Sunday, 8 November 2026

తెలంగాణ

భాజపా తెలంగాణ ఉద్యమ సదస్సు నేడు

హైదరాబాద్‌: భాజపా ఆధ్వర్యంలో మధ్యాహ్నం సికింద్రాబాద్‌ సిక్‌విలేజ్‌లోని రాజరాజేశ్వరి గార్డెన్‌లో తెలంగాణ ఉద్యమ ప్రత్యేక సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు అపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో పాటు, భాజపా తెలంగాణ ఉద్యమ కమిటీ నేతలు హాజరుకానున్నారు.

హైదరాబాద్‌ మార్కెట్లో బంగారం ధరలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): నగర మార్కెట్లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 26,750లు కాగా ,22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 25,900లుగా ఉంది. కిలో వెండి ధర…

కోనేరు ప్రసాద్‌ పిటీషన్‌పై నిర్ణయం ఎల్లుండి

హైదరాబాద్‌,(జనంసాక్షి):దుబాయ్‌ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఎమ్మార్‌ నిందితుడు కోనేరు ప్రసాద్‌ పెట్టుకున్న పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ముగిసింది. దీనిపై నిర్ణయాన్ని హైకోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది.

మత్తు మందులు తయారుచేస్తున్న కంపెనీపై పోలీసుల దాడి

మెదక్‌జిల్లా: పటాన్‌చెరు మండలం పాశమైలారంలో మత్తు మందులు తయారుచేస్తున్న కంపెనీపై పోలీసులు దాడిచేశారు. గత రెండు రోజులుగా దాడులు చేసి చెన్నై పోలీసులు నిందితులను నేడు అదుపులోకి తీసుకున్నారు.

తిరిగి జులై 4న ప్రజా పద్దుల సంఘం సమావేశం

హైదరాబాద్‌ : శాసనసభ కమిటీ హాలులో ఇవాళ సమావేశమైన ప్రజా పద్దుల సంఘం రెవెన్యూ అధికారులు పూర్తి సమాచారంతో రానందుకు వాయిదా పడింది. తిరిగి వచ్చే నెల 4న సమావేశం నిర్వహించాలని సంఘం నిర్ణయించింది.

పటాన్‌చెరువులో ఫార్మా కంపెనీపై దాడి

హైదరాబాద్‌,(జనంసాక్షి): పటాన్‌చెరువులో ఫార్మా కంపెనీపై పోలీసులు దాడి చేశారు. రూ. కోటి విలువైన ఎపిడ్రియల్‌ మత్తుమందు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అధికారులు అరెస్టు చేశారు. విదేశాలకు సరఫరా చేయడానికి సిధ్దమౌతుండగా ఈ డ్రగ్స్‌ను పట్టుకున్నారు.

కోనేరు ప్రసాద్‌ పిటిషన్‌పై నిర్ణయం ఎల్లుండి

హైదరాబాద్‌ : దుబాయ్‌ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఎమ్మార్‌ నిందితుడు కోనేరు ప్రసాద్‌ పెట్టుకున్న పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ముగిసింది. దీనిపై నిర్ణయాన్ని హైకోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది.

జాతీయపార్టీల నేతల ముగిసిన టీ జేఏసీ భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): జాతీయ పార్టీల నేతలతో తెలంగాణ రాజకీయ జేఏసీ, ఉద్యోగసంఘాల జేఏసీ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్‌ కోదండరాం మాట్లాడుతూ ఈ నెల 29న మాసబ్‌ట్యాంక్‌లో ప్రజాకోర్టు నిర్వహిస్తామని తెలిపారు. జులై 4,5 తేదీల్లో ఢిల్లీలో…

ఈ నెల 29న మాసాబ్‌ట్యాంక్‌ వద్ద ప్రజాకోర్టు కోదండరాం

హైదరాబాద్‌ : చలో అసెంబ్లీలో ప్రభుత్వం అనుసరించిన తీరుపై ఈ నెల 29న మాసాబ్‌ ట్యాంక్‌ వద్ద ప్రజాకోర్టు నిర్వహించనున్నట్లు తెలంగాణ ఐకాస కన్వీనర్‌ కోదండరాం తెలిపారు. హైదరాబాద్‌తో కూడిన జిల్లాల సాధన మాత్రమే తమ డిమాండ్‌ అని…

కార్మిక సంఘాలతో ఆర్టీసీ చర్చలు విఫలం

హైదరాబాద్‌ : సమ్మె నోటీసు ఇచ్చిన ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో యాజమాన్యం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో జులై 5 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు దిగాలని ఈయూ, టీఎంయూ సంఘాలు నిర్ణయించాయి. ఒప్పంద కార్మికుల క్రమబద్దీ కరణ,…