Sunday, 8 November 2026

తెలంగాణ

మాజీ మంత్రి మోపిదేవికి ఛాతినొప్పి

హైదరాబాద్‌ : చంచల్‌ గూడ జైలులో ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణను ఛాతి నొప్పితో బాధపడుతున్నారు. దీంతో ఆయన్ను జైలు అధికారులు కొద్ది సేపట్లో ఉస్మానియా ఆస్పత్రికి తరలించనున్నారు.

శాసనసభాపక్ష నేతల సమావేశానికి తెదేపా దూరం

హైదరాబాద్‌ : సభాపతి ఛాంబర్‌లో జరగనున్న శాసనసభా పక్ష నేతల సమావేశానికి హాజరు కావాల్సిందిగా తెదేపాను ప్రభుత్వ విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి కోరారు. సమావేశానికి దూరంగా ఉండాలని తెదేపా నిర్ణయించింది.

శాసనసభ అరగంట వాయిదా

హైదరాబాద్‌ : శాసనసభ ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడింది. తెరాస సభ్యులు స్పీకర్‌ పోడియం చుట్టుముట్టి వేశారు. శాసనసభాపక్ష నేతలను తన ఛాంబర్‌కు వచ్చి మాట్లాడాల్సిందిగా ఆయన ఆదేశించారు.

వాయిదా తీర్మానాలను తిరస్కరించిన స్పీకర్‌

హైదరాబాద్‌ : వివిధ అంశాలపై పార్టీలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్‌ తిరస్కరించారు. ఏపీపీఎస్పీ అక్రమాలపై తెదేపా, అక్రమ అరెస్టులపై తెరాస, మగ్దూం భవన్‌పై పోలీసుల దాడి అంశంపై సీపీఐ వాయిదా తీర్మానాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఏపీపీఎస్పీ అక్రమాలపై తెదేపా ఆందోళన

హైదరాబాద్‌ : ఏపీపీఎస్సీ ప్రక్షాళనకు డిమాండ్‌ చేస్తూ గస్‌పార్కు వద్ద తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా తెదేపా ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర మాట్లాడుతూ అనర్హులైన సభ్యులను వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఏపీపీఎస్సీలో అక్రమాలపై…

శాసనసభలో నేటి వాయిదా తీర్మానాలు

హైదరాబాద్‌ : అసెంబ్లీ సమావేశాల్లో సోమవారం వివిధ పార్టీలు స్పీకర్‌కు తమ వాయిదా తీర్మానాలను ఇచ్చాయి. ఏపీపీఎస్సీ ప్రక్షాశనపై తెదేపా వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది. చలో అసెంబ్లీ సందర్భంగా మగ్దూం భవన్‌పై పోలీసుల దాడి, తెలంగాణ వాదుల అక్రమ…

గుడిసెల తొలగింపుతో ఉద్రిక్తత

కరీంనగర్‌: తిమ్మాపూర్‌ మండలం అలుగునూరులో గుడిసెల తొలగింపు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ప్రభుత్వ స్థలంలో వేసిన గుడిసెలను అధికారులు తొలగించారు. దీంతో తొలగింపును నిరసిస్తూ 10 మంది అత్మహత్యాయత్నం చేశారు.

హైదరాబాద్‌ నుంచి అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లు రావాలి:

లక్ష్మణ్‌ హైదరాబాద్‌ : హైదరాబాద్‌ నుంచి మరి కొంత మంది అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లు తయారు కావాల్సిన అవసరం ఉందని మాజీ టెస్టు బ్యాట్స్‌మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ అన్నారు. హెచ్‌సీఏ టోర్నీల్లో సత్తా చూపిన అటగాళ్లను హైదరాబాద్‌ క్రికెట్‌…

టీయర్‌గ్యాస్‌ పేలి ఇద్దరు చిన్నారులకు గాయాలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఉస్మానియా యూనివర్శిటీ గ్రౌండ్‌లో టియర్‌గ్యాస్‌ పేలి చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటన వివరాల్లోకి వెళితే గురు, శుక్ర, శనివారాల్లో మూడు రోజులు ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులపైకి పోలీసులు విచ్చలవిడిగా టియర్‌గ్యాస్‌ ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఇందులో పేలని…

బైక్‌-లారీ ఢీ: ఇద్దరు మృతి

వరంగల్‌,(జనంసాక్షి): జిల్లాలోని డోర్నకల్‌ మండలం గొర్లచర్ల గ్రామం సమీపంలో లారీ బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతుల వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.