Monday, 9 November 2026

తెలంగాణ

హోటల్‌ గదిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది

ఖైరతాబాద్‌: లక్డీకపూల్‌లోని హిల్‌ పార్క్‌ హోటల్‌ గదిలో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, హోటల్‌ యజమానుల కథనం ప్రకారం ఓ యువతి నగరంలో ఇంటర్వ్యూ కోసం వచ్చినట్లు హోటల్‌ సిబ్బందికి చెప్పి గది తీసుకుంది.…

త్రిమూర్తులకు హైకమాండ్‌ నుంచి పిలుపు

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణపై రోడ్‌మ్యాప్‌ నవేదించి, కాంగ్రెస్‌ వార్‌రూమ్‌ భేటీలో పాల్గొన్న త్రిమూర్తులకు కాంగ్రెస్‌ హైకమాండ్‌ నుంచి పిలుపు వచ్చింది. సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలను మంగళవారం ఉదయం హస్తిన…

మహంకాళి ఆలయంలో రంగం వేడుక

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఉజ్జయిని మహంకాళి ఆలయంలో రంగం వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా భవితవ్యంను స్వర్ణలత చెప్పారు. ఉత్సవ ఏర్పాట్లపై స్వర్ణలత సంతప్తి వ్యక్తం చేశారు. ప్రజలు అందరూ సుఖ, సంతోషాలతో ఉండాలని ఆశ్వీరదించారు.

వైభవంగా జరుగుతున్న ఉజ్జయిని మహంకాళి ఉత్సవాలు

హైదరాబాద్‌ : సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు ఉత్సవాలు రంగం వేడుకతో ఈ ఉదయం ప్రారంభమరయ్యాయి.

సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో సీమాంధ్ర నేతల భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి:) ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో సీమాంధ్ర నేతలు ఉండవల్లి అరుణ్‌కుమార్‌, వీఆరెడ్డి భేటీ అయ్యారు. సమావేశంలో ఢిల్లీ పరిణామాలు, తెలంగాణ అంశంపై చర్చించినట్లు సమాచారం.

నాంపల్లి కోర్టుకు హాజరైన ధర్మాన, సబిత

హైదరాబాద్‌,(జనంసాక్షి): జగన్‌ అక్రమాస్తుల కేసులో నాంపల్లి కోర్టుకు మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. జగన్‌ అక్రమాస్తుల కేసులో వీరిద్దరూ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం విదితమే.

కాంగ్రెస్‌, సీపీఐ నేతల మధ్య ఘర్షణ

నల్లగొండ,(జనంసాక్షి):చందంపేట మండలం ముడుగండ్లలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్‌, సీపీఐ నేతలు, కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా…

నేటితో ముగియనున్న తుది విడత ఎన్నికల ప్రచారం

హైదరాబాద్‌:తుది విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రంతో ముగియనుంది. మూడో విడత పంచాయతీ ఎన్నికలు ఈ నెల 31 జరగనున్నాయి. నేడు ఒక్కరోజే సమయం ఉండటంతో అభ్యర్థులు ప్రచారాన్ని గ్రామాల్లో ఉద్ధృతం చేశారు.

దుండగుల చేతిలో హత్యకు గురైన రౌడీషీటర్‌ శంకర్‌

హైదరాబాద్‌ : సరూర్‌నగర్‌ మండలం మీర్‌పేట లెనిస్‌నగర్‌లో రౌడీషీటర్‌ శంకర్‌ దారుణ హత్యకు గురయ్యాడు. ఆదివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న శంకర్‌ను స్థానికంగా నిర్మాణంలో ఉన్న భవనంలోకి తీసుకెళ్లి దుండగులు కత్తులతో పొడిచి చంపారు. ఈ హత్యకు కుటుంబ…

ద్విచక్రవాహనం, ఆటో ఢీ:ఆరుగురికి గాయాలు

కాగజ్‌నగర్‌ గ్రామీణం: మండలంలోని ఈద్గాం కూడలిలో ద్విచక్రవాహనం, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు గాయపడ్డారు. వీరిని కాగజ్‌నగర్‌ ఆసుపత్రికి తరలించారు.