Sunday, 8 November 2026

వార్తలు

ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్య

అదిలాబాద్‌: మంచిర్యాల మండలం అర్కే-6 కాలనీలో భార్యాభర్తలు ఈ రోజు తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందులతోనే వీరు ఆత్మహత్యకు  పాల్పడినట్లు స్థానికులు తెలియజేశారు. పంట నష్టపోయిన కౌలురైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ రాసిన  లేఖ సంఘటనాస్థలంలో దొరికింది.

నెల్లూరు ఘటనపై సమగ్ర విచారణకు సీఎం ఆదేశం

నెల్లూరు: తడ సమీపంలో అర్టీసీ బస్సులో ప్రయాణికులపై జరిగిన దాడిపై సమగ్ర విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి డీజీపీ దినేష్‌రెడ్డి ఆదేశించారు. ఈ ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు ఆయన సంతాపం తెలియజేశారు. బాధిత కుటుంబాలకు తక్షణమే సహాయక…

గుర్రాల రేణుక విద్యుత్‌ షాక్‌తో మృతి

మెదక్‌: మెదక్‌ జిల్లా వర్గల్‌ మండలం పాతూరు గ్రామంలో ఈ రోజు ఉదయం విద్యుదాఘాతంతో ఓ యువతి మృతిచెందింది. గుర్రాల రేణుక అనే యువతి ఇంట్లో బట్టలు ఆరేస్తుండగా విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయపడింది. చికిత్స నిమిత్తం కుటుంబసభ్యులు…

శాంతిసౌంరాజన్‌ పరిస్థితిపై అజయ్‌ మాకెన్‌ సీరియస్‌

ప్రభుత్వం నుండి న్యాయసహాయం అందిస్తామని ప్రకటన న్యూఢిల్లీ, జూలై 25(జనంసాక్షి): ఆర్థికపరమైన ఇబ్బందులలో చిక్కుకున్న తమిళనాడు అథ్లెట్‌ శాంతి సౌందరాజన్‌ పరిస్థితిపై కేంద్ర క్రీడాశాఖా మంత్రి అజయ్‌ మాకెన్‌ స్పందించారు. ఆమెకు ప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయం…

పెట్రోలు ధర పెంపుపై మండిపడ్డ మమత

కోల్‌కతా: పెంచిన పెట్రోలు ధరపై పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనార్జీ మరోసారి కేంద్రంపై మండిపడ్డారు. పెట్రోలు ధర పెంపు నిర్ణయాన్ని దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కితీసుకోవాలని డిమాండ్‌ చేశారు. యూపీ ఏ భాగస్వామ్య పక్షాలథక్ష సంప్రదించకుండా ప్రభుత్వం…

రిజిస్ట్రేషన్ల ఛార్జీల పెంపు

హైదరాబాద్‌: భూక్రయ విక్రయాలకు సంబంధించిన అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్ల ఛార్జీలను ప్రభుత్వం పెంచింది. ఈసీ ఛార్జీలు భారీగా పెరిగాయి.

కాల్‌ డేటా కేసులో ఒకరి అరెస్టు

హైదరాబాద్‌: సీబీఐ జైడీ లక్ష్మీనారాయణ కాల్‌డేటా కేసులో కె.వెంకటరెడ్డి అనే వ్యక్తిని సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని ఇందు భరత్‌ ఎనర్జీ వైన్‌ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న వెంకటరెడ్డిని హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. రేపు నాంపల్లి కోర్టులో ఇతన్ని…

హైదరాబాద్‌లో భారీ వర్షం

హైదరాబాద్‌: నగరంలో భారీ వర్షం కురిసింది. ఖైరతాబాద్‌, పంజాగుట్ట, అమీర్‌పేట, దిల్‌సుఖ్‌ నగర్‌, ఎల్బీనగర్‌, హయత్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం నమోదయింది. వర్షంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.

సూరి హత్య కేసులో మరో ఇద్దరి అరెస్టు

హైదరాబాద్‌: మద్దెల చెర్వు సూరి హత్యకేసులో నీల శ్రీనివాసరావు, పెనకొండ నర్సింహరావులను సీఐడాపోలీసులు అరెస్టు చేశారు. హంద్రీనీవా ప్రాజెక్టులో గుత్తేదారులను బెదిరించి డబ్బు వసూలుచేసి భాను ఖాతాలోకి వీరు మళ్లించినట్లు సీఐడీ పోలీసులు తెలిపారు. వీరిని గురువారం నాంపల్లి…

రాజేశ్‌ఖన్నా చితాభస్మం గంగలో

రిషికేష్‌: బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ రాజేశ్‌ఖన్నా చితాభస్మాన్ని బుధవారం పవిత్ర గంగానదిలో కలిపారు. ఉత్తరాఖండ్‌లోని రిషికేష్‌లో ఈ కార్యక్రమం జరిగింది. రాజేశ్‌ఖన్నా భార్య డింపుల్‌ కపాడియా, కుమార్తె రింకీలు ముంబాయి నుంచి తీసుకొచ్చిన చితాభస్మాన్ని శాస్త్రోక్తంగా గంగాలో కలిపారు. కార్యక్రామిన్న…