Friday, 13 November 2026

వార్తలు

బీహార్‌లో పడవ ప్రమాదం

పాట్నా: బీహార్‌లో ఘోర పడవ ప్రమాదం జరిగింది. బెగుసరాయ్‌ జిల్లా మధు రాపూర్‌ సమీపంలోని గంగా నదిలో ఈ రోజు ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 17 మంది గల్లంతు కాగా వీరిలో ఆరుగురి…

ఇండియన్‌ ముజాహిద్దీన్‌కు చెందిన ముగ్గురు తీవ్రవాదులు అరెస్టు

ఢిల్లీ: తీవ్రవాద సంస్థ ఇండియన్‌ ముజాహిద్దీన్‌కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను ఢిల్లీ పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. వీరి నుంచి భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.

గిద్దలూరు నుంచి ఒంగోలు బయలుదేరిన సీఎం

గిద్దలూరు: ప్రకాశం జిల్లాలో ఇందిరమ్మ బాట పర్యలనలో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గిద్దలూరు నుంచి ఒంగోలు బయలుదేరి వెళ్లారు. బుధవారం రాత్రి గిద్దలూరు ఆర్‌ అండ్‌ బి అతిధిగృహంలో సీఎం బస చేశారు. చివరిరోజు పర్యలనలో  భాగంగా ఒంగోలు,…

ఎర్రచందనం స్వాధీనం

రైల్వేకోడూరు: కడప జిల్లా రైల్వేకోడూరు మండలం ఉర్లగట్టుపాడు వద్ద 42 ఎర్రచందన దుంగలను అటవీశాఖ అధికారులు ఈ రోజు ఉదయం స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 20 లక్షలు ఉండవచ్చని అధికారులు తెలియజేశారు.

విశాఖ ఉక్కు పరిశ్రమలో బంద్‌ వాయిదా

విశాఖపట్నం: విశాఖ ఉక్కు పరిశ్రమలో శుక్రవారం నుంచి తలపెట్టిన బంద్‌ వాయిదా వేస్తున్నట్లు కార్మిక సంఘాలు తెలియజేశారు. పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో జాప్యం జరిగే సూచనల కనిపిస్తున్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్మిక సంఘాల నేతలు వెల్లడించారు.

బాబ్లీపై మహారాష్ట్రను తప్పుబట్టిన సుప్రీం

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 10 (జనంసాక్షి):బాబ్లీ సాగునీటి ప్రాజెక్ట్‌పై మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం మొట కాయ వేసింది. ప్రాజెక్ట్‌ విషయంలో ఆ రాష్ట్ర వైఖరిని తీవ్రంగా తప్పు పట్టింది. బాబ్లీ వివాదంపై ప్రాథమిక విచారణను సర్వోన్నత న్యాయస్థానం బుధవారం పూర్తిచేసింది.…

హైదరాబాద్ లో ఏటీఎం సేవలకు అంతరాయం

హైదరాబాద్‌: నగరంలోని అనేక బ్యాంకులకు చెందిన ఏటీఎంలలో నగదు వుంచే సీఎంఎస్‌ సంస్థ లాకౌట్‌ ప్రకటించడంతో అనేక ఏటీఎంలు తాత్కాలికంగా పనిచేయడం లేదు. సంస్థలాకౌట్‌తో జంటనగరాల్లో దాదాపు 1500 ఏటీఎం సేవలు నిలిచిపోయినట్లు సమాచారం. ఏటీఎంలు పనిచేయకపోవడంతో వినియోగాదారులు…

విశ్వవిద్యాలయంలో తెలంగాణా ఉద్యాగులకు అన్యాయం: కోదండరాం

హైదరాబాద్‌: ఆచార్య ఎన్జీరంగా వ్వవసాయ విశ్వవిద్యాలయాన్ని తెలంగాణా విశ్వవిద్యాలయంగా మార్చాలని తెలంగాణ రాజకీయ అధ్యక్షుడు కోదండరాం డిమాండ్‌ చేశారు. అవసరం అయితే రాయలసీమ, ఆధ్ర ప్రాంతాల్లో వేర్వేరుగా వ్వవసాయ విశ్వ విద్యాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని సూచించారు. సోమాజీగూడ…

అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు:అహ్మదుల్లా

కడప: మైనారీటీ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌లో అక్రమాలకు పాల్పడినవారిపై కఠినచర్యలు తీసుకుంటామని మంత్రి అహ్మదుల్లా తెలియజేశారు. నల్లకుంట, బండ్లగూడ,  కోఠిలోని 3 శాఖల్లో రూ. 55.45 కోట్లు మాయమైనట్లు తేలిందని ఆయన వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే నలుగురిని…