Monday, 9 November 2026

తెలంగాణ

సీమాంధ్ర నేతల రాజీనామాలు సీఎం పన్నిన కుట్ర: కర్రె ప్రభాకర్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): సీమాంధ్ర నేతల రాజీనామాలు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పన్నిన కుట్రేనని కర్రె ప్రభాకర్‌ అన్నారు. ఇవాళ ఆయన సీమాంధ్ర  మంత్రుల రాజీనామాలపై మీడియాతో మాట్లాడారు. సీమాంధ్ర నేతలు ఇంకా ఉన్మాదంతో ప్రేట్రేగిపోతున్నారని ఆయన విమర్శించారు. నాయకులు రెచ్చగొట్టడంతోనే సీమాంధ్రలో…

బిల్లు పెట్టేవరకు పోరాటం ఆగదు: టీజేఏసీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టేవరకు తమ పోరాటం ఆగదని తెలంగాణ జేఏసీ నేతలు తెగేసి చెప్పారు. ఇవాళ బీజేపీ అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డితో వారు భేటీ అయ్యారు. తెలంగాణ ఉద్యమ భవిష్యత్‌ కార్యాచరణపై వారు చర్చించారు. తెలంగాణ…

పీవీ రంగారావు కు సీఎం నివాళులు

హైదరాబాద్‌,(జనంసాక్షి): ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ రోజు ఉదయం తుదిశ్వాస వదిలిన మాజీ మంత్రి పీవీ రంగారావు నివాసానికి చేరుకుని ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. శాసనసభ, శాసనమండలి స్పీకర్లు నాదెండ్ల మనోహర్‌, చక్రపాణి, విజయవాడ ఎమ్మెల్యే మల్లాది విష్ణు…

కిషన్‌రెడ్డితో భేటీ కానున్న టీ జేఏసీ నేతలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డితో తెలంగాణ జేఏసీ నేతలు భేటీ కానున్నారు. ఇవాళ వారు కలిసి రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు, తెలంగాణ ఉద్యమ భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించనున్నారు.

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు 17 గేట్లు ఎత్తివేత

నిజామాబాద్‌,(జనంసాక్షి): శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు 17 గేట్ల ఎత్తివేశారు. ప్రాజెక్టులోని ఇన్‌ఫ్లో లక్షా 25 వేల క్యేసెక్కులు ఉండగా, ఔట్‌ఫ్లో 35 వేల క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులోని నీటిమట్టం 1090.45 అడుగులుగా ఉంది.

పీవీ రంగారావు మృతికి సంతాపం తెలిపిన ప్రణబ్‌ ముఖర్జీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): మాజీ ప్రధాని పీవీ నరసింహరావు కుమారుడు , మాజీ మంత్రి పీవీ రంగారావు మృతికి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ సంతాపం తెలిపారు. తమిళనాడు గవర్నర్‌ రోశయ్య పీవీ రంగారావు మృతిపట్ల సంతాపం తెలిపారు.

భారీ వర్షాలకు నిలిచిన బొగ్గు ఉత్పత్తి

కరీంనగర్‌,(జనంసాక్షి): గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రామగుండం డివిజన్‌లోని నాలుగు ఓపెన్‌కాస్ట్‌ గనుల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. క్వారీల్లోకి అధకంగా నీరు వచ్చి నిలవడంతో యంత్రాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో లక్ష టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.

సెల్‌ఫోన్‌ పేలి విద్యార్థులకు గాయాలు

నల్లగొండ,(జనంసాక్షి): జిల్లాలోని మిర్యాలగూడలోని ప్రభుత్వ పాఠశాలలో సెల్‌ఫోన్‌ పేలి నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.

బ్యాంక్‌ ఉద్యోగి ఆత్మహత్య

హైదరాబాద్‌,(జనంసాక్షి): నగరంలోని రామంతాపురం ఎస్‌బీహెచ్‌ బ్యాంక్‌లో పనిచేసే కిరణ్‌ అనే ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

కేటీపీఎస్‌లో నిలిచిన విద్యుత్‌ ఉత్పత్తి

ఖమ్మం,(జనంసాక్షి): పాల్వంచలోని కేటీపీఎస్‌ 5,6 దశల్లోని 10,11 యూనట్లలో అధికారులు ఉదయం వార్షిక మరమ్మతులు చేపట్టారు. ఫలితంగా 750 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి ఏర్పడింది. 10 వ యూనిట్‌లో 15 రోజుల పాటు, 11 యూనిట్‌లో 30 రోజుల…