రాధాన్యత సంతరించుకుంది. నీలం తుపాను వల్ల రాష్ట్రంలో కలిగిన నష్టంతో పాటు తాజా రాజకీయ పరిణామాలు…

బెంగళూరులో అగ్నిప్రమాదం

బెంగళూరు: నగరంలో బర్జర్‌ పెయింట్స్‌ గోదాంలో ఈ రోజు భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది 12 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సివుంది.

ముఖ్యమంత్రితో మంత్రి ధర్మాన భేటీ

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో మంత్రి ధర్మాన ప్రసాదరావు సచివాలయంలో భేటీ అయ్యారు. భేటికి గల కారణాలు తెలియరాలేదు.

లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

చేగుంట: మెదక్‌ జిల్లా చేగుంట మండలం వల్లూరు వద్ద ఈ రోజు ఉదయం ఆర్టీసీ బస్సు లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో 10 ప్రయాణికులకు గాయాలయ్యాయి.

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్‌: బులియన్‌ మార్కెట్లో బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం రూ. 31,650, 22 క్యారెట్ల బంగారం 29,950, వెండి కిలో రూ.…

కోర్టుల నూతన భవనాలకు రూ.176 కోట్లు మంజూరు: మంత్రి ఏరాసు

నంద్యాల: రాష్ట్రంలో 29 కోర్టులకు కొత్త భవనాలను  నిర్మించేందుకు రూ.176 కోట్లు మంజూరైనట్లు రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి తెలియజేశారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా రూ. 16 కోట్లతో…