Saturday, 21 November 2026

తెలంగాణ

మరికాసేపట్లో భద్రాచలం చేరుకోనున్న ముఖ్యమంత్రి కేసీఆర్

వర్షంలోనే వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్ మరికాసేపట్లో భద్రాచలం చేరుకోనున్నారు. ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి నదీ ప్రవాహాన్ని, పరిసర ప్రాంతాలను గోదావరి బ్రిడ్జి మీద నుంచి సీఎం కేసీఆర్ పర్యవేక్షిస్తారు. అనంతరం గోదావరి వరద తాకిడికి గురైన…

వర్షంలోనే సిఎం కేసీఆర్ పర్యటన..

భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నది వరద ముంపు పరిస్థితులు, ప్రజల కష్ట నష్టాలు తెలుసుకుని తగిన సహాయ కార్యక్రమాలు అందించేందుకు నిన్న వరంగల్ చేరుకున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదివారం ఉదయం భద్రాచలం పర్యటనకు బయలుదేరారు.…

కొండచిలువను సురక్షితంగా కాపాడిన ఫారెస్ట్ అధికారులు

 కొత్తగూడ జూలై 17 జనంసాక్షి:మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలం వేలుబెల్లి చెరువులో వలలో చిక్కుకున్న కొండచిలువను కొత్తగూడ ఫారెస్ట్ రేంజ్ అధికారి వజహత్,ఫారెస్ట్ బృందంతో కలిసి కొండచిలువను సురక్షితంగా వల నుండి బయటకు తీసి ఫారెస్ట్ ప్రాంగణంలో విడిచి…

బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థులకు అస్వస్థత చాలా బాధాకరం

-బి.ఎస్.పి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి పాలెం వెంకటయ్య మక్తల్, జూలై 17 (జనం సాక్షి) నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటి లో కలుషితా ఆహారం తిని ఫుడ్ పాయిజన్ అయిన విద్యార్థులకు తక్షణమే మంచి వైద్యం అందించాలని,…

రాజకీయ పార్టీలకు అతీతంగా రుద్రూర్ బోనాల పండుగ

      రుద్రూర్ బోనాల పండుగలో ముచ్చటగా మూడు పార్టీలకు చెందిన నాయకులు రుద్రూర్ (జనంసాక్షి): రుద్రూర్ మండలం కేంద్రంలో బోనాల పండుగ కన్నుల పండుగ సాగింది, ప్రతి సంవత్సరం లాగానే గ్రామ ప్రజలు తమకు ఇష్టమైన…

అనాథ కుటుంబానికి అండగా సురక్ష పౌండేషన్ సభ్యులు

– నెల రోజులకు సరిపడే నిత్యావసర సరుకుల పంపిణీ – కృతజ్ఞతలు తెలిపిన బాధిత కుటుంబీకులు మక్తల్, జూలై 17 (జనం సాక్షి) మక్తల్ పట్టణం రంగుల వీధికి చెందిన రంగుల శ్యామల అనే నిరుపేద కుటుంబీకులకు ఆదివారం…

జూలూరుపాడులో “ఆషాఢ బోనాల” జాతర

* మైసమ్మ తల్లికి పూజలు చేసిన మహిళలు   జూలూరుపాడు, జులై 17, జనంసాక్షి: ఆషాఢమాసం సందర్భంగా ప్రతి ఏటా అమ్మవారికి భక్తులు నైవేద్యాలు సమర్పించి ఘనంగా పూజలు చేస్తుంటారు. ఇందులో భాగంగానే ఆదివారం జూలూరుపాడు గ్రామంలోని శ్రీ…

చలో ఢిల్లీ విజయవంతం చేయండి

  * బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ కరీంనగర్ బ్యూరో (జనం సాక్షి) : ఆగస్టు 7 న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు…

పినపాక నియోజకవర్గం జూలై 17 (జనం సాక్షి): రాష్ట్రంలో భారీగా కురిసిన వర్షాలతో ముంపుకు గురైనా భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలంలోని పునరావస బాదితులను రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ ఆదివారం పునరావాస కేంద్రాలలో ఉన్న బాధితులను పరామర్శించారు. సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన గవర్నర్ మణుగూరు మండలం రైల్వే స్టేషన్ లో దిగారు. స్థానిక అధికారులు వారికి ఘనస్వాగతం పలికారు అక్కడి నుంచి అశ్వాపురం మండలంలోని ఎస్కేటి ఫంక్షన్ హాల్లో నిర్వాసితులను కలిసి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ రాధాకృష్ణ రెడ్ క్రాస్ సొసైటీ కాంతారావు స్వచ్ఛంద సంస్థల సహకారంతో నిర్వాసితులకు నిత్యవసర సరుకులు మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాత్కాలికంగా సరుకులు భోజనాలు మందులు ఏర్పాటు చేశారు. మళ్లీ ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ముఖ్యమంత్రి బాధితులతో మాట్లాడలేదని ధర్నా: అశ్వాపురం మండలంలో రహదారి పై నిర్వాసితులు ధర్నాకు దిగారు. ఆదివారం ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా అశ్వాపురం మండలంలో ముంపుకు గురైన ఐదు మండలాల నిర్వసితులను పరామర్శించకుండా వెళ్లారని రహదారిపై ధర్నాకు దిగారు. మా గోడును వారికి చెబుతామనుకుంటే వారికి మొండి చేయి ఎదురైంది.. అశ్వాపురం మండలంలో ఐదు గ్రామాలలో 15 వేల మందికి పైగా జీవిస్తున్నారు. వారికి ప్రాణనష్టం జరగకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించే క్రమంలో ఎక్కడ వస్తువులను అక్కడే వదిలి కట్టుబట్టలతో పునరావస కేంద్రాలకు తరలించారు. అప్పటినుంచి అధికారులు సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన బట్టలతో మూడు రోజుల నుంచి ఇక్కడే ఉన్నాము మాకు అధికారులు గానీ ప్రజాప్రతినిదులు కానీ రాలేదు.మాకు కట్టుకోవడానికి బట్టలు దుప్పట్లు లేక అవస్థలు పడుతున్నాం. చిన్నపిల్లలు దగ్గు జ్వరం వచ్చి అనారోగ్యం పాలై ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికి మందులు ఇవ్వడానికి ఎవరు అందుబాటులో లేకపోవడం బాధాకరమని అన్నారు. కనీసం మా గోడును ముఖ్యమంత్రితో చెప్పుకుందామనుకుంటే ఆగకుండా వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షిణమే మాకు డబల్ బెడ్ రూమ్ ఇళ్లని నష్టపోయిన పంట పొలాలకు పాడైపోయిన ఇండ్లకు వస్తువులకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

మిర్యాలగూడ. జనం సాక్షి  మహిళల అభ్యున్నతికి సిపిఐ కృషి చేస్తుందని ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు అన్నారు. మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఆదివారం యాద్గార్ పల్లి గ్రామంలో సభ్యత్వ నమోదు చేపట్టారు ఈ సందర్భంగా…

అశ్వాపురం మండలంలో పర్యటించిన గవర్నర్ తమిళ సై

పినపాక నియోజకవర్గం జూలై 17 (జనం సాక్షి): రాష్ట్రంలో భారీగా కురిసిన వర్షాలతో ముంపుకు గురైనా  భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలంలోని పునరావస  బాదితులను రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ ఆదివారం పునరావాస కేంద్రాలలో ఉన్న…